సబ్ ఫీచర్

నిరర్గళమైన దుష్టత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితోనే తండ్రియైన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాప వచనమును బయలువెళ్లును. నా ప్రియులారా! ఇలాగుండకూడదు.
మత్తఋ 12:36 - మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. లోకము ఎన్ని రకాలుగా దూషించినా, హింసించినా, బాధపెట్టినా, అవమానపరిచినా, తిరస్కరించినా, అనరాని మాటలన్నా, చేతకాని వాడివని ఉమ్మివేసినా, విసర్జించినా, నలుగగొట్టినా, కొరడా దెబ్బలు కొట్టినా, మోయలేని సిలువను మోయించినా, కాళ్లకు చేతులకు మేకులు, తలకు ముళ్ల కిరీటము పెట్టినా నోరు తెరువలేదు యేసు ప్రభువు.
యెషయా 53:7 - యేసు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరువలేదు. వధకు తేబడిన గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొఱ్ఱెయు వౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. బదులు పలుకలేదు యేసు ప్రేమ. ఒక మంచి పని చేయడానికి వెళ్లినప్పుడు ఇలాంటి వ్యతిరేకత ఉంటే బదులు చెప్పకుండా ఉండలేము. చేయదలచిన మంచి కూడా చేయము. అయితే మనము అలసట పడకయు, ప్రాణములు విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన యేసు ప్రభువును తలంచుకొనాలి.
1 పేతురు 2:21 - యేసుక్రీస్తు మన కొరకు బాధపడి మనము తన అడుగు జాడలయందు నడుచుకొనునట్లు మన కొరకు మాదిరి యుంచిపోయెను. యేసు ప్రభువు పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. దూషించబడియు బదులు దూషించలేదు. మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. సర్వాధికారము పొందుకున్నాడు. సమస్త జనుల పాపములను క్షమించే అధికారం పొందుకున్నాడు. సమస్త జనుల పాపములను క్షమించటానికి వెల చెల్లించాడు. మన మాటలను బట్టి తీర్పు వస్తే ఎవరు నిలువగలరు. వ్యర్థమైన గాలి మాటలు, కఠినమైన మాటలు, భయపెట్టే మాటలు, గర్వపు మాటలు, ఇచ్ఛకపు మాటలు, డంబపు మాటలు, చెడ్డ మాటలు, రెచ్చగొట్టే మాటలు, కపటపు మాటలు, ఇతరులను తక్కువగా చేసే మాటలు ఆపి, దీవెనలు, శుభ వచనాలు, హెచ్చరికలు, ప్రవచనాలు చేయాలని ప్రభువు ఆశ. అందుకే దావీదు మహారాజు ‘నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్త చూచుకొందు’ననుకొన్నాడు.
రెచ్చగొట్టే మాటలు విని వారిని వారు చంపుకున్నవారు ఉన్నారు. వెంటనే వెళ్లి ఇతరులను చంపిన వారున్నారు.
సామెతలు 26:21 - వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు, కట్టెలు లేని యెడల అగ్ని ఏల ఆరిపోవునో కొండెగాడు లేని యెడల జగడము చల్లారును. 1 పేతురు 3-10 - జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు రాకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఈ కాపుదల మనవల్ల కాదు ఏ నరుడూ నాలుకను సాధు చేయజాలడు అని బైబిల్ తెలియజేస్తుంది. కాని ఈ నాలుక మాట్లాడే చిన్నచిన్న మాటల వల్ల నిత్య జీవము పోగొట్టుకొనవలసి వస్తుంది. యేసు ప్రభువు చేసిన ప్రాణ త్యాగానికి విలువ ఉండదు. మంచి దినాలు చూడలేము.
జీవమును ప్రేమించి మంచి దినములు కోరుకొని క్రీస్తు మనసు గలవారమై సిలువ యాత్రలో ఆయన చూపిన మాదిరి మార్గములో నడచి, కపటమైన మాటలు పలుకకుండా, దూషణ మాటలు పలుకకుండా ఈ జీవితాన్ని కొనసాగిద్దాము.
ఎఫెసి 4:29 - విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి.
ఒకరినొకరు దూషించుకుంటూ అరుచుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటే ఆ ఇల్లంతా అల్లరితో అరుపులతో శాపనార్థాలతో ఆవరించి దేవుని ఆశీర్వాదాన్ని రానివ్వకుండా అడ్డు పడుతుంది. అయితే అదే ఇంటిలో ఒకరినొకరు మంచి మాటలతో మృదువుగా, ఒకరినొకరు ధైర్యపరచుకుంటూ ఆదరించు మాటలు సంతోషకరమైన మాటలతో ఆవరించి ఉంటే దేవుని ఆశీర్వాదపు జల్లులు నిరంతరాయంగా పడుతూనే ఉంటాయి. అటువంటి ఇంటిలోనికి వచ్చి వెళ్లేవారంతా ఆశీర్వదించబడి సమాధానముతో సంతోషంగా ఉంటారు. ఇరుగుపొరుగు వారు సమాధానంగా, ఆనందకరమైన వాతావరణం కలిగి ఉంటారు. ఒక్కసారి ఊహించండి. ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుందో! సామెతలు 25:11 - సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది.
అలసిన వానిని ఊరడించే దయగల మాటలు క్షేమాభివృద్ధి కలిగించే అనుకూల వచనమే పలుకుటకు దూషించబడియు బదులు దూషించక ఆశీర్వదించిన యేసుక్రీస్తు కృప మనకు తోడై యుండి నడిపించునుగాక. ‘మంచి మాటలు పలుకువాడు కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయము తెప్పరిల్లజేయును.’ *

-మద్దు పీటర్ 9490651256