సబ్ ఫీచర్

తొందరకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురుపూర్ణిమ రోజు గురువును స్మరించడం, ఆయన చెప్పిన మాటలను స్మరణకు తెచ్చుకోవడం ఆచారం. మీకు ఈరోజు గోరఖ్ నాధుడనే గురువు గురించి కొన్ని వివరాలు చెబుతాను.. ఆయన గురువు మత్స్యేంద్రనాథుడు. మత్స్యేంద్రనాథుడు కూడా ఒక గొప్ప యోగి. ఈయనని అందరూ శివాంశగానే భావించేవారు. ప్రజలు ఆయనను సాక్షాత్తు శివుడే అని అనేవారు. ఆయన శిష్యుడు గోరఖ్‌నాథుడు, తనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. తరువాతి కాలంలో గోరఖ్ నాథుడుకూడా ఒక దిగ్గజం అయ్యారు. గోరఖ్‌నాథుడు గురు పీఠం అలంకరించిన తరువాత దానికి ముందుకూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను చేశారు. మన పుణ్యభూమిలో ఇంతటి మహిమాన్వితమైన గురువు లభ్యం కావడం మన పూర్వజన్మ సుకృతం. ఒకసారి మత్స్యేంద్రనాథుడు గోరఖ్ నాథుడితో నడుచుకుంటూ వెళుతూ ఒక చిన్న పిల్ల కాలువను దాటారు. మత్స్యేంద్రనాథుడు ఒక చెట్టు క్రింద కూర్చొని, ‘నాకు కాసిని మంచినీళ్ళు తీసుకురా’ అని అన్నారు. గోరఖ్‌నాథుడు మంచినీళ్ళకోసం పరుగెత్తాడు. గోరఖ్‌నాథుడు ఎలాంటివాడంటే, ఆయన గురువు ఏమి అడిగినా సరే ఒక క్షణంలో చేసెయ్యాలనుకుంటాడు. ఈయన ఆ చిన్నపిల్ల కాలువ దగ్గరకు వెళ్లారు. అప్పుడే కొన్ని ఎడ్ల బండ్లు దాటడంవల్ల నీరు మురికిగా ఉండడం చూసారు. తిరిగి గురువు దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి, ఇక్కడ నీరు మట్టిగా ఉంది, ఒక పది నిమిషాల దూరంలో మరొక నది ఉంది, నేను అక్కడికి వెళ్లి నీళ్లు తెస్తాను అని చెప్పారు. అందుకు మత్స్యేంద్రనాథుడు, ‘‘వద్దు, ఈ కాలువనుంచే మంచినీళ్ళు తీసుకునిరా.. అదే చోటునుండి’’ అని చెప్పారు. కానీ అది అక్కడ మట్టిగా వుంది అన్నాడు గోరఖ్‌నాథుడు. దానికి మత్స్యేంద్రనాథుడు, ‘‘కానీ, నాకు అక్కడినుంచే నీళ్ళు కావాలి, అదేచోటునుంచి’’ అన్నారు. సరే గోరఖ్‌నాథుడు మళ్లీ పరుగెత్తుకు వెళ్లి, అది ఇంకా మట్టిగానే ఉండడం చూశాడు. అపుడు మత్స్యేంద్రనాథుడు కాసేపు నిరీక్షించాడు. ఐదు నిముషాల తరువాత నీళ్ళు శుభ్రంగా, స్వచ్ఛంగా తయారయ్యాయి. ఈయన ఆ నీటిని ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో గురువుగారి వద్దకు తీసుకునివచ్చి ఆయనకు ఇచ్చాడు. మత్స్యేంద్రనాథుడు ఆ నీటిని పక్కన పెట్టారు. దానిని త్రాగలేదు. అపుడు ఇలా గురువుగారు చెప్పారు. గోరఖ్‌నాథ్ నీవు నీలో ఉన్న మరో పార్శ్వం లోనికి వెళ్లడానికి సమయం ఆసన్నమైంది అని మత్స్యేంద్రనాథుడు అన్నారు. అర్థం కాక వింటున్న గోరఖ్ నాథ్ తో గుఠువుగారు నువ్వు పరుగెత్తవలసినదంతా పరుగెత్తేశావు. తీక్షణతో ఏవైతే చెయ్యాలో, అవన్నీ బాగా చేశావు. ఇపుడు సమయం ఆసన్నమైనది. కేవలం నిరీక్షించాలి. అపుడు అదే అంతా స్ఫటికంలాగా స్పష్టంగా మారిపోతుంది అని అన్నారు. ఇది గురువుగారు చెప్పిన సూక్ష్మమైన ఉపదేశం. చింతలన్నీ దూరం చేసుకొని నిశ్చలంగా మనోనేత్రాన్ని భగవంతునిపై నిలిపితే ఏకాగ్రతతో భగవంతుని వ్యక్తరూపంలో దర్శించ వచ్చు.

-సుధీర్ రెడ్డి, 9177747409