సబ్ ఫీచర్

కోటి తీర్థాల పుణ్యఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా, ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే ‘శయన ఏకాదశి లేదా ప్రథమ ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని ‘శయన ఏకాదశి’ అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు అంటే పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని అనుసరణ సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే మనకు ప్రత్యక్షదైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచే దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇదే రోజున చాతుర్మాస్యవ్రతం కూడా ప్రారంభమవుతుంది. గోపద్మ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించాలని మన పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ తర్వాత వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.
ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తలమునకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటుచేశాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించినవారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, అంత్యంలో వైకుంఠప్రాప్తి లభిస్తుందనీ పద్మపురాణంచెబుతుంది.
అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎటువంటి తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఎటువంటి సమస్యలు ఎదురవకూడదని వారు రైతులు ఏరువాక పండుగఅని తొలిఏకాదశినాడు పూజలు చేస్తారు. పాలెర్లకు కొత్తబట్టలు పెట్టి గౌరవిస్తారు.
ఏకాదశీ వ్రతాన్ని ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్క్భుయి ఈ వ్రతానే్న ఆచరించి మోక్ష సిద్ధి పొందడం జరిగింది.
వ్రత నియమాలు
ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమినాడు రాత్రి నుంచి నిరాహారులై ఉండి ఏకాదశినాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శుచిగా స్నానమాచరించి, శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతిని ఇవ్వాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ద్వాదశినాడు ఉదయానే్న స్నానాదికాలు ఆచరించి శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. ఆ రోజు అన్నదానం చేయడం చాలామంచిది.
ఏకాదశి వ్రతమాచరించేవారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూదు. తొలి ఏకాదశినాడు పేలపిండిని దేవుడికి నైవేద్యంగా సమర్పంచి, ప్రసాదంగా స్వీకరిస్తారు.

- ఉమామహేశ్వరి