సబ్ ఫీచర్

ఆన్‌లైన్ షాపింగ్.. జర జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు ఏ వస్తువు అయినా ఆన్‌లైన్‌లో ఇంట్లోనే కూర్చుని కొనేసుకోవచ్చు. చెప్పుల దగ్గర నుంచి కూరగాయల వరకు దేనినైనా ఇంట్లో ఆర్డర్ పాస్ చేస్తే కొన్ని క్షణాల్లోనో లేక కొన్ని రోజులల్లోనో అనుకొన్నవి అనుకొన్నట్టు మన ముంగిటకు వచ్చేస్తా య. కాని దీనికి కూడా కాస్తంత తెలివితేటలు ఉండాలండోయ్. ఆన్‌లైన్‌లో కొనడం పైన అవగాహన లేకుంటే అనుకొన్నది చేతికందినదొకటి అని పాడుకోవాల్సి ఉంటుంది. అందుకే ముందుగా మనకు ఏం కావాలో ముందు నిర్ణయానికి రావాలి. ఆ తరువాత నెట్ ఓపెన్ చేయాలి. ఉదాహరణకు మనం బట్టలు కొనుక్కోవాలి అనుకొంటే ముందుగా టైలర్ దగ్గరకు వెళ్లాలి. మనకు కరెక్ట్ సైజును తెలుసుకోవాలి.
బ్రాండెడ్ దుస్తులు కొన్నా ఒక్కోసారి లూజ్ కావడమో ఫిట్ కావడమో చూస్తుంటాం. అందుకే ఏ బ్రాండ్ దుస్తుల సైజులేమిటో ముందే చూసుకోవాలి. దీనికోసం మామూలు బజారులో ఆ బ్రాండ్ దుస్తులు అమ్మే షాపులకు వెళ్లాలి. అక్కడ వారి సైజుల గురించి తెలుసుకోవాలి. ఆ తరువాత ఆన్‌లైన్ షాపులను తెరవాలి.
అట్లానే రంగులు పైన కూడా శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే ఫోన్స్‌లోను, నెట్‌లోను రంగులు తేడా ఉంటాయి. మనం చేతిలో పట్టుకుని చూసిన దానికి ఫోన్‌లో చూసిన దానికి చాలా తేడా లుంటాయి. ఇలా ఎందుకు అంటే ల్యాప్‌టాప్ లేదామొబైల్ స్క్రీన్ మీద చూసే రంగులు సహజ రంగులు భిన్నంగా ఉంటాయి. ముదరు రంగుల దుస్తులు ఫోటోల్లో డల్‌గా కనిపిస్తాయి. కాంతి తక్కువగా ఉంటే రంగులు ఫోటోల్లో మరింత కాంతివంతంగా కనిపిస్తుంటాయి. దానికనే ముందుగా ఒరిజనల్ రంగులేమిటి, ఫోట్సోలో కనిపించే రంగులేమిటి అన్నదాన్ని బాగా తెలుసుకోవాలి.
దుస్తులే కాదు పాదరక్షల విషయంలోను ఆన్‌లైన్‌ షాపింగ్ అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. మనం ఆర్డర్ ఇచ్చిన దానికి మన చేతికి వచ్చిన దానికి పూర్తి తేడాలుంటే వెంటనే వాపస్ ఇచ్చేయచ్చు. అట్లా కాకుండా ఉండాలంటే ముందు ఆన్‌లైన్ షాపింగ్ వారి సైజ్ చార్ట్‌లను చూడాలి. అన్ని వైబ్‌సైట్లల్లో కొలతల ప్రమాణాలు ఒకటిగా ఉండవు. కాబట్టి తప్పనిసరిగా సైజు చార్ట్‌ల్లోకి వెళ్లి కావలసిన సైజును ఎంచుకోవాలి. మనం అనుకున్న సైజును కావాలంటే ఆర్డర్ రివ్యూ చేసి ఎడిట్ చేసుకొని తర్వాత ఆర్డర్ పెట్టవచ్చు.
కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే చాలు ఆన్‌లైన్ షాపింగ్‌బ్రహ్మాండంగా కూర్చున్న చోటు నుంచే కాలము, డబ్బులు వేస్ట్ చేయకుండా అనుకొన్నవాటిని కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా కనిపించినవన్నీ బాగున్నాయి కదా అనో, లేక డిస్కంటు ఇస్తున్నాడనో ఏదైనా ఫ్రీఆఫర్ ఉందనో మాత్రం కొనుక్కోవడం మంచిది కాదు. అవసరమైనవి అవసరమైనంత వరకే కొనుక్కుంటే ఎంతో మేలు. డబ్బులు దుబారా కావు.

- వాణి ప్రభాకరి