సబ్ ఫీచర్

నఖరంజని..లాభాలు చర్మరోగ నివారిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోళ్ళకు రంగును కలిగించే గోరింటాకు ‘‘నఖరంజని’’ అని పేరు. ఆషాడంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం అనాదిగా ప్రబలంగా ఉంది. ఇది మంచి మూలిక. దాని ఆకులు, పూవులు, గింజలు ఓషధ గుణాలు కలిగి ఉంటాయి. హన్నొటాన్నిక్ ఆసిడ్‌తో కూడి ఒకరకమైన చిరువిషం ఉంటుంది. గింజలో చమురుంటుంది. పూలతో అత్తరు, వాసన నూనె తయారు చేస్తారు. ఆకు నూరి ముద్దలో నిమ్మరసం కలిపి అరికాళ్ళకు పెట్టుకుంటే అరికాళ్ళ మంటలు, నొప్పులు తగ్గుతాయి. నూరిన ముద్దతో తెల్ల గుగ్గిలము కలిపి నుదిటికి పట్టిస్తే తలనొప్పి తగ్గగలదు. ఈ మందును మశూచి బాధితుల పాదాలకు పట్టిస్తే, రోగుల కళ్ళలో అమ్మవారు పోయేదని చెపుతారు. ముద్దతో కీళ్ళనొప్పులు మటుమాయం అవుతాయి. ఆకుల నుండి తయారు చేసిన మలామా గాయాలను, కురుపులను మాన్పుతుంది. బెణుకులు, వాపులు, కషాయంతో కాపడం వల్ల తగ్గుతాయి. దీనిని పుక్కిట పెడితే నోటిలో పుండ్లు తగ్గుతాయి. గోరింట పువ్వులతో నింపిన గుడ్డ సంచిని తలగడగా పెట్టుకుంటే మంచినిద్ర కలిగిస్తుంది. గోరింటాకు ముద్దను గోళ్ళకు పెట్టుకోవడం వలన చక్కని రంగు కలిగించడమే కాక, వ్యాధుల బారి నుండి కాపాడుతుంది. గోరింటాకు ధారణ తెలుగు పడుచులలో విధివిధాయక కృత్యమైన్నది. అరికాళ్ళలో నూరిన ముద్ద చుక్క పెట్టుకుని, అది బాగా పట్టినట్లయితే అయిదవతన వృద్ధియని, బాగా పండితే భర్త ప్రేమ అధికమవుతుందని విశ్వాసం. గోరింట ఆకును కాచు, చింతపండు, నిమ్మరసంతో మెత్తగా నూరి, మగపిల్లలు, ఆడపిల్లలు, స్ర్తిలు చేతి వేళ్ళకు, పారాణిగా పాదాలకు పెట్టుకుంటారు. తద్వారా చర్మం, గోళ్ళు చిక్కని ఎర్రని రంగుతో శోభాయమానం అవుతాయి. కృత్రిమమైన రసాయనిక పదార్థాలతో తయారైన గోళ్ళరంగు కంటె గోరింటతో చేసుకున్న ముద్దతో పాత పద్ధతిని విడనాడకుండా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తుత తరుణంలో గుర్తెరగాలి.

-సంగనభట్ల రామకిష్టయ్య 94405 05494