సబ్ ఫీచర్

మనసు చలించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రాలు చూసి చిత్తరువు చెందడమే మామూలే. కాని చిత్రాలు చూసి అందులోంచి మంచిని నేర్చుకుంటే అందరూ అభినందిస్తారు. ఆ మంచి నలుగురికీ ఉపయోగపడితే మరీ మంచిది. అట్లాంటి సంఘటనే ధనపూర్ లో జరిగింది.
ఆధునికతను పెంచుకుంటూ ముందుకు పోతున్న దేశం ఆర్థికాభివృద్ధిని సాధిస్తోంది. దానికి మహిళలూ తమ వంతు సాయం అందిస్తున్నారు. కాని మహిళలు కావాల్సిన వౌలిక సదుపాయాలు కాని, కనీస అవసరాలు కానీ తీర్చడానికి ఇటు కుటుంబసభ్యులు, అటు ప్రభుత్వమూ ముందుకు రావడంలేదు. ఒకవేళ ప్రభుత్వం వచ్చినా, ఇంట్లో వాళ్లు దానిని అమలు జరపడంలేదు.
ఇటువంటి వాటిల్లో మరుగుదొడ్లు ఒకటి. టివీ లాంటి ప్రచార మాధ్యమాల్లో మరుగుదొడ్ల గురించి అడ్వర్టైజెమెంట్స్ ఇస్తున్నారు. కాని వాస్తవంలో అన్నీ జరగడంలేదు. దీనిగురించే ఒక సినిమా తీయాలని మరుగుదొడ్ల అవసరం ఎంత ఉందో చెప్పాలని చిత్రనిర్మాతలు అనుకొన్నారు.
ధనపూర్ అనే గ్రామంలో మరుగుదొడ్ల విషయమే లేదు. దాదాపు 300 కుటుంబాలున్నా ఒక్క మరుగుదొడ్డి అయినా లేకపోవడం భారతదేశంలోని గ్రామాలు ఇంకా వెనుకబడే ఉన్నాయనడానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ఆ గ్రామంలోకే వెళ్లి చిత్రనిర్మాణాన్ని చేపట్టారు. ఆ చిత్రంలో ఒక 14 ఏళ్ల అమ్మాయి మరుగుదొడ్డి నిర్మించాలని పట్టుపడుతుంది. తల్లిదండ్రులు చెప్పినా వినకుండా అన్నం మానేసి మరీ మరుగుదొడ్డినిర్మించాల్సిందే అని చెబుతుంది. చివరకు సినిమా కనుక మరుగుదొడ్డి నిర్మించినట్టు చూపిస్తారు.
నిజానికి ఆ ఊర్లో కూడా మరుగుదొడ్డి వ్యవస్థ లేదు. ఆ విషయాన్ని గ్రహించిన ఆ చిత్ర నిర్మాణంలోపట్టుదల గల అమ్మాయిగా నటించిన మల్లమ్మ అనే యువతి తాను తీసుకొన్న లక్షరూపాయల పారితోషకాన్ని మరుగుదొడ్డి నిర్మాణానికి విరాళంగా ఇచ్చివేసింది. ఈ అమ్మాయి సంకల్పాన్ని చూసి ఆ చిత్ర నిర్మాతలు కూడా ముందుకు వచ్చి సాయం చేసి ఆ ఊర్లో వంద మరుగుదొడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.
చూశారా.. ఇది కదా చిత్రానికి సరైన స్పందన. ఇక ఆ ఊరి వారంతా కలసి వారికి కావలసిన మరుగుదొడ్లను నిర్మించుకోవడానికి పూనుకొన్నారు.

-రాధిక