సబ్ ఫీచర్

గోసంరక్షణ బాధ్యత మనందరిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గోహత్య మహాపాతకం’ అని మన శాస్త్రాలు, ఇతిహాసం చెబుతున్నాయి. ఖురాన్‌లో కూడా గోమాంసం రోగకారమని, ఆవుపాలు, నెయ్యి, వెనె్న రోగాలను పోగొట్టేవని ఉన్నది. జపాన్ శాస్తవ్రేత్త డా.యోషినేరీకి ‘ఆటోఫిణీ’పై ఏకాదశి ఉపవాసాలు క్యాన్సర్‌ను నిర్మూలిస్తాయనే అంశంపై నోబెల్ బహుమతి తెచ్చిపెట్టింది.
భారతీయ శాస్త్ర విజ్ఞానం అనేక ఆధునిక కోణాలలో నిరూపణ అవుతున్న నేటి వైజ్ఞానిక కాలంలో ఇలాంటి విషయాల అధ్యయనము, అవలోకనము అత్యావశ్యకము. ఆర్థిక విషయాలే ముఖ్యమనే మూర్ఖపు, అంధ మూఢ నమ్మకాలకు జరిగే గోవధలవల్ల జరిగే నష్టం తిరిగి పూరించుట చాలా కష్టతరమైన విషయం. అక్రమ పశువధలలో జరిగే కోట్లాది ప్రాణుల బాధాతప్త ఆక్రందనలే, వాటి తరంగాలే నేడు ప్రకృతి వైపరీత్యాలకు కూడా కారణమని శాస్తవ్రేత్తలు తమ పరిశోధనా పూర్వక కారణాలను తెలియజేస్తున్నారు.
ఈమధ్య గోవుల అక్రమ రవాణా పెరిగినట్లు కనపడుతున్నది. గోవధ నిషేధాజ్ఞలు జారీ చేసినా కూడా రకరకాల ఎత్తులతో, కుయుక్తులతో మన అత్యధికంగా రవాణా అవుతున్నాయి. గో సంరక్షణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన, విస్మరించదగని, శాస్ర్తియమైన, దీర్ఘకాల ప్రయోజనాలు, ఆరోగ్య రక్షణ పర్యావరణ పరిరక్షణలకు సంబంధిచిన కొన్ని ముఖ్య విషయాలు- పర్యావరణవేత్తలు, విజ్ఞానవేత్తలు, ప్రభుత్వ అధికారులు ఆలోచించవలసి యున్నది.
ఈ వ్యాపారం వెనుక వున్న అసలు మూలాలు ఏమిటి? వారి నెట్‌వర్క్ ఎక్కడ? గోవుల అక్రమ తరలింపు ఎక్కడ నుంచిఎక్కడకు జరుగుతోం ది? ఎవరు ఏమి చేస్తున్నారు? మన గోసంపదను మనం రక్షించుకోవాల్సింది పోయ ప్రభుత్వం సంరక్షిస్తుందా?లేదా ఏదైనా స్వచ్చంధ సంస్థలు రక్షిస్తాయా అని ఎదురు చూసే పరిస్థితి భారతీయులు చూడగూడని స్థితి. అందుకే ప్రతి భారతీయుడు అనేకాదు ప్రతి మనిషి కూడా గోసంపదను కాపాడాల్సిందే.
పశువుల అంగళ్ళు, వాటి వెనుక వున్న కొనుగోలు మరియు రవాణాదారుల ఆటలు కట్టుబడాలంటే కేవలం ప్రభుత్వానికేకాక గోసంరక్షణపై నిష్ట, శ్రద్ధ, విజ్ఞత అందరిలోను కలుగాల్సిందే. అపుడే గో సంరక్షణ వీలుఅవుతుంది.
గోవైశిష్ట్యము
భారతీయ దేశీ ఆవుల పంచామృతము, పంచగవ్యములతో పోల్చితే వాటికి సమానమైన పాడి కానీ, సేంద్రియ ఎరువులుగానీ, వైద్య లక్షణాలు కానీ మిగిలిన జంతువుల పాలలో కనపడవు. దేశీ ఆవుల పాలు, పెరుగు, నెయ్యి, వెనె్న, మజ్జిగ, గోమూత్రము గోమయాలు కేన్సర్, ఎయిడ్స్‌లతో సహా వందలాది రోగాలను పోగొట్టగలిగే శక్తికలవని తైవాన్, బ్రెజిల్, హార్వర్డ్, జునాగఢ్ వంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో, దేశాలలో జరుగుతున్న పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
గోమయం విషహారిణిగా, రేడియేషన్‌ను తగ్గించు శక్తి కలిగియున్నది. ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేసే సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆవుపేడతో వాటి ప్రమాద స్థాయిని పూర్తిగా తగ్గించే అవకాశం వున్నది. ఆవుపేడతో పిడకలు, కండెలు ఉపయోగించుట కొన్ని రాష్ట్రాలలో ప్రారంభమైంది. గోబర్ గ్యాస్ ద్వారా వాహనాలకు, వంటకు ఇంధన వనరుగా విద్యుదుత్పత్తికీ, వర్మీ కంపోస్టుకూ అనేక రకాలుగా ప్రయోజనమునిస్తుంది.
రాజ్యాంగం గోవులకు ప్రసాదించిన హక్కులను పరిరక్షణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. పరిశ్రమలకంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం యొక్క నిర్దేశము. ఇప్పటివరకూ జరిగిన నష్టం ఇక జరుగరాదు. వైజ్ఞానికంగా ఆయుర్వేదంలో భారతీయ శాస్త్రాలలో చెప్పబడిన గోవు ప్రాధాన్యతలపై నేటి శాస్తవ్రేత్తలతో అవసరమైన పరిశోధనలపై ప్రత్యేక దృష్టి పెట్టవలసి యున్నది.
వేద శాస్తమ్రులు తెలిసిన పండితులు, స్వామీజీలు, గోవిజ్ఞాన అనుభవము కలిగిన శాస్తవ్రేత్తలు, వైద్యులు, గోసంబంధ రంగాలలోని స్థాయి కలిగిన సంస్థలు, విశిష్టవ్యక్తులతో చర్చించి గో రక్షణపై తగు కార్యాచరణము చేపట్టినచో ప్రపంచానికే ఆదర్శంగా మన దేశాన్ని నిలబెట్టగలుగుతాము.

-జగన్మోహన్ 7382440729