సబ్ ఫీచర్

సంప్రదించాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్లనొప్పులు ఎప్పుడో ఒకప్పుడు అందరికీ అనిపించే సమస్యనే. ఊబకాయం ఉన్నవారికి ప్రతిరోజు కాళ్లు నొప్పులు ఉండవచ్చు. మడిమలు, తొడలు,పిక్కలు వట్టికాళ్లు ఇలా కాలిలో ఏదో ఒక భాగంలో నొప్పిరావడం సహజమే. కాని, ఈ నొప్పులు తగ్గకుండా బాధపెడుతుంటే మాత్రం తప్పకుండా డాక్టరును సంప్రదించాల్సిందే.
కూర్చున్నపుడు, పడుకున్నప్పుడు నొప్పిగా అనిపించినా కాస్త దూరం కష్టపడి అయనా నడుస్తుంటే కాళ్ల నొప్పులు తగ్గుతున్నట్టు అనిపి స్తాయ. కనుక తప్పనిసరిగా క్రమం తప్పకుండా నడక అలవాటు చేసుకొంటే కాళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. కాసేపు రేపటి ఎండలో నడిచినా కూడా డి విటమిన్‌ను పొందవచ్చు.
ఒక్కోసారి కాళ్లు నొప్పులనేవి బరువు ఎక్కువ అవడమే కాకుండా మధుమేహం వల్ల కూడా కాళ్లునొప్పులు రావచ్చు. పొగాకు తాగేవాళ్లల్లో కూడా కాళ్లు నొప్పులు కనిపిస్తాయి. మధుమేహం ఉన్నవారికి పొగతాగే అలవాటు ఉంటే వారిలో కాళ్లనొప్పులను పట్టించుకోకపోతే ప్రమాదం వాటిల్లవచ్చు. ఒక్కోసారి పాదాల్లో పుండ్లు ఏర్పడవచ్చు.
అసలీ కాళ్లనొప్పులు ఎందుకొస్తాయి అంటే రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలస్ట్రాక్ నిల్వలు కారణం కావచ్చు. లేకపోతే సిరలు అంటే సూక్ష్మ రక్తనాళాలు వ్యాధికి గురై ఉండవచ్చు. క్రానిక్ వీనస్ ఇన్‌ఫిషియన్నీ వల్ల రక్తనాళాలు చెడురక్తాన్ని శ్వాసకోశాలకు పంపడంలో విఫలం అయితే ఆ రక్తం కాళ్లల్లో పేరుకుని నొప్పులకు దారి తీయవచ్చు.
ఒక్కోసారి వేరికోస్ వెయిన్స్ అనే వ్యాధి వల్ల కూడా కాళ్లనొప్పి వస్తుంది. పిక్కల్లోని రక్తనాళాలు మెలితిరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. విటమిన్ డి సరియైనంత లేకపోతే కూడా ఈ నొప్పి వస్తుంది. కండరాలు పట్టేయడం, సయాటికా జబ్బు ఉండడంవల్ల కూడా కాళ్లనొప్పి బాధిస్తుండవచ్చు.
కనుక ముందు వాస్క్యులర్ సర్జన్‌ను సంప్రదించి రక్తనాళాల పరిస్థితిని తెలుసుకోవాలి. కొన్ని సార్లు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఈ కాళ్లనొప్పులు పోతాయి.కనుక డాక్టర్ను సంప్రదించి వారు ఇచ్చిన సలహాను పాటించితే నే మంచిది. లేనట్టు దీర్ఘకాలరోగాలకు ఆహ్వానం పంపినట్టు అవుతుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త.

- లక్ష్మీ ప్రియాంక