సబ్ ఫీచర్

లోలాకుల కులుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతిలో చెవులు కుట్టించుకోవడం ఓ సంప్రదాయం. చెవులు కుట్టించుకోవడమే కాదు వివిధ రకాల ఆభరణాలు ధరించడం ముందునుంచి ఉన్నదే. అలాంటివాటిల్లో లోకలాకులు ఒకటి. వీటినే జముకీలు అనేవారు. ఇపుడు ఇయర్ రింగ్స్ అంటున్నారు. ఇపుడు ఆధునికతకు తగ్గట్టుగా వివిధ రంగులు, వివిధ ఆకర్షణీయమైన డిజైన్లుకంటికింపునే కాదు ఆలోచనను కూడా కలిగిస్తున్నాయి నేటి ఇయర్ రింగ్స్.
పూర్వం బంగారం, రత్నాలు, మాణిక్యాలు, కెంపులు ఇలాంటి వాటితోనే లోలాకులు చేయించుకునేవారు. కాని ఇపుడు డ్లాటినం, ప్లాస్టిక్, మెటల్, గ్లాస్ , కొయ్య, రబ్బర్ వంటి వాటితోనూ తయారు చేస్తున్నారు. ఇవి ఫ్యాషన్ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి.
ఇదివరకటి రోజుల్లో చెవికి దిద్దులు, రింగులు పెట్టుకుని సరిపెట్టుకునేవారు. కానీ రీసెంట్ ఇయర్స్‌లో ట్రెండ్ మారింది. రకరకాల ఇయర్ రింగ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి.
ఫ్యాషన్ ప్రపంచంలో చెవి ఆభరణాలది ఎప్పుడూ అగ్రస్థానమే. జుముకీలు, స్టడ్స్, హూప్ ఇయర్ రింగ్ డ్యాంగల్ ఇయర్ రింగ్, స్లేవ్ ఇయర్ రింగ్, హగ్గీ ఇయర్ రింగ్ , ఇయర్ థ్రెడ్ , ఇయర్ స్పైక్స్, ఇలా అనేక రకాలు మార్కెట్లో హాల్‌చల్ చేస్తున్నాయి. ఒక సెంటీ మీటరు మొదలుకొని మూడు నాలుగు అంగుళాల హ్యాంగింగ్స్ కూడావివిధ రంగులు, ఆకారాలు, డిజైన్లలో లభిస్తున్నాయి. హగ్గీ ఇయర్ రింగ్స్ చెవికి అతుక్కున్నట్లుగా ఉంటాయి. స్లేవ్ ఇయర్ రింగ్‌నే బజోరాన్ ఇయర్ రింగ్ అని పిలుస్తారు. చెవులకు పూలూ పండ్లూ డిజైన్ల వేలాడదీసుకోవడం మామూలే. కానీ ఎలుకలూ తొండలు, మొసళ్లల్లాంటివీ