సబ్ ఫీచర్

బెరుకెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరికి కొత్తవారితో మాట్లాడాలంటే చాలా భయం వేస్తుంది. వారి అరచేతులు తడిసిపోతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లినా కూడా వారిలో ఎక్కడలేని ఆందోళన, దో తలనొప్పిగానో, కాళ్లనొప్పిగా నో అనిపిస్తుంది. చిన్నపిల్లల్లో ను కూడా ఇది కనిపిస్తుంది. బాగా తెలివి గలవారైనా సరే పరీక్షలంటే ఎంతో భయపడిపోతారు. పరీక్షల సమయంలో వాంతులు, జ్వరం తలనొప్పి ఇలాంటి జబ్బుల బారిన పడడం మనం సాధారణంగా చూస్తునే ఉంటాం. కొత్తవారితో మాట్లాడేటపుడు భయపడే వాళ్లల్లో ఎక్కువగా మహిళలు ఉంటారు. ప్రతి విషయానికి వీరిలో ఆతృత కనిపిస్తుంది. ప్రతివారిలో అంతో ఇంతో భయం, ఆందోళన వుంటుంది. అయితే కొందరిలో తీవ్ర స్థాయిలో వుంటుంది. వారి ప్రవర్తన, ప్రతిస్పందన, చర్యలను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుంది. ఇలాంటి స్థితిని ఆందోళన (యాంగ్జయిటీ న్యూరోసిస్) అంటారు. ఆందోళనగా ఉన్నప్పుడు చాలామంది పదే పదే పెదాలు తడపడం, గోళ్ళు కొరకడం, కళ్ళు చిట్లించడం, అస్థిమితంగా వుండటం లాంటివి చేస్తుంటారు. ఇవి ఆందోళనను బయటఫెట్టడమే అన్నమాట.
కాని, హఠాత్తుగా కుక్క మీదపడినా, పాము కనిపించినా భయపడటం సర్వసాధారణం. బల్లో, బొద్దింకో పైనపడితే కెవ్వున అరవడమూ అంతే సహజం. అయితే ఎలాంటి కారణం లేకుండా తీవ్రంగా భయపడటం, ఏవో ఊహించుకుని కలత చెందడాన్ని ‘ఆందోళన’గా చెప్పవచ్చు
దీనికి కారణం మానిసికంగా కృంగిపోవడం, వ్యధచెందడమే. మానసికంగా ఆందోళన చెందడం కారణం కావచ్చు. ఒకవేళ చాలాకాలంగా ఆందోళన ఉంటే అది నాడీ రుగ్మతలకు దారితీస్తుంది. డిప్రెషన్‌కు గురి చేస్తుంది.
అసలీ ఆతృత భయం ఆందోళన ఇలాంటివి కలుగడానికి కారణమేమిటి అని ఆలోచిస్తే ప్రతికూల ఆలోచనలు, మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాస లోపం, ఆత్మన్యూనత, సిగ్గు, బిడియం, ప్రవర్తనాలోపం, పోటీతత్వం, ఓటమి భయం, నిర్ణయాత్మక శక్తి లోపం తదితర అంశాలు కారణాలుగా కనిపిస్తాయ.
ఇవే కాదు శారీరకంగా ఉన్న లోపాలు కూడా మానసిక అసమతౌల్యతను కలిగిస్తాయ. నిద్రలేమి, అధిక బరువు, శక్తిహీనత తదితర అంశాలు శారీరక కారణాలుగా చెప్పవచ్చు. ఇవే కాదండోయ్ తల్లిదండ్రుల పెంపకలోకం కుటుంబ పరిస్థితులు, పరిసరాల ప్రభావం, చిన్నప్పుడు ఎదురైన అనుభవాలు కూడా ఈ మానసిక ఆందోళనను కలిగిస్తాయ.
అందులోను ఈ మానసిక ఆందోళన మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతవల్ల కూడా తలెత్తుంది. ఎదుగుదల, రుతుక్రమం, గర్బధారణ, ప్రసవం, మెనోపాజ్ లాంటి శారీరక ధర్మాలు స్ర్తిలను ఆందోళనకు గురిచేస్తుంటాయి. అలాగే సామాజిక, కుటుంబ, ఉద్యోగ, ఆర్థిక అంశాలలో స్ర్తిలు ఎక్కువ ప్రతికూలతలను ఎదుర్కొంటుంటారు. దానివల్ల కూడా మానసిక ఆందోళన ఎక్కువ గా మహిళల్లో కనిపిస్తుంది.
ఇవన్నీ దూరం చేసుకోవాలంటే తమ పట్ల తాము అవగాహన పెంచుకోవడంవల్ల ఆందోళనకు దూరంకావచ్చు. ఎలాంటి పరిస్థితులు, సందర్భాలు ఆందోళనకు కారణమవుతున్నామో మొదట గుర్తించాలి. ఎవరికివారు తగిన పరిష్కార మార్గాలు అనే్వషించి ఆచరించాలి. అలాగే ఆత్మవిశ్వాసం, తమమీద తాము నమ్మకం పెంచుకోవాలి. వాస్తవిక దృక్పథం, సానుకూల ఆలోచనలు, తార్కిక దృష్టి, హేతుబద్ధ భావాలు పెంపొందించుకోవాలి. యోగ, ధ్యానం సమతుల ఆహారం, సత్సాంగత్యం ఆందోళననుంచి బయటపడేందుకు దోహదపడుతుంది. అవసరమైతే సైకోథెరపీ, కౌనె్సలింగ్ చేయించుకోవాలి.

--మానస