సబ్ ఫీచర్

కమిలిన చర్మానికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మాయిలైనా అమ్మమ్మలైనా ఎండలో వెళ్లేవాళ్లకు చర్మం కమిలిపోయి నల్లగా మారడం సహజం. చర్మం నిగారింపు కోల్పోవడం చర్మం రంగు కోల్పోవడం చిన్న వయస్సులో ఉన్న అమ్మాయిల మనసును కృంగదీస్తుంది. వారు దానిగురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మరీ బైకుల్లో వెళ్లేవాళ్లకైతే వారి ముఖమే కాదు చేతులు సైతం నల్లగా మారుతుంటాయి.
కమిలిపోయే రంగునే టాన్ అంటుంటారు. ఈ టాన్‌ను పోగొట్టుకోవడానికి చిన్నచిన్న చిట్కాలు చూద్దాం. టాన్ ను వదిలించుకోవాలంటే నలుగు పెట్టడం, నూనె రాయడం అందరూ చేసేదే. బండి నడిపే అలవాటు ఉన్నవాళ్లు ఎప్పుడూ గ్లౌజులు వాడాలి. మాస్క్, స్కార్ఫ్, ధరించాలి. కళ్లకు చలువ కళ్లద్దాలు హెల్మెట్ వాడడం వల్ల కూడా ఈ టాన్ నుంచి తప్పించుకోవాలి. అంతేకాదు ఆహారం , జీవన శైలిలోకూడా మార్పులు చేసుకొంటే మరీ మంచిది.
ఆహారంలో మార్పులు అంటే సమతులాహారం తీసుకోవాలి. ఎక్కువగా పండ్లరసాన్ని సేవించాలి. పండ్లు పచ్చికూరలు, మొలకెత్తిన విత్తనాలు తీసుకొంటూ ఉండాలి. నీళ్లు ఎక్కువ తాగాలి. చర్మంలో సహజనూనెల్ని ఉత్పత్తి చేసే అవిసె గింజల్లాంటివి తీసుకొంటే మంచిది.
వ్యాయామం చేయడం మానకూడదు. కనీసం రోజుకు అరగంట పాటు నడకను అలవాటు చేసుకోవాలి. చిన్నచిన్న ఎక్సైరైజులు చేయడం మంచిదే.
అప్పుడప్పుడు అంటే కనీసం రెండు రోజులకొకసారైనా పసుపు, పెరుగు కలిపి చేతులకు, ముఖానికి పూసుకోవాలి. పదినిముషాల తర్వాత కడిగివేయాలి. రోజూ స్నానానికి పసుపు వాడడం మంచిది. ఒక చెంచా తేనెలో ఓట్స్‌పొడి కలిపి రెండురోజులకొకసారి ముఖానికి పట్టించి పూర్తిగా ఆరిపోయాక కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల కూడా టాన్‌ను తొలగించుకోవచ్చు. ఈ ఓట్స్ పొడిని శరీరానికంతాకూడా నలుగు పెట్టుకోవచ్చు.
పెసరపిండి, శనగపిండి తీసుకొని దానికి కొద్దిగా సన్నని గరుకు గలిగిన బియ్యపుపిండిని కలిపిన నలుగును రోజూ పెట్టుకుంటే ఎండల్లో తిరిగినా కూడా చర్మం నిగారింపును కోల్పోదు. ఒక స్పూన్ బాదం పొడిని తీసుకొని దానిలో టమాటా గుజ్జు, కాసిని పాలు కలిపి ముఖమంతా మర్దనా చేసుకోవాలి. పావుగంట తర్వాత కడిగేసుకోవాలి.
ప్రతిరోజు కొబ్బరినూనెను స్నానానికన్నా ముందుగా ముఖానికి పూసుకొని పావుగంట తర్వాత సున్నిపిండితో రుద్దుకుని స్నానం చేస్తే ముఖం నిగారింపే కాదు మొటిమలు కూడా తగ్గిపోతాయి. ఇలా చేసేటపుడు కేవలం ముఖానికే కాక మెడకు కూడా పూసుకొంటే అక్కడి చర్మం మీద టాన్ తొలిగిపోతుంది.

- లక్ష్మీప్రియాంక