సబ్ ఫీచర్

ఇది సమంజసమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన మర్నాడు- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జాతీయ స్థాయి విలేఖరుల సమావేశాన్ని నిర్వహించి, కొన్ని అసందర్భ వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందో చెబుతూ, ఆయన కాస్త ‘అతి’గా మాట్లాడటం తెలంగాణ వాదులకు తీవ్ర మనస్తాపం కలిగించింది. మీడియా సమావేశంలో ఆయన వినిపించిన వాణినే రాజ్యసభలో తెదేపా సభ్యులు తిరిగి వినిపించారు. పార్లమెంటులోనే కాకుండా, బయట కూడా ఆ పార్టీ ప్రముఖ నాయకులు పదే పదే అవే మాటలు వినిపిస్తున్నారు. అందరి వాదన ఒకే విధంగా ఉంది. ఇదంతా చూస్తుంటే ఎవరికైనా ఒక విషయం అర్థం అవుతుంది. అది ఏమంటే- అంతా ఒకే దగ్గర కూర్చుని రాసుకున్న స్క్రిప్టునే ఒక్కొక్కరు ఒక్కోచోట వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది.
తెదేపా నాయకులు లేవనెత్తుతున్న, ప్రస్తావిస్తున్న ఆ అసందర్భ విషయాలు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం. చంద్రబాబు మాటలు ఇలా ఉన్నాయి: ‘హైదరాబాద్ నా మానసిక పుత్రిక.. దానికి నేనే రూపమిచ్చా.’.. ‘నేనే సీనియర్ని.. మోదీ, కేసీఆర్‌ల కంటే ముందు నేను ముఖ్యమంత్రిని అయ్యా’.. ‘ఇద్దరు ప్రధానమంత్రులను ఎంపిక చేయడంలో నాదే కీలక పాత్ర.’.. ‘మాది మెజారిటీ, మైనార్టీలకు సంబంధించిన విషయం కాదు, మెజార్టీ- మొరాలటీకి సంబంధించిన విషయం’.. ‘యూటర్న్ తీసుకున్నది ఎవరు?’.. చంద్రబాబు, ఆయన సహచరులు వల్లెవేస్తున్న ఈ అంశాలకు, ఏపీకి ప్రత్యేక హోదా విషయానికి ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ అసందర్భ విషయాలే.
అసహనం పేరుకుపోయిన వ్యక్తుల నుండే ఇలాంటి అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు రావటం సహజం. బాబు ప్రస్తావించిన ఈ అసందర్భ వాదాలను ఒక్కోదాన్ని వివరించే ప్రయత్నం చేద్దాం.
‘హైదరాబాద్ నా మానసిక పుత్రిక- దానికి నేను రూపమిచ్చా’ అనే దానిని పరిశీలిద్దాం. దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వమే మన దేశంలోని ఐదు ప్రధాన పట్టణాలలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ అభివృద్ధి వెనుక కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. (The Rome is not built in a day, similarly Hyderabad is also not built in a day.) చంద్రబాబు హైదరాబాదుకు రాక పూర్వమే అది అభివృద్ధి చెందిన నగరం. ఇక్కడ అన్ని వసతులు నిజాంల కాలంలోనే నెలకొల్పబడినవి అన్నది నిర్వివాదాంశం. 1834లో సెంట్ జార్జ్ గ్రామర్ స్కూల్, 1839లో బొల్లారంలో మెడికల్ స్కూల్, 1855 రోమన్ క్యాథలిక్ స్కూల్ ఇవే తదుపరి ఆల్‌సేంట్స్ హైస్కూల్‌గా మారింది. 1856లో పోస్టర్ శాఖలు, 1874లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఏర్పాటుతో హైదరాబాదు మద్రాసు, బొంబాయి, వైజాగ్, విజయవాడలతో సంబంధాలు ఏర్పడ్డవి. ఉస్మానియా, గాంధీ, ఛాతీ, ఎముకల ఆస్పత్రులే కాదు, మానసిక చికిత్సాలయానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రోగులు చికిత్స నిమిత్తం ఇక్కడికి వచ్చేవారన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇక హైదరాబాదును పారిశ్రామికంగా తానే అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను ఒప్పించి ఇక్కడ ఐ.టి. అభివృద్ధికి కృషిచేసినట్లు బాబు చెప్పుకున్నారు. అందరికీ తెలుపవలసిన విషయమేమిటంటే ఒక్క ఐటి పరిశ్రమ ఇక్కడికి వస్తే పది నిజాంల కాలంలోవెలసిన పరిశ్రమలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయనే నెపంతో మూసివేసిన ఘనత మీ పాలనలోనిదే. ఆ విధంగా మూతబడ్డ పరిశ్రమలు ఒకటి రెండు కాదు.. పదుల సంఖ్యలోనే ఉన్నవి. మచ్చుకు డక్కన్ బటనో ఫ్యాక్టరీ 1916, ఆజాం జాహీ నూలు మిల్లు 1921, డక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ 1927, నిజాం షుగర్ ఫ్యాక్టరీ 1936, సిర్పూర్ కాగితం పరిశ్రమ 1939, ప్రాగాటూల్స్ 1943, ఆల్విన్, రిపబ్లికన్ ఫోర్జ్.. ఇవన్నీ ఎవరి హయాంలో మూతపడ్డాయి? తద్వారా ఎంతమంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు?
మీరు పెట్టించిన ఐటి పరిశ్రమలలో నిరుద్యోగులకు లభించిన ఉద్యోగాలెన్ని? మూతపడ్డ పరిశ్రమలలో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారింది ఎంతమంది? హైదరాబాదుకు మీరిచ్చిన రూపం ఇదేనా? దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వమే హైదరాబాదు అన్ని రంగాలలో అన్ని హంగులతో అభివృద్ధి చెంది ఉంది కాబట్టే మీ కండ్లు హైదరాబాద్‌పై బడి విశాలాంధ్ర నినాదాన్ని తెరపైకి తెచ్చింది అన్నది వాస్తవం కాదా!
తాను సీనియర్ నాయకుడినని ఎన్నో ప్రభుత్వాలను ఏర్పాటుచేశానని తన మామగారు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుచేసినప్పుడు తాను కీలక పాత్ర పోషించానని, ఇద్దరిని ప్రధానమంత్రులుగా చేయటంలో తనదే కీలకపాత్ర అని, మోడీ, కేసీఆర్‌ల కంటే ముందే తానే ముఖ్యమంత్రిని అయ్యాననే మాటల్లో అహంకారం, అసహనం తప్ప మరేమీ కనిపించటం లేదు. ఐనా మీరు సీనియర్ కాదని ఎవరంటున్నారు? మీకెందుకు వస్తున్నది ఈ డౌట్? మోదీ, కేసీఆర్‌ల కంటే ముందే ముఖ్యమంత్రి అయినదాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ- సీఎం పదవిలోకి ఎలా వచ్చారన్నది ప్రశ్న. కుట్రజేసి, మీ మామను గద్దెదించి అధికారం చేజిక్కించుకున్న వైనం ఎవరికి తెలియదు? రాజకీయాల్లో మీకున్న అనుభవం ఇదేనా? రాజకీయాల్లో సీనియర్ అంటే అనుభవం ద్వారా నైతికతతో కూడిన పరిపక్వత వ్యక్తులలో కనిపించాలి కాని అనైతికతతో అడ్డదారిన అందలమెక్కడం కాదు. రాజకీయాల్లో తీసుకునే నిర్ణయాలు అందరూ హర్షించే విధంగా అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి. మోదీ, కేసీఆర్‌లు కుట్రలు, కుతంత్రాలతో అడ్డదారిన అందలమెక్కిన వాళ్లు కాదు. వాళ్ల మామలు ప్రధానులు, ముఖ్యమంత్రులు కాదు. స్వశక్తితో పైకి వచ్చిన వాళ్లు. బాబు ముఖ్యమంత్రి అయినా, మోదీ ప్రధాని అయినా అది మీవల్ల కాదు, ప్రజలవల్ల. మీరు ప్రజలకన్న గొప్పేమీకాదు. ఎక్కువేమీ కాదు. ప్రజలే మీ ఇద్దరి కన్న గొప్ప. ప్రజలు తలచుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓడలు బండ్లయితవి. బండ్లు ఓడలయితవి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఈ అంశానికి, ప్రత్యేక హోదాకు ఉన్న సంబంధం ఏమిటో అర్థం కాదు.
ఏ నైతిక విలువల ప్రకారం 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తెదేపాలో చేర్చుకున్నారు? ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడం నైతికమా? ఇక, ఏ అంశాల ప్రాతిపదికపై మొదట ప్రత్యేక హోదాను కాని ప్యాకేజీకి ఒప్పుకున్నారు? మరలా ఇపుడు ‘హోదా’ కావాలనడం యూ టర్న్ కాదా? మొదటి నుంచి ‘హోదా’ కోరుతున్నవారిది ధర్మపోరాటం కాదట! తనదే నిజమైన ధర్మపోరాటమట!! తనతో కలసిరాని వాళ్లంతా అవినీతి పరులట! రాజకీయాల్లో రాజకీయ పార్టీలు తమ అవసరాన్ని, సమయాన్ని బట్టి ఎటో అటు మొగ్గు చూపుతుంటాయి. ఇతర పార్టీలతో జతకడతాయి. కానీ ఏకంగా యూ టర్న్ తీసుకోవు. నాలుగేళ్లు మోదీ క్యాబినెట్‌లో మంత్రి పదవులు అనుభవించినవారు ఎన్నికల సంవత్సరంలో ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలగి, అవిశ్వాస తీర్మానం పెట్టడం యూ టర్న్ కాదా? అశాస్ర్తియ విభజన వల్లే ఏపీకి కష్టాలు వచ్చాయని బాబు పదే పదే అంటున్నారు. ఈ పరిస్థితికి ఆయన గతంలో అవలంబించిన విధానాలే కారణం. సీఎంగా ఉంటూ కేంద్రంపై యుద్ధం చేయాలని ఆయన పిలుపునివ్వడం బాధ్యతారాహిత్యమే. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎన్నో రకాలుగా దోపిడీకి గురైంది. రాష్ట్రాలకు ఇకపై ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా దాన్ని ఇవ్వాలి. నాలుగేళ్లుగా జనం బాధలు గుర్తుకురాని చంద్రబాబు ఇప్పుడు ఆ జనాన్ని- ‘పోరాటం చేయాల’ని ఉసిగొల్పడం సమంజసమా?

--ప్రొ. జి.లక్ష్మణ్ 98491 36104