సబ్ ఫీచర్

కళ్యాణ మహోత్సవ వేళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైలాసనాథుడైన పరమేశ్వరుడు పర్వతరాజు పుత్రిక పార్వతీదేవీ వధూవరులుగా శివకళ్యాణం త్రియుగీ నారాయణ్ అనే ఆలయంలో జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగకు పడమరగా 5 కి.మీ దూరంలో త్రియుగ్ నారాయణ్ అనే గ్రామంలో వున్నది. ఈ ప్రదేశం సత్యయుగంలో నిర్మాణమైందని పురాణాలు తెలుపుతున్నాయి.
ఇక్కడ లక్ష్మీ నారాయణల విగ్రహాలు వున్నాయి. గర్భాలయానికి ముందుభాగాన ఒక హోమగుండం నిరంతరం మండుతూనే వుంటుంది. మూడు యుగాల నుండి ఈ హోమం ఆరిపోకుండా నిరంతరం మండుతూనే వుంటుందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ హోమానికి దగ్గరగా వున్న మూడు అడుగుల చతురస్రాకారంలో వున్న రాతిపలక వుంది. ఈ పలకపైన కూర్చొని పార్వతీ పరేశ్వరులు వివాహం చేసుకునన్నట్టు పురాణకథనం.
గడచిన మూడు యుగాలుగా హోమం మండుతూనే వున్నదనడానికి సాక్ష్యంగా వున్న నారాయుణుడికి త్రియుగ్ నారాయణ అనే పేరు సార్థకమైందని స్థలపురాణం తెలుపుతోంది. హోమం నుండి వచ్చే విభూది కలియుగంలోని దంపతులను ఆశీర్వదిస్తుందనే ప్రగాఢ విశ్వాసంతో ఎంతోమంది దంపతులు ఈ ఆలయాన్ని సందర్శించి హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి పార్వతీ పరమేశ్వరులను పూజించి త్రియుగ్ నారాయణ్‌ను కొలుస్తారు.
ఈ ఆలయంలో త్రియుగ్ నారాయణ్, లక్ష్మీదేవి విగ్రహాలు రెండు అడుగుల ఎత్తుకలిగి బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. ముందుభాగంలో గోవింద రాజుల స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయం వెలుపల వైపు మూడు కుండములున్నాయి. వీటిని విష్ణుకుండము, బ్రహ్మకుండము, సరస్వతి కుండము అని అంటారు. శ్రీ మహావిష్ణువు నాభి నుండి సరస్వతీ నది జన్మించి ఈ సరస్వతి కుండములో కలుస్తుందని స్థలపురాణం వెల్లడిస్తోంది. సంతానం లేని దంపతులు ఈ సరస్వతినది జలాన్ని తీర్థంలా స్వీకరిస్తే వారికి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విష్ణుమూర్తి నాభి నుండి ఉద్భవించిన జలం కనుక ఎంతో పవిత్రమైన మహిమ కలిగిన పుణ్యతీర్థంగా భక్తులు భావిస్తుంటారు. దీనికి ప్రక్కనే వున్న బ్రహ్మకుండలిలో నీరు పసుపు రంగులో వుంటాయి. ఈ కుండలిలో బంగారు రంగులో వుండే రెండు పాములు దర్శనమిస్తుంటాయి. ఈ ఆలయం వెలుపల గోడలు లేకుండా నాలుగు స్తంభాలతో నిర్మితమైన మందిరం వున్నది. ఈ మందిరం మధ్యలో నాలుగు అంగుళాల ఎత్తు కలిగిన పానపట్టం మాదిరి రాతి పలక ఉంది. దీనిపై చిన్న శివలింగం వుంది.
వివాహం జరుగక అడ్డంకులు ఎదుర్కొంటున్నవారు ఈ శివలింగానికి మ్రొక్కితే తప్పక వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. మూడు యుగాలు గడిచినా చెదిరిపోకుండా వున్న ఈ ఆలయమే నారాయణుని మహిమకు నిదర్శనం. ఈ ఆలయాన్ని చేరి స్వామిని దర్శించడానికి భగవంతుని ఆశీర్వాదం కూడా వుండాలని చెప్తుంటారు. సత్యయుగంలోని శివపార్వతుల కళ్యాణ వేదిక చూడటానికి ఎంతో పుణ్యం చేసుకొని వుండాలని, సందర్శించినవారికి కోరికలు నెరవేరి సుఖశాంతులతో వుంటారని ఇక్కడి వేద పండితులు చెప్తుంటారు.
సత్యయుగంలో ఈ పవిత్రస్థలం హిమవత్ పర్వతానికి రాజధానిగా ఉండేదని స్థలపురాణం చెపుతోంది. కలియుగంలో ఎవరైనా ఇటువంటి యుగయుగాల చరిత్ర వున్న దేవతల కళ్యాణ వేదికలు సందర్శించే భాగ్యం కలగడం అంటే అది వారి పూర్వజన్మ ఫలమేనని, పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదమేనని ఆలయాన్ని సందర్శించి, ఆ ప్రకృతీ పురుషుల తీర్థప్రసాదాలు సేవించడంతో మానవజన్మ చరితార్థమైనట్లేనని ఆలయ పండితులు చెబుతారు.

-బ్రహ్మశ్రీ కురువాడ మురళీధర్