సబ్ ఫీచర్

సేంద్రియ ఎరువులు... ధాన్యపు సిరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు చేయలేని పని ఏదీ ఉండదు. అది ఇంట్లో కావచ్చు. వీధిలోకావచ్చు. ఆఫీసులో కావచ్చు. ఎక్కడైనా సరే మనసు పెట్టి కూర్చున్నదంటే చాలు ఆ పని పూర్తికావలసిందే. ఆఫలితం నలుగురికీ పంచాల్సిందే. ఆదిపరాశక్తిగా అభివర్ణించారంటే అర్థం ఇదేనన్నమాట. తలుచుకొంటే దైన్నైనా చేస్తారు. ఏ పనికీ వెనుకాడే సమస్యే లేదు. అన్నీ కలుషితమైన ఈ ప్రపంచంలో తిండి గురించి చెప్పనవసరం లేదు. రెడిమేడ్‌గా లభించేవైనా సరే లేకపోతే బియ్యం దగ్గర నుంచి ప్రతి చిన్నవస్తువు దాకా పొడులు, పచ్చళ్లు, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు ఇలా ఏవైనా సరే అన్నింటినీ కాలుష్యం చేస్తేవారు కల్తీచేసేవారు బయలుదేరారు. ఏది తిన్నా ఏదో ఒక అనారోగ్యం కలుగుతోంది. అందుకే మహిళలు బాగా ఆలోచించారు.
పంటను మనమే పండించుకుంటే ఏలా ఉంటుందనుకొన్నారు. కాని. పంట పండించడమంటే మాటలు కాదు. కాలం కలసి రావాలి. సామూహకంగా నలుగురు కలిస్తేనే చేయగలిగినది వ్యవసాయం. అంతేకాదు. ఏ ఒక్కరి కోసమో సాగు చేయలేము. వచ్చే ఫలసాయమూ అందరూ పంచుకోవలసిందే. అందుకే దక్కన్ డెవలప్‌మెంట్ వారు పంట పండించాలనుకొన్న వారిని కలిశారు. వారి అభిప్రాయాలు సేకరించారు. మీకు మేము తోడుంటాం అని భరోసా ఇచ్చారు. వారికి తెలిసిన వినియోగదారులను కలుసుకున్నారు. వారికి విషయ వివరణ చేశారు. వారంతా కూడా ఆలోచించి సై అన్నారు.
అంతే ఇటు వినియోగదారులు వారివారికి ఎంతెంత ధాన్యం కావాలో చెప్పారు. వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చిన వారు మళ్లీ వెనక్కు తగ్గారు. పండించబోయే ఫలసాయం మార్కెటు చేయడానికి అవకాశం ఉంది కాని అసలు పెట్టుబడి పెడితేనేకదా మార్కెట్ దాకా వెళ్లడం అని దిగాలుపడ్డారు మళ్లీ దక్కన్ సొసైటీ ముందుకు వచ్చి వినియోగదారుల చేత కొద్ది కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టించారు. వ్యవసాయం చేసేవారు కూడా సేంద్రియ ఎరువులు వేస్తూ కాలుష్యరహితమైన పంటను తమ శాయశక్తులా కృషి చేసి పండించడానికి పూనుకొన్నారు.
ఇక ఫలసాయం రావడమే ఆలస్యం. పంట చేతికి రాగానే వినియోగదారులు తామే స్వయంగా పండించుకున్న ఆహారం అని ఆనందంగా దాన్ని తీసుకొంటారు. మన చేతులతో మన సేంద్రియ ఎరువులతో రసాయినిక ఎరువులనేవి మచ్చుకు కూడా లేనివి పంటలు పండించి దిగుబడి సాధించి వినియోగదారులకు అందిస్తున్నాం. మనమూ ఆ ఫలసాయాన్ని తీసుకొంటున్నాం అని మహిళారైతులు సంతోషిస్తున్నారు.
పండించేవారు, పంట అందుకునేవారు కూడా మహిళలే కావడం ఇక్కడి మరో ప్రత్యేకత. ఇప్పడు మొదలెట్టినట్టు చిరుధాన్యాల పంటను ఇంకా వచ్చేకాలంలో వరి ని సైతం పండించుకోవాలని మహిళారైతులు కలలు కంటున్నారు. వారి కలలు ఫలించాలని కల్తీ లేని ధాన్యపుసిరులు మన ఇంట నిండాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.
వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది ముందుకు వచ్చి కేవలం సేంద్రియ ఎరువులతో కూరగాయలు, పండ్లు పండిస్తే ఇక అనారోగ్యాన్ని మనం దరిదాపులకు రాకుండా చేసుకోవచ్చు. దీనికి వీలుగా మరికొంత మంది ఆలోచన్లకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. *