సబ్ ఫీచర్

కృష్ణయ్య కృప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణుడు అతి లాఘవంగా కాళీయుని పైన చిందులు వేస్తున్నాడు. అతడు అడుగులకు కాళీయుని నరనరాలు తెగిపోతున్నాయా అన్నట్టుంది. ఆ సంగతి అంతా కాళీయుని భార్యలు చూశారు. ‘అయ్యో తమ నాథుడు ఇలా బాధపడుతున్నాడే. అయినా చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే కదా. మా పతిదేవుడు నిజంగా దేవుడే. అందుకే ఆ కృష్ణుని పాదస్పర్శ తగిలింది. ఇక ఆయనకు పాపమేమున్నది. ఎన్నో యేళ్లనుంచి ఇలా పుడుతూ గిడుతూ ఎనె్నన్నో జన్మలు పొంది ఉన్నాడు. నేటితో ఆయనకు ఈ జన్మల పరంపర ఆగిపోయింది.
ఏ జన్మలోనే చేసుకొన్న పుణ్యం ఇంకా ఉంది కనుక ఇంత దుష్టత్వం చూపినా తన సృష్టిలోని జీవే మరోజీవి నానాహింసల పాలు చేసినా కూడా ఆ కృష్ణయ్య వచ్చి తలపై నిల్చున్నాడు అంటే ఇక ఆయన తప్పిదం ఏమున్నది. ఇదే కదా ఆ భగవంతుని లీల. ఆ భగవంతునికి నీవు, నేను అన్న భేదమెక్కడున్నది. తప్పు ఒప్పు అనునది ఏమున్నది? తన భక్తులను శిక్షిస్తుంటే ఆ భక్తుల రక్షణార్ధం తన్ను తాను సృజియించుకుని భక్తుల కోసం ఎంత దూరమైనా వచ్చేస్తాడు కదా. ఏ రూపాన్నైనా రూపొందించుకుంటాడు కదా. ఏమీ ఈ భగవంతుని లీలారహస్యం. భగవంతుని కరుణాకటాక్షాలు పొందిన భ్యాగవంతుడు మా పతి అని మనసున తలుస్తూ ‘దేవా! దేవాది దేవా! నందనందనా! మధుసూదనా, గోపీలోచనా, గోపీ మనోహరా! యశోదాబాలా! మమ్ము కరుణించు,. ఈ దుష్ట సర్పాన్ని నీవు క్షమించు. అతడు దుష్టుడైనా కాని పనులు చేసినా కూడా అతడు మా భర్త. మా ప్రాణనాథుడు అతడు లేనిదే మేము ఉండలేము. కనుక ఇకపై ఏ పాపపు పనికూడా చేయడు అని మేము నీకు మాట ఇస్తున్నాము. నీవు మాపై కరుణ చూపి మమ్ము కాపాడు తండ్రీ’ అని పదేపదేవేడుకున్నారు.
వారి దీనాలాపనలు విన్న కృష్ణుని తన పాదాల తాడనాన్ని ఆపుచేశాడు. అంతే నవనాడులు కృంగిపోతున్న కాళీయుని తిరిగి ప్రాణం వచ్చినట్లు అయ్యింది. వెంటనే తన కృష్ణుని రోషావేశంతో తునాతునకలైన శరీరాన్ని కూడదీసుకొని ‘పాహి మాం పాహి పాహి’అని శరణువేడాడు.
స్వామీ నీ చేత ప్రాణాలు పోయించుకుని కూడా పాపపు పనులే చేశాను. కానీ, నీవు పరమకృపాళువు. నన్ను ఈవిధంగా కరుణించావు అని వేడుకున్నాడు. స్వామి ఇక పై నేను ఎవరికీ కీడు తలపెట్టను. నా పొగరు అణిగిపోయింది. నాలో ఉన్న నీవు నాకు కనిపించావు తండ్రీ! నన్ను క్షమించు’ అని వేడుకున్నాడు.
‘స్వామీ నాకు ఒక వరాన్ని ఇవ్వు. ఇంతకుముందు గరుత్మంతుని భయంతో రమణక ద్వీపంలో బితుకుబితుకుమంటూ బతికేవాణ్ణి. ఇక నీ పాదముద్రలు నాపై అట్లాగే ఉండేట్లు చేయి. ఆ పాదముద్రలు చూసిన గరుత్మంతుడు నా జోలికి రాడు. ఈ నా కోరికను నీవే తీర్చుము’అని మరలా కోరుకున్నాడు.
