సబ్ ఫీచర్

గోరింట పంట ఆషాఢ ఇంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరింట పూచింది కొమ్మలేకుండా అనే పాట అందరి మనసులను దోచినట్లే గోరింటాకు అరచేతుల్లో పూయించడం అనాదిగా వస్తున్నదే. రామాయణ కాలంలోకూడా సీతమ్మకు చేసిన అనేకానేక వేడుకల్లో గోరింటాకు ప్రత్యేకతను తులసీదాసు అందంగా సుందరంగారచించి ఉన్నారు. సరస సల్లాపాలలో కూడా గోరింట తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది.
పెళ్లికూతుర్ల చేతుల్లో పండే గోరింటాకు ఆషాఢం రాగానే మహిళలందరి చేత మెరుస్తుంటుంది. గోరింటాకు పెట్టుకోవడం కూడా 64 కళల్లో ఒకటి. పూర్వకాలంలో హస్తచిత్రాలు అనే కళల్లో గోరింటాకుతో చిత్రాలు రచించడం గొప్పగా భావించేవారు. నేడు కూడా పెళ్లిళ్లల్లో మెహందీ పండుగ అని జరుపుతున్నారు. ఈ గోరింటాకునుపెట్టడానికి ప్రత్యేక శిక్షణ పొందిన కళాకారులు కూడా ఉన్నారు.
చేనేత పరిశ్రమలో వస్త్రాలపై రంగులద్దేవాటిల్లో గోరింటాకు ఒకటి. ఈ గోరింటాకు ఆయుర్వేద మందుల్లోను, అల్లోపతి వైద్యంలోను కూడా ఉపయోగిస్తుంటారు అని అంటారు. ఈ గోరింటాకు చెట్లనిండా ముళ్లు ఉన్నా అతి లాఘవంగా ఈ ఆకును కోసి దీనికి కాస్తంత చింతపండు నాలుగు వక్కముక్కలు చేర్చి మజ్జిగ చల్లుతూ మెత్తగా రుబ్బుకోవాలి. రాత్రి పడుకునేముందు ఈ రుబ్బిన గోరింటాకు ముద్దను అరచేతులకు, కాళ్లకు చిత్రాలుగా పెట్టుకుంటారు. ఈ గోరింటాకు డిజైన్లు వేయడం కూడా నేడు ఒక ఉపాధిరంగంగా మారుతోంది.
గోరింటాకులో ఉంటే లావోస్ అనే రసాయనం మనిషి అరచేతులు, పాదాల్లో ఉండే కెరటిన్ తో కలయడం వల్ల అరచేతులు, పాదాలు ఎర్రపు రంగుకు మారుతాయి. మంచి సువాసనతో ఉండే ఈ గోరింటాకును ఇష్టపడని అమ్మాయిలుండరు.
నేటి కాలంలో గోరింటాకును కేశసౌందర్యం ఇనుమడింప చేసేందుకు కూడా వాడుతున్నారు. గోరింటాకు, మందారం ఆకులు, పూవులు కలిపి రుబ్బి కేశాలకు పెట్టుకుంటే జుట్టు వత్తుగా పెరుగుతుంది. కేశాల చివర్లు పగలడం వంటివి దూరమవుతాయి. గోరింటాకును నేడు వివిధ పద్ధతుల్లో తయారు చేసి అంటే గోరింట రసము, కాని గోరింటాకు రుబ్బిన పేస్టును కోన్స్‌లో గాని వ్యాపారులు అందిస్తున్నారు. ఈ కోన్‌లతో ఎవరికి వారు అందంగా తమ అరచేతుల్లో డిజైన్లు పెట్టుకుంటూ ఆనందిస్తున్నారు.
గోరింట వల్ల వచ్చే ఉపయోగాలు అన్నీ తెలిసిన వారు కనుక మన పూర్వీకులుగోరింట, గోరంట్ల అనే పేర్లు గ్రామాలకు కూడా పెట్టారు. ఈ గోరింటాకును కేవలం తెలుగువారే కాక గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇట్లాంటి కాదు కాదు ఒక్క భారతదేశంలోనే కాక మొత్తం ప్రపంచంలోని వారంతా గోరింటాకు పట్ల మక్కువ చూపిస్తున్నవారే ఉన్నారు.గోరింట ఆకులే కాదు పూవులు, కాయలు, బెరడు, చిగుళ్లు ఇవన్నీ కూడా వైద్యంలో పనికివస్తాయి. అందుకే గోరింట సేద్యానికి కూడా మంచి మార్కెటు ఉంది. ఇన్ని ఔషధ గుణాలున్న గోరింటాను సంప్రదాయ రీతుల్లో ఆవిష్కరించిన ఘనత మాత్రం తెలుగువారిదే.

-ఎన్.వాణి