సబ్ ఫీచర్

జీవన ప్రగతికి సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి ఆశ ఉండాల్సిందే. ఆశతోనే జీవన ప్రగతి సాధించడానికి వీలుకలుగుతుంది. కాకపోతే ఈ ఆశ అత్యాశగా మారకూడదు. అత్యాశ ఎప్పుడైతే పొడ చూపుతుందో స్వార్థం బయలుదేరుతుంది. ఆ స్వార్థం వల్ల పక్కవాడిది దోచుకోవాలన్న బుద్ధి పుడుతుంది. ఉదాహరణకు కూర్చోవడానికి కుర్చీ ఉంటే బాగుంటుంది అనుకోవడం సహజం. ఆ కుర్చిలోకి దిండు ఉండాలనుకోవడమూ సమంజమే. కాని కావాల్సిన ఒక కుర్చి కోసం ఎదురింటి వారు నాలుగు కుర్చీలను కొనుక్కున్నారు కనుక మనమూ దానికి రెట్టింపు కావాలనుకోవడం అత్యాశ, దురాశ. ఎవరికి అవసరమైనది వారు కోరుకోవాలి కాని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎవరికో ఉంది కనుక అవసరం లేకపోయనా కావాలనుకోవడం ఒకతప్పు అయతే మళ్లీ దానికోసం పెడదార్లు పట్టడం మరో తప్పు.
అందుకే ఏ కోరికకోరినా అది ధర్మయుతంగా ఉందా లేదా అని సమీక్షించుకోవాలి. జీవనం సాగడానికి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్య సాధనలో ఒడిదొడుకులను తట్టుకుంటూ ఎవరికీ హాని కలుగకుండా ముందుకు పోవాలి. అపుడు మాత్రమే తన లక్ష్యసాధనలో ఎనె్నన్నో అందుకోగలుగుతాడు.
ఇంతవరకు చాలు. అవసరమైనంత వరకు సంపాదన ఉంటేనే మరుజన్మను పునీతం చేసుకొనే వీలుకలుగుతుంది. లేకుంటే ఈ రోజు సంపాదించిన ఆస్తులే రేపటికి అడ్డంకులుగా తయారు అవుతాయ. తరతరాలకు తరగని ఆస్తి సంపాదించాలని ఉన్న జీవితమంతా కష్టపడుతూ లౌకిక సుఖాలకోసమే పరుగిడితే ఆ పరుగులాటలో చేసిన పాపాలే మరుజన్మకు శాపాలుగా మారుతాయ. భగవంతుడు ప్రతిమనిషికి వారికి అవసరమైన సంపదను ఇస్తాడు. ఆ సంపద అందుకోవడానికి కొంత కృషి చేయాల్సి ఉంటుంది. కృషి చేయకుండానే సుఖం కావాలనుకొంటే అది దురాశగా మారుతుంది.
అసలు ఈ లోకంలో సంపాదించేవన్నీ కూడా అశాశ్వతాలే. ఏవీ నాలుగు రోజులపాటు ఉండవు. ఆ విషయం తెలుసుకుని మరీ మసలుకోవాలి. దేన్నీ మరుజన్మకు బంధాలుగా మార్చుకో కూడదు.
ఈషణత్రయం- ధనేషణ, దారేషణ, పుత్రేషణలు ఈ త్రయం కూడా మనిషిని కట్టిపడేస్తుంది. జనన మరణ చక్రంలో ఇరుక్కుని పోయేట్టు చేస్తుంది. వీరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. అట్లాఅని వీరితో ఏ సంబంధం లేకుండా ఉండనక్కర్లేదు అంటుంది భగవద్గీత . కృష్ణుడు కర్మలను ఆచరించు. కానీ ఆ కర్మ తాలూకా కర్తృత్వాన్ని అందుకోకు అంటుంది. అంటే నేను కర్మ చేస్తున్నాను అనుకొంటే ఆ కర్మ తాలూకూ ఫలితం నీవే అనుభవించాలి. అట్లా కాక కర్మ చేయంచే వాడు భగవంతుడు. నేను నిమిత్తమాత్రుడిని అనుకొంటే ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఫలితాలను ఇవ్వాలో భగవంతుడే చూసుకొంటాడు. మీ యోగక్షేమాలను నేను ఎల్లవేళలా చూస్తాను. నాపై విశ్వాసం ఉంచండి అని ఆ కృష్ణుడే గీతాబోధ చేశాడు.
ఆ బోధను అనుసరిస్తే చాలు ఈ జన్మలో ఎన్ని పనులు చేసినా ఫలితాలు అంటవు. మరుజన్మకు కారణంగావు.
‘్ధనమూలం ఇదం జగత్’ అంటారు. వ్యక్తి అవసరాలు తీరాలంటే ధనం అవసరం ఎంతో వుంది. వ్యక్తి పరిస్థితిని బట్టి అవసరాలు మారతాయి. అవసరాలు తీరకపోతే పక్కదారులు కనిపిస్తుంటాయ. ఆ అవసరాలకు పరిమితి ఉంది కానీ ఆశకు లేదు. ఆశలు పెరిగితే అలజడులు పెరుగుతాయి. శాంతి తరుగుతుంది. అలజడులు అహంకారాన్ని ప్రకోపింపజేస్తాయి. అగ్నిగుండాలను సృజిస్తాయి. ఇట్లాకాకుండా ఉండాలంటే అవసరమైనంతవరకే ధర్మయుతంగా ఆర్జించాలి. ధర్మయుతంగా వినియోగించాలి.
ఆసక్తి ఆపదలను, ఆవేదనలను తెచ్చిపెడుతుంది. ఆసక్తిని పెంచుకుని తోడు చేసుకున్నవి వచ్చినట్లే వచ్చి పోతాయి. అవి అన్నీ అశాశ్వతాలే. గృహిణి, పుత్రులు వీరి పట్ల కూడా అతివ్యామోహం ఉండకూడదు. ప్రతి వ్యక్తి తమ జీవితంలో పుట్టినందుకు సక్రమంగా బాధ్యతలు విస్మరించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించి, బరువుల్ని ఎక్కడికక్కడ వదిలెయ్యాలి. సమయం ఉంటే భగవంతుని నామాన్ని స్మరించుకోవాలి. ఆ భగవానుని స్మరణే ఈలోకంలో శాంతిని మరుజన్మలో ప్రశాంతిని ఇస్తాయి.

- చరణ