సబ్ ఫీచర్

విత్తు చిన్నదైనా వృక్షం పెద్దదే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేవ చేయాలని చిన్నప్పుడే కలుగాలి. బై బర్త్ వచ్చిందండీ అంటుంటారు కదా. అలా దానం చేయడం కాని, ఒకరికి సాయం చేయడం కానీ చిన్నప్పటినుంచి అలవాటు చేయాలి. లేకుంటే పెద్దైన తరువాత డబ్బులు సంపాదించేటపుడు చెబుదాం లే అంటే అపుడు పైసా కూడా ఇతరులకు ఇవ్వబుద్ధి కాదు. ఎందుకంటే అంతా తనది నాది నాది అనే తత్త్వం పెరుగుతుంది.
ఈ సేవాగుణం పెరగడానికి అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. సేవ చేయడంలో వచ్చే ప్రశాంత అనుభూతి, సంతృప్తి చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలి. అందుకే గుంటూరు లోని ఓ కళాశాల ప్రిన్సిపాల్ ఒక విన్నూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కళాశాలలో చదువుకునే పిల్లలంతా వారంలో ఒకరోజు ఓ గుప్పెడు బియ్యాన్ని తీసుకొని రావాలి. ఆ తెచ్చిన బియ్యాన్ని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హుండీలో వేయాలి. అది నిండిన తరువాత ఆ బియ్యాన్ని ఏ అనాథాశ్రమాలకో లేక ఎవరికైనా అవసరమైతే వారికో ఆ కళాశాల తరఫున ఇస్తుంటారు.
ఈ ఆలోచనను అందరూ మెచ్చుకున్నారు. కాని వారంతా ఎందుకు గుప్పెడు బియ్యం మేమంతా ఓ బస్తా బియ్యం ఇచ్చేయగలం అన్నారు. కాని సాధనమున పనులు సమకూర ధరలోన అన్నట్టు ఆ ప్రిన్సిపాల్ ఈ పథకం చాలారోజులు సాగాలి అమ్మా. ఈ సాయం చేసేస్తున్నాం అని మీలో అహంకారం కూడా రాకూడదు. కేవలం సాయం చేయాలన్న గుణం, అవసరమైన వారికి ఆ సాయం అందాలన్న ధ్యేయంతో ఇలా చేస్తున్నాను. ఇంకా ఎవరైనా కళాశాలను చూడడానికి వచ్చేవారు, లేదా ఎవరితోనైనా మాట్లాడడానికి వచ్చేవారు పిల్లల తల్లిదండ్రులు, వారి స్నేహితులు ఇలా ఎవరైనా సరే ఒక పిడికెడు బియ్యం తెస్తే చాలు అని ప్రిన్సిపాల్ చెప్పారు.
దాంతో అందరూ మొదట్లో కాస్త వెనుకబాటు కనిపించినా ఇప్పుడు ప్రతివారు ప్రిన్సిపాల్ పెట్టిన హుండీనీ నింపడంలో ఉద్యుక్తులైనారు.
ఇలా సేకరించిన బియ్యాన్ని ఆ కళాశాలలో చదువుకునే పిల్లల చేతనే అవసరమైన వారికి అందిస్తారు ఆ కళాశాల ప్రిన్సిపాల్.
ఈ కళాశాలను చూసి చాలామంది మేమూ కూడా ఇలాంటి సేవాకార్యాకలాపాలను చేస్తాం అనుకొన్నారు. వెంటనే ఆచరణరూపంలోకి కూడా తీసుకొని వచ్చారు. వారంతా ఒకరు బట్టలు సేకరించి అనాథలకు ఇవ్వడం, మరికొంతమంది వారికి కావలసిన వైద్య సదుపాయం చేయడం, బియ్యంతో పాటుగా పనికి వచ్చే ఇతర సామగ్రిని, కూరగాయలను అందించడం లాంటివి చేయడానికి చాలా కళాశాల విద్యార్థులు ముందుకు వచ్చారు.
చూశారా మర్రి విత్తనం చిన్నదైనా ఎంత పెద్ద వట వృక్షాన్ని భూపరితలానికి పంపిస్తుందో అట్లానే సాయం చేయాలన్న గుణం ఉంటే చాలు ఆకాశమే హద్దుగా ఎదుగుతారు. ప్రతి కళాశాల, పాఠశాల విద్యార్థులు కూడా కలసికట్టుగా ఉంటూ ఇతరులకు సాయం చేయడానికి అహర్నిశలూ పూనిక వహించి ఉండాలి.

- శ్రీలత