సబ్ ఫీచర్

అభిరుచులు వేరైనా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు భార్యాభర్తలిద్దరూ సంపాదనా పరులు. కాలంతో పాటు పరుగులెత్తేవారే. వీరికి పిల్లలు జత అయితే వీరితో పాటు వారు పరుగులెత్తాల్సిందే,.. కాలంతో పోటీపడుతూ ఉద్యోగాలు, ఇంట్లో పనులు అన్నీ చేసుకుని వెళ్లే మహిళల్లో చాలామంది తమ తమ భాగస్వాములతో గొడవలు పడుతున్నారు. ఇలా భార్యాభర్తలు గొడవలు పడుతుంటే వారి మధ్య పిల్లలు నలిగిపోతున్నారు.
ప్రతి భార్యా భర్త నామాటే వినాలి. నాకు అనుగుణంగా ఉండాలి అనుకోవడం ఎంత తప్పో ప్రతి భర్త నామాటే వినాలి. అన్నీ నేను చెప్పినట్టే జరగాలి అనుకోవడమూ తప్పే. అందుకే భార్యాభర్తలిరువురు కొట్లాటలు లేకుండా ఒకరి లోపాలను మరొకరు వెతకకుండా ఉండాలి. ఒకవేళ లోపాలున్నా వాటిని అంతగా పట్టించుకోకూడదు. ప్రతిమనిషికీ లోపాలు ఉండడం సహజమే. అయితే అది పక్క వారికి మరీ ఇబ్బందికరంగా ఉండకుండా చూసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు మరేదైనా గొడవలకు కారణమైనా సరే ఇద్దరూ కలసి కూర్చుని తీరిగ్గా చర్చించుకుని సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి కాని గొడవలకు దిగకూడదు.
ఓసారి పక్కన వారు తప్పు చేసినా పట్టించుకోకపోతే రెండవ సారి గొడవ రావాల్సి వచ్చినపుడు రెండవ వారు కాస్త ఆలోచిస్తారు. మనం చేసేది తప్పేమో అన్న ఆలోచన వారికి వస్తుంది. కనుక ముందు కాస్త సర్దుబాటు , ఓర్పు ఉండితీరాలి.
మరికొందరు ఒక తప్పు చేసినపుడు ఇంతకుముందు కూడా ఇలాం టి తప్పే చేసావు. మళ్లీ ఇపుడు అంటూ లెక్కలు కట్టి జన్మలో ఎన్ని తప్పులు చేసారో ఏకరువు పెడతారు. ఆ సమయంలోనే తప్పు చేసినవాళ్లు పొరపాటు చేసాను అని చెప్పుదామనుకొన్నా విరమించుకుని అవును నేను ఇలానే చేస్తాను అనే మొండి వాదనకు దిగుతారు. అపుడు ఆ సమస్య మరింత జటిలం అవుతుంది. కాని పరిష్కారం దొరకదు. అందుకనే సమస్యను లాగకూడదు. పాత గొడవలను మర్చిపోవాలి కాని తవ్వి తీయకూడదు.
ఏ ఒక్కరి అభిరుచులు రెండవ వారితో సామాన్యంగా సరితూగవు. ఎవరి అభిరుచులు వారివి. కనుక ఒకరి అభిరుచులను మరొకరు ఏద్దేవా చేయకూడదు. ఎగతాళి చేయకూడదు. ముఖ్యంగా భార్యాభర్తలిరువురు అభిరుచులను పట్టుకొని గొడవ చేసుకోకూడదు. అభిరుచులను గౌరవించుకోవాలి కాని వాటినే మనస్పర్థలకు కారణం చేసుకోకూడదు.
మరికొందరు భార్య ఇంటి తరఫు వాళ్లగురించో, లేక భర్త ఇంటి తరఫు వాళ్లగురించో చెప్పి వీరిని ఎగతాళి చేస్తుంటారు. భార్యాభర్తంటే ఇరువురు ఒకటే ఓకే ఆత్మ శరీరాలు వేరు అని చెప్తారు. పైగా ఇద్దరూ కలసి మెలసి పనులు చేస్తేనే సంసారం సాగుతుంది అని కూడా అంటారు. అటువంటి వారి మధ్య నే ఎన్నో తగాదాలు వస్తుంటాయి. ఎన్నో సంగతుల్లో ఇద్దరికీ ఆకాశానికి భూమికి ఉన్నంత తేడాలుంటాయి. మరి వారిద్దరి ఇంట్లో ఉన్న ఇతరుల గురించో లేక వారి బంధువుల గురించో వీరు గొడవ పడితే వచ్చే లాభమేమన్నా ఉంటుందా కాస్త ఆలోచించుకోవాలి. మీవాళ్లు ఇలా మీవాళ్లు ఇలా అని గొడవలు చేసుకోకూడదు. ఇలా అనవసరమైన వాటి గురించి మాట్లాడి అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోకూడదు.
భార్యాభర్తల్లో ఏ ఒక్కరో పక్కవారి గురించి అదేపనిగా విమర్శించడం , ఎగతాళి చేయడం చేస్తుంటే మ నస్పర్థలు ఎక్కువ అవుతాయి కాని తగ్గవు.
పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లో తగాదా పడకూడదు. అంతేకాదు మీ నాన్న ఇలాంటి వాడు అనో మీ అమ్మ ఇలాంటిది అనో చెప్పకూడదు. పిల్లలు లేత మనసున్నవారు. అదేకాక మీనాన్నమ్మ, అత్త పిన్ని అంటూ ఎవరి గురించి అయినా వారికి చెడు చెప్పకూడదు. అబద్ధాలు అసలే చెప్పకూడదు. ఒకవేళ అలా చెప్పితే మాత్రం చిన్నవయస్సులోనే వారిలో మనుష్యులపై చెడు అభిప్రాయాలు కలుగుతాయి. పెద్దయ్యాక అసలు విషయం తెలుసుకొని తల్లిదండ్రుల పైన అసహ్యాన్ని పెంచుకుంటారు.
ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ అవగాహనతో, ఓర్పుతోను, సంయమంతో కాపురాలను చేసుకోవాలి. కాని కొట్లాటలకు దారి తీసే ఏ పని చేయడానికీ ముందుకు రాకూడదు. సర్దుబాటుకే ప్రాధాన్యతను ఇవ్వాలి.

-నిర్మల