సబ్ ఫీచర్

తల్లిపాలు ఎంతకాలం ఇవ్వాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు తల్లిపాలు ఎంతకాలం వరకు ఇవ్వాలి? ఈ ప్రశ్నకు ఎప్పుడూ సరైన సమాధానం రాదు. కారణం ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు మీ నాన్న అయితే ఐదేండ్లు పాలు తాగాడనో లేదా ఎనిమిదేండ్లు పాలు తాగాడనో చెబుతూండటం తరచుగా వింటుంటాం. డాక్టర్లలో కూడా కొంతమంది కేవలం ఆరునెలలు తల్లిపాలను మాత్రమే ఇచ్చి తరువాత ఇతర ఆహారాన్ని అలవాటు చేస్తూ రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను పట్టాలి అని చెబుతారు. మరికొందరు ఇతర ఆహార పదార్థాలను అలవాటు చేశాక నెమ్మదిగా తల్లిపాలను తగ్గించి సంవత్సరంలోపు మానెయ్యాలి అని చెబుతుంటారు. ఇంతకూ పిల్లలకు ఎన్నిసంవత్సరాలు తల్లిపాలను పట్టాలి. పిల్లలకు ఐదేళ్ళ వరకు తల్లిపాలను పట్టిస్తే తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలు మరింతగా ఉంటాయా? అన్న సందేహం కలిగింది బ్రిటన్ తల్లులకు.. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) ప్రకారం శిశువులు తాగినంత కాలం, తల్లి ఇవ్వగలిగినంతకాలం తల్లిపాలు పట్టవచ్చని చెప్పింది.
మామూలుగా అయతే రెండు సంవత్సరాల తర్వాత పిల్లలకు పాలు పట్టించడం కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తల్లులే.. అనేక అంశాలను ప్రాతిపదికగా చేసుకుని నిర్ణయించుకుంటారు. బ్రిటన్‌లో బిడ్డ పుట్టాక దాదాపు ఎనభై శాతం మంది తల్లులు కొన్ని వారాల పాటు మాత్రమే పాలను ఇస్తారు. తర్వాత కారణాల రీత్యా చాలామంది ఆపేసి డబ్బా పాలను పడతారు. బిడ్డకు చనుబాలు ఇవ్వడం చాలా తక్కువగా ఉన్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే తల్లిపాలను ఏ వయసులో ఆపేయాలనే దానిపై ఎన్‌హెచ్‌ఎస్ నిర్దిష్ట సూచనలేవీ చేయలేదు. శిశువుకు మొదటి ఆరు నెలలు ఇతర ద్రవ, ఘన ఆహారపదార్థాలేవీ ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత నుంచి ఆరోగ్య కారణాల రీత్యా తల్లిపాలతో పాటు ఘన పదార్థాలను కూడా తినిపించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
శిశువుకు తల్లిపాలను పట్టించడం వల్ల శిశువుకు, తల్లికి ఇద్దరికీ మంచిదని నిపుణులు చెబుతున్నారు.
* తల్లిపాల వల్ల శిశువు ఇన్‌ఫెక్షన్ల నుంచి.. ముఖ్యంగా డయేరియా, వాంతుల సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యల ముప్పు తగ్గుతుంది. అలాగే బిడ్డకు పాలు పట్టడం వల్ల తల్లికి రొమ్ము కేన్సర్, అండాశయ కేన్సర్ వంటి వాటి ముప్పు తగ్గుతుంది.
* బిడ్డ రెండో సంవత్సరంలో పడ్డాక కూడా ఘనపదార్థాలతో తినిపించడంతో పాటు తల్లిపాలను కూడా ఇవ్వడం మంచిదని ఎన్‌హెచ్‌ఎస్ చెబుతోంది.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం బిడ్డకు రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వరకు తల్లిపాలను పట్టించవచ్చు అని చెబుతోంది. దీనివల్ల ఆహారంతో అందే పోషకాలతో పాటు బిడ్డకు శారీరక ఎదుగుదలకు అవసరమైన మరిన్ని పోషకాలు అందుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ఏది ఏమైనా మునుపు అమ్మలు, అమ్మమ్మలు చెప్పినదాని ప్రకారం శిశువుకు రెండేళ్ళు వచ్చేవరకు ఇతర ఆహారపదార్థాలతో పాటు తల్లిపాలను కూడా అందించడం అవసరం. అదే విషయాన్ని కొంతమంది పోషకాహార నిపుణులు, వైద్యులు కూడా ధృవీకరిస్తున్నారు.

- విశ్వ