సబ్ ఫీచర్

డ్రస్సులపై ఆలోచనా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మాయిలందరూ ఎప్పుడో ఒకప్పుడు కాదు ప్రతిరోజు ఈ సమస్యను చిన్నగానో పెద్దగానో ఎదుర్కొంటుంటారు. సమస్య ఏంటా అని మీ సందేహం అదేనండీ ప్రతిరోజు కాలేజీకి వెళ్లేటప్పుడో, లేక బయటకు వెళ్లేటపుడో ఏ డ్రస్సు వేసుకోవాలి అన్నదే ప్రధాన సమస్య అయి కూర్చుంటుంది. చాలా డ్రస్సులే కొంటారు కాని ఏ సందర్భంలో ఏది వేసుకోవాలో తెలియక తికమక. కాలేజీలకైతే రోజు వేసుకొన్నవే వేసుకొంటున్నానా డౌట్. లేక ఏదో ఒకే రకంవి వేసుకొన్నా అందరిలో ఏ గుర్తింపూ ఉండదు. అట్లాకాక కొత్తకొత్తగాను ట్రెండ్‌కు తగ్గట్టుగాను వేసుకొన్నందుకు ఆనందంగాను, చూసేవారికి ఆహ్లాదకరంగా ఉండాలంటే ముదురు రంగులకన్నా లేత రంగులనే సెలక్ట్ చేసుకోండి. అట్లాఅని ఎప్పుడూ లేత రంగులే కాదు అప్పుడప్పుడు అంటే వారంలో ఏ రోజైనా బ్రైట్ కలర్స్ వేసుకోండి.కొత్తగా ఉంటుంది మీ మనసుకు నచ్చిన కలర్స్ లో వైరైటీ డ్రస్సులను ఎంచుకోండి. ప్రతిరోజు కొత్తదే అన్నట్టు గా ఆలోచించండి. వాడ్‌రోబ్ ముందు నిలబడి ఆలోచించకుండా డ్రస్సులు తీసుకొనేలా దాన్ని సర్దుకోండి. చూడగానే ఫలాన డ్రస్సు వేసుకొంటే బాగుంటుంది అన్న ఆలోచనతో మొదలు పెట్టండి. మీకున్న సెలవు రోజునే రాబోయే వారంలో మీరు ఏం వేసుకోవాలనుకొంటున్నారో ఏ పని చేయబోతున్నారో దానికి తగ్గట్టుగా డ్రస్సులను ముందే చక్కగా వరుస క్రమంలో ఒక ప్రణాళికతో పెట్టుకోండి. కాలేజీకు వెళ్లినా సరికొత్తగా తయారై వెళ్లితే అటు ఫ్రెండ్స్‌లోనైనా, చదువుకోవడంలోనైనా మనసు ముందుకు పరుగెడుతుంది.
అనుకొన్న లక్ష్యం చేరుకోవడానికి వేసుకొన్న ప్రణాళికలాగానే డ్రస్సుల ఎంపిక కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వండి. ఇంట్లో వేసుకొనే దుస్తులు, బయటకు వెళ్లేటపుడు వేసుకొనే దుస్తులు రెండూ వారానికి ఒకసారే తీసి పెట్టుకోండి. ఇక ఏముంది నిద్ర లేచి మీ పనులు అయిపోగానే ముందే అనుకొన్నవి డ్రస్సులను వేసేసుకోండి. మీకు మీ పనిలో కాస్త వెసలుబాటు టైము కలసి వస్తుంది.

-వాణి