‘తథాస్తు’ ఇక నీవు నీ భార్యలతో కలసి సముద్రంలోకి వెళ్లు జీవించు. ఈ యమునా నదిలోని నీళ్లను మనుష్యులు,పశువులు తాగడానికి వీలుగా ఉంటాయి. నీ విషాన్ని కలిగిన ఈ నీరు నేటి నుంచి విషరహితమై తేజరిల్లుతాయి’అని కృష్ణుడు కాళీయుని కోరిక తీర్చాడు.
కాళీయుని రక్షించిన కృష్ణుడిని కాళీయుని భార్యలు వేయి విధాలుగా అర్చించారు. ఇక పై మేమంతా నీవు చూపిన దారిలో నడుచుకుంటాము అని చెప్పివారంతా సముద్రానికి బయలుదేరారు.
కృష్ణుని ఎప్పటిలాగే యశోదానందుల దగ్గర కు వచ్చాడు. అప్పటి దాకా జరిగిదంతా కృష్ణమాయతో వారుమరిచిపోయారు. వారంతా అంత పెద్ద పాము నోటికి చిక్కి ఏ భగవంతుని దయవల్లనో తిరిగి మా చేతికి అందావు. అంటూ కృష్ణుని పొగిడారు. కృష్ణా ఇక ఎప్పుడూ నీవు మమ్ములను వదిలి ఎక్కడకూ పోకు. నీవు లేనిదే మేము లేము అని యశోదా తన ఒడిలో కూర్చున బెట్టుకుని కృష్ణుణ్ణి నెమురుతూ కన్నీరు కారుస్తూ మాట్లాడింది. నందుడు కూడా కృష్ణుడు ఎదకు అదుముకుని కృష్ణా! ఇంత దూరం వచ్చినా నీకు ఆపదలు వస్తూనే ఉన్నాయి. ఆ దేవాదిదేవుడే నిన్న రక్షిస్తాడు. ఇక భయమేదీలేదులే. రాత్రి అయిపోయింది కనుక మనమంతా ఈ యమునా నదీతీరంలోనే ఉండిపోదాం. తెలతెల్లవారగనే మన నివాసాలకు వెళ్దాం అనుకొని వారంతా ఆ తీరంలోనే విశ్రమించారు.
అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఎక్కడ నుంచి వస్తున్నదో ఉన్నట్టుండి ఒక్కసారిగా దావాగ్ని ప్రజ్వలించింది. నాలుగు వేపుల నుంచి దావాగ్ని విజృంభిస్తూ గోకుల వాసులను చుట్టు ముడుతోంది.వారి శరీరాలను ఆ వేడిమి తట్టుకోలేక కాలిపోతున్నాయి. అందరూ కృష్ణా కృష్ణా అని పదే పదే వారికి తెలియకుండానే స్మరిస్తున్నారు.
అందరూ స్వామి కృష్ణా మమ్ము నీవు తప్ప కాపాడేవారే లేరు. ఈ దావాగ్ని కోరల నుంచి మమ్ము దూరంగా తీసుకొని పో. హే గోపీ బాలకా! యశోదానందా! ఓ నందనందనా మమ్ము కాపాడు అంటూ ఎవరికి వారు అరుస్తున్నారు.
దీని నంతా చూసిన బలరామ కృష్ణుడు కొద్దిసేపు యోచించారు. వారికి విధి లీల అర్థమయింది. అయినా సర్వసృష్టి నియంతకు సృష్టిచిత్రం అర్థ మవ్వాల్సిన అవసరం ఉందా? ఒకే ఒక్క క్షణం కృష్ణు డు నోరు తెరిచాడు. అంతే. నలువేపులా చుట్టు ముడుతున్న దావాగ్ని అంతా కృష్ణుని నోట్లోకి వెళ్లిపోయింది. గోకుల వాసులకు చల్లని యమునా నదీ మీద నుంచి వచ్చిన గాలి సోకింది. వారంతా మరలా నిద్రలోకి జారుకున్నారు.
బలరామకృష్ణులూ నిద్రను నటించారు. అంతలో తెల్లవారింది. గోకులం అంతా కళ్లు విప్పింది. తమ ఎదురుగా ఉన్న బలరామ కృష్ణులను ముందు చూసుకొని వారిని ముద్దాడి తరువాత యమునమ్మకు మొక్కులు మొక్కారు. సూర్యునికి నమస్కరించారు. అందరూ కలసి బృందావనం వెళ్దామని అనుకొని బయలు దేరారు.

చరణ శ్రీ