సబ్ ఫీచర్

సాధన చతుష్టయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్
సంభాషణం కోటితీర్థం వందనం మవోక్ష సాధనమ్
సాధువుల దర్శనము పుణ్యక్షేత్రము. స్పర్శనము పాపనాశన హేతువు. వారితో భాషించుట కోటి తీర్థములలో మునిగినట్లు వారికి చేయు వందనము మోక్షసాధనమే. ఇట్టి సాధువులకు బాధలు కలుగనున్నపుడు భగవానులవతరించుచుందురు. లేదా వారి యిష్టానుసారముగా మరియొక రూపమునైన వారి కష్టములు నివారణ చేయుదురు. ఇతర దేశములలో భగవానులు ఎట్లు అవతరించియున్నను మన దేశమున శ్రీరామావతారము, శ్రీకృష్ణావతారము సుప్రసిద్ధములై యున్నవి. వారెట్లు దుష్టశిక్షణము, శిష్టరక్షణము గావించిరవో హైందవులకు తెలిసియేయున్నది. ఫలానివారు భగవదవతారమని మనకు రూఢిగా తెలియుడెట్లు? భగవానుల లక్షణము లిట్లుచెప్పియన్నారు.
భూత భవిష్యద్వర్తమానములెఱుంగుట అఖండమగు ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్సు కలిగి , సర్వవ్యాపకత్వాది లక్షణములు కలిగియుండుట కొన్ని సమయములందు కొన్ని లక్షణములు నిగూఢములై యుండుట కూడా కలదు. వానిని మహానుభావులే గుర్తింపగలరు. అజ్ఞులెఱుంగజాలరు. కొన్ని అవతారములలో చేయు పనులును వేరుగా నుండును. శ్రీకృష్ణ చైతన్యస్వామివారిని కృష్ణావతారమని బంగాళ దేశమంతయు గుర్తించెను. ఆంధ్రదేశమిపుడు గుర్తించుచున్నది. వారవతారపురుషులని మనకెట్లు నిదర్శనము? వారు రామభక్తుడగు మురారికి సీతారాములై దర్శనమిచ్చిరి. కృష్ణ్భక్తులగువారికి గోపాలకృష్ణ రూపముతో దర్శనమిచ్చిరి. ఒక పర్యాయము కృష్ణావతారమున దర్శనమిచ్చి వారిట్లు చెప్పియున్నారు. నేనెవరినో మీరెరిగియే యుందురు. మీ అందరి హృదయములలో నున్నవాడనే నేను. ఈ పర్యాయము పాపులను చంపుటకు వచ్చి ఉండలేదు. వారిని బాగుపరచుటకే ఏఏ మార్గములలో నేను స్వయంగా నడచి, దారి చూపించుటకే వచ్చియున్నాను. ముఖ్యముగా భక్తి ప్రేమలచే భగవంతుని ఎట్లు పొందవచ్చునో తెలుపుటకు వచ్చితిని. శ్రీకృష్ణ చైతన్య స్వామివారు జగన్నాథ క్షేత్రములో శుష్క వేదాంతమగు వాసుదేవ సార్వభౌమునికి వేదార్థమెరిగించి అతని భక్తుని చేసినపుడు షడ్బాహు దర్శనమిచ్చిరి. ఆ పడుచు సన్యాసి అంతలో మాయమయ్యెను. అతని స్థానములో ఆర బహువులతో నొక దివ్య పురుషుడుండెను. రెండు చేతులలో విల్లు బాణములు కలవు. రెండు చేతులలో మురళి నూదుచుండిరి. తక్కిన రెండు చేతులలో దండము, కమండలములున్నవి. దీనివలన అతడే రామకృష్ణులనియు తెలియజేసియున్నారు. ప్రజలలో గల తమోగుణమును విరిచి సత్వగుణమును వృద్ధి చేసిన ఉదాహరణములు వారి జీవితమున ఎన్నియో గలవు. తరువాత వారే శ్రీరామకృష్ణ పరమహంసగారై అవతరించి ఆ కాలమునకనుగుణ్యమగు పనులాచరించి ప్రజలనుద్ధరించిరి. భైరవీ బ్రాహ్మణీదేవి యొక్క అనుభవమును చూడుడు: శ్రీరామకృష్ణుడు ఆధ్యాత్మిక విషయములు పలుకుచున్నపుడు తనకు తాను మరచుచుండుట, ధ్యానమునందు బాహ్య ప్రపంచమును మరచుట, సంకీర్తనము నందు తన్మయుడగుట, ఈ లక్షణములను చూచి, అతడు ఏ ప్రపంచాతీతుడయ్యెనని ఆ తల్లి గ్రహించెను. ఈ ఇరువురి అనుభవములు ఆమె చూచుచు ఆ వాక్యములు జ్ఞప్తిచేసుకొనుచుండెను. ఇరువురకు భగవంతునియందు పిచ్చిపట్టెను. ఇరువురును తమ ఆత్మశక్తిని, ఇతరులకు పంచిపెట్టుటలో సమర్థులైరి. ఈ చిహ్నములననుసరించి భగవంతుడవతరించి యుండెనని నిశ్చయించెను.
కావున భగవానులెప్పటికప్పుడు అవతరించుచునే యున్నారు. జ్ఞానులు సులభముగా గ్రహింతురు. ఇంకను మందమతులట్టివారిని దూషింతురు. ఏది ఎట్లున్నను సమకాలికులలో ఎక్కువమంది గ్రహింపలేరు. వారు పాంచభౌతిక దేహమును విడనాడి తరువాత గ్రహింపబడుదురు. ప్రస్తుతము గాంధీతత్వమును గ్రహించవారెందరు కలరు? రమణ మహర్షిగారి బోధలను గ్రహించినవారెందరు కలరు? అట్లే ఆయా స్థలములలో భగవానుడవతరించియున్నను దగ్గరనున్నవారే ఒక్కొక్కప్పుడు తెలిసికొనజాలరు.
ఆంతరంగిక దృష్టితో నా జన్మ కర్మములనెరింగినవాడు ముక్తుడగును. భగవానులు తమ అవతారములు దివ్యములనియు, కార్యములు లోక కళ్యాణమునకై చేయబడినవిగాన పవిత్రమైనవనియు చెప్పుచున్నారు. వారి అవతారములేల దివ్యమైనవి? అని ఊహించినచో వారికి పరిశ్రమ, వయస్సు, కులము దేశ కాల పరిస్థితులు సంబంధం లేకయే సర్వజ్ఞత్వాది మంగళ లక్షణములు ఏర్పడును.

-వడ్డూరి రామకృష్ణ 9959117167