సబ్ ఫీచర్

పాతజ్ఞాపకాలు.. విలువలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు వడ్లను పెద్ద పెద్దరోళ్లలో వేసి కర్రతో చేసిన రోకళ్లతో ఏపూటకా పూట దంచుకుని తినేవారు. అలా దంచేటపుడురెండు చేతులకు తగిన వ్యాయామం చేసినట్లు ఉండేది. రక్త ప్రసరణ బాగా జరిగేది. కనుకనే వారుప్రత్యేకంగా ఏ వ్యాయామాలు చేయకపోయినా, వారి నడక, వారి పని తీరు వారిని ఆరోగ్యంగా ఉంచేవి.
అంతేకాదు అట్లా దంచేటపుడు పెద్దవారైతే చక్కని ఆధ్యాత్మిక గీతాలు పాడేవారు. ఆ దంపుడు అనువుగా వారి పాట సాగేది. ఇక నలుగురు కలసి వడ్లను దంచుకునేవారు కూడా. అట్లాంటపుడు చక్కని జానపద గేయాలు పాడేవారు. కన్యలు శృంగార గీతాలు పాడేవారు. యువత చక్కని రమ్యమైన సామెతలను, మనోజ్ఞమైన విశేషాలను, పొడుపుకథలను అల్లుతూ పొడుస్తూ, విడిస్తూ చెప్పుకునేవారు. దంపుడు అనువుగా ఎన్నో జానపదగేయాలు పాడువారు. అవన్నీ నేడు జానపద విజ్ఞానవేత్తలు సేకరిస్తున్నారు.
ఏ పరిస్థితుల్లో వారు ఏ పాట పాడేవారో, ఏ బాణీలకు ఆ పాటలకు ఒదిగేవో తెలుసుకోవడమూ ఒక పరిశోధనగా నేడు సాగుతోంది. ఆ పాటల్లో ఎన్నో గొప్ప విశే్లషణాత్మక విషయాలు నిక్షిప్తం అయ్యి ఉన్నాయి. వాటిని నేడు తెలుసుకోవలసిన, విశే్లషించుకోవలసిన అవసరమూ ఉంది.
ఇదిగో ఇలా గతం తలుచుకుంటూ భవిష్యత్తును ఊహించుకుంటూ మేలైన రసవత్తర సన్నివేశాలను మరలా మరలా స్మరించుకుంటూ ఉండడమే కాదు మన గతవైభవ చిహ్నాలన్నీ రాబోయే తరాలకు తరగని గనుల్లా అందించడమే మనం చేయాల్సిన విధి.

- శ్రీనివాస్ పర్వతాల