సబ్ ఫీచర్

కొబ్బరితో కొత్త కొత్తగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యారెట్ - కొబ్బరి పూర్ణాలు
కావలసినవి : మైదాపిండి - 1 కప్పు
బియ్యపుపిండి -1 కప్పు, క్యారెట్ తురుము -1 కప్పు,పచ్చికొబ్బరి తురుము- అరకప్పు
యాలకుల పొడి - 1 చంచా, పంచదారా- అరకప్పు, వంటసోడా- చిటికెడు, నెయ్యి -2 స్పూన్స్, ఉప్పు - చిటికెడు, నూనె- వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం : ఒక గినె్నలో మైదాపిండి, బియ్యపుపిండి, వంటసోడా, ఉప్పు నీళ్లు పోసి పలుచగా దోసెల పిండిలాగా కలుపుకోవాలి. తర్వాస్ పాన్‌లో నెయ్యి వేసి క్యారెట్‌తురుము వేసి వేగనివ్వాలి. పచ్చి కొబ్బరి కూడా వేసి వేగాక అందులోనే పంచదార, యాలకుల పొడి వేసుకోవాలి. మిశ్రమం దగ్గరగా వస్తున్నపుడు దించాలి. కాస్త చల్లారాక ఉండలుగా చేసి పక్కన పెట్టుకుని మైదాపిండి లో మిశ్రమంలో ముంచి పూర్ణాలు వేసినట్టు నూనెలోకి దింపి ఎర్రగా కాలాక ప్లేటులోకి తీసుకోవాలి. క్యారెట్ కొబ్బరి పూర్ణాలు రెడీ
కొబ్బరి బర్ఫీ
కావలసినవి : కొబ్బరి తురుము : 2 కప్పులు , పాలు : 3 కప్పులు, మీగడం :అరకప్పు, కుంకుమపువ్వు కొద్దిగా పంచదారా :400 గ్రా. యాలకుల పొడి ఒక చంచా
తయారు చేసేవిధానం: పాన్‌లో పాలు, కొబ్బరి తురుము మీగడ వేసి కలుపుతూ సిమ్‌లో ఉడికించుకోవాలి. మిశ్రమం దగ్గరగా వచ్చాక యాలకుల పొడి , పాలల్లో కలిపిన కుంకుమ పువ్వు వేసికలిపి దించాలి. నెయ్యిని ఒక ప్లేటుకి రాసిన ఈమిశ్రామాన్ని పోయాలి. గోరువెచ్చగా ఉన్నపుడే మెల్లగా మైసూర్ పాక్‌లాగా కోసుకోవాలి.
కొబ్బరి చెగోడీలు
కావల్సినవి: బియ్యపు పిండి 1 కప్పు, తాజాకొబ్బరి తరుగు 1 కప్పు, పెసరపప్పు : 1 టీస్పూన్, కారం :1 స్పూన్ , ఉప్పు తగినంత , నూనె : వేపుకోవడానికి సరిపడినంత
తయారీ విధానం : పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి. కొబ్బరి తురుమును నీళ్లు చల్లుకుని మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. ఒక గినె్నలో ఒకటిన్నర కప్పుల నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఇపుడు ఆనీళ్లల్లో ఉప్పు, రెండు చంచాల నూనె వేయాలి. కారం, కొబ్బరి ముద్ద, బియ్యపుపిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టుకోకుండా చూసుకోవాలి. మంట తగ్గించుకోవాలి. రెండు నిముషాలు ఉంచి స్టవ్ మీద నుంచి దించుకోవాలి. ఇది చల్లారాక చేతులకు నూనె రాసుకొని చేగోడిలీ తయారు చేసుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో ఎర్రగా వేపుకోవాలి. కొబ్బరి చేగోడీలు పిల్లలు ఇష్టంగా తింటారు.
రోజ్ కొబ్బరి లడ్డూ
కావాల్సినవి: ఎండు కొబ్బరి పొడి : 2 కప్పులు, కండెన్సడ్ మిల్క్ : అరకప్పు, రోజ్ సిరఫ్ : 1 స్పూన్, యాలకుల పొడి : 1 స్పూన్, నెయ్యి : 3 స్పూన్స్
తయారీ విధానం: పాన్‌ల నెయ్యి వేసి వేడిగా అయ్యాక కొబ్బరి పొడి, కండెన్స్ మిట్స్ రోజ్‌సిరప్ యాలకుల పొడి వేసి కలుపుతూ చిన్న మంట మీద కలుపుకుంటూ ఉండాలి. మిశ్రమం మొత్తం ఉడికి ముద్దగా అయ్యాక దించి గోరువెచ్చగా ఉండగా చిన్న చ్ని లడ్డూల్లా చేసుకుని దొర్లించి ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఫ్రిజ్‌లో పెడితే త్వరగా గట్టిపడుతాయి. లేదా గాలికి పూర్తిగా ఆరాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

- సత్యవాణి