సబ్ ఫీచర్

దేహమే దేవాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సమాజ ఆధ్యాత్మిక సంస్కృతికి ఆలయాలు పట్టుకొమ్మలు. సనాతన ధర్మ ఔన్నత్యాన్ని, హిందూ సమాజ ధర్మాన్ని జీవన గమ్యాన్ని తెలియే ప్రతీకలే ఆలయాలు.జీవి దేహమే దేవాలయం. భౌతికమైన శరీరంలోని ఆత్మ ఆలయంలో ప్రతిష్టించే పరామాత్మ కు ప్రతిరూపం అనుకుంటే ప్రతి జీవి సంచార దేవాలయం. మానవుడు తన లోని శక్తితో పరమాత్మకోసం అనే్వషిస్తుంటాడు. ఆ అనే్వషణలో భగవంతుని సాక్షాత్కారం కోసం అనేక మార్గాలను తెలుసుకొన్నాడు. ఆ మార్గాలను శాస్త్రాలుగా ముందు తరానికి అందించాడు. ఈ పరంపరలో ఆలయాల విశిష్టతను , పూజావిధానాలను, విగ్రహారాధన గురించి పురాణాల్లో వివరించి ఉన్నారు. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉతృష్టమైంది. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి చాలా మంది అనేక మార్గాలను ఎన్నుకొంటారు. కాని, అందులో అత్యున్నతమైంది భగివంతుని ఆరాధనే. విగ్రహారాధన చేస్తూ చేస్తూ ఉండగా కొన్నాళ్లకు సగుణోపాసన ద్వారా నిర్గుణోపాసనకు మారుతారు. ఆకారం లేని భగవంతుని త్వరగా సాక్షాత్కారం చేసుకోవడానికి సులభ మార్గం మాత్రం సగుణోపాసనే. ఈ సగుణోపాసన ద్వారా మనిషి నిశ్చలత్వానికి దగ్గరకొస్తాడు. ఆ నిశ్చలత్వానికి దగ్గరైతే ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఏకాగ్రతతో భగవంతుని గూర్చి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆత్మ దైవం ప్రతిరూపమని తెలసుకొంటే ఆ జీవి జీవితం ధన్యం. అలా తనలోని ఆత్మను ఆ ప్రతిరూపాన్ని తెలుసుకోవడానికే దేవాలయాలకు జీవి వెళ్తున్నాడు. మహర్షులు తమ తపోబలంతో మానవునికి ఎన్నో విషయాలను అవగాహనకు తీసుకొని వచ్చారు. నేడు ఎన్నో పరిశోధనలతో తెలుసుకొన్న విషయాలు ఇంతకుముందే మహర్షులు తమ తపశ్శక్తితో తెలుసుకొనే ఉన్నారు. అవన్నీ వేదాల రూపంలో ఉన్నాయి. వేద విజ్ఞానాన్ని అర్థం చేసుకొనే విద్య నేడు కరువవుతున్నది. సంస్కృతం భాషను ప్రోత్సహిస్తే ఆ భాష ద్వారా వేద విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఎవరి మనస్సులో దైవం ప్రతిష్టితమై ఉంటుందో ఎవరి మనస్సు కలుషితం కాకుండా భగవంతుడే సుప్రతిష్టుడై ఉంటాడో వారి మనస్సునే కాదు వారే భగవంతుని రూపాలుగా మనం తెలుసుకోవచ్చు. కృషితో నాస్తి దుర్భిక్షం కనుక భగవంతుని కూడా ఈరోజు సాక్షాత్కారం కాలేదనో లేక ఎన్నో ఏళ్లనుంచి పూజిస్తున్నా కూడా కష్టాలు తీరలేదనో అనుకొంటూ భగవంతుని పూజించడమో, ఆరాధించడమో లేక ధ్యానం చేయడమో మానేయకూడదు. భగవంతునికి దగ్గరగా వెళ్లాలనుకొన్నవారు సంసార జంజాటాన్ని దూరం చేసుకోవాలి. అరిషడ్వర్గాలను దూరం చేసుకోవాలి. నాది నాది అనే మమకారాన్ని వదలగలగాలి. సర్వ ఈశ్వర మయం అనుకోవాలి. ప్రతి మనిషిలోను ఆఖరకు ప్రతి వస్తువులోను ఈశ్వరుణ్ణి దర్శించే నేర్పును అలవర్చుకోవాలి. అపుడే దేహంలోని పరమాత్మ సాక్షాత్కారం లభ్యమవుతుంది. భక్తుడికి ఉన్న ఏకాగ్రత వల్ల భక్తుడు కోరుకున్న రూపంలోకూడా భగవంతుడు వ్యక్తమవుతాడు. అట్లా వ్యక్తమయిన రూపాలే నేటి దేవాలయాల్లో కనిపించే విగ్రహాలు. స్థలపురాణాలు చదివిన ప్పుడు ప్రతి క్షేత్రంలోను భక్తుని కోసమే భగవంతుడు తన్ను తాను రూపుదిద్దుకున్నట్లు మనకు తెలుస్తుంది. వివేకానందుని వంటి పుణ్య పురుషులు ఈ దేశంలో అవతరించారు. ప్రపంచం నలుదిశలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వారు వెదజల్లారు. వారి ఆలోచనా స్రవంతిని కనుగొని అర్థం చేసుకొని వారిచూపిన బాటలలో నడిస్తే ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుని చూడాలన్న దివ్యమైన ఆలోచనతో ఇతర ఆలోచనలన్నింటినీ వదిలివేసిననాడు భగవంతుడు భక్తుని వెదుక్కుంటూ వస్తాడు. నాస్తిక వాదంలో ఉన్న వారు కూడా దివ్యజ్యోతి యైన పరంజ్యోతిని చూసినపుడు తప్పక వారిలో మార్పు వచ్చి వారు దివ్యపథంలోకి అడుగుపెట్టి అంతులేని సంతోషాన్ని పొందుతూ ఆ దివ్యాత్మలో లీనమయినట్టు ప్రపంచంలో ఎన్నో కథలున్నాయి. ఇవి కేవలం కథలు కావు వాస్తవ జీవితంలో జరిగిన నిజాలు. నిన్నమొన్నటి గుడిపాటి వేంకటాచలం కూడా రమణమహర్షుల దగ్గరకు వెళ్లి ఆయన దర్శనం కాగానే వెంటనే చలంలో మార్పు జరిగింది. ఆ భగవంతుని దర్శనమనే దివ్యానుభవాన్ని చవి చూసి తిరిగి ఈ భౌతికమైన ప్రపంచంలోకి రాలేదు. అటువంటి వాళ్లు ఈ భక్తుల సామ్రాజ్యంలో ఎంతో మంది ఉన్నారు. కనుక సామాన్యులైనా సరే ఏకాగ్రతతో నీవు తప్ప దిక్కు ఎవరూ లేరన్న కృత నిశ్చయంతో ధ్యానం చేస్తే తప్పక భగవంతుడు ఈ చర్మచక్షువులకే కనిపిస్తాడు.

-బ్రహ్మశ్రీ కురువాడ మురళీధర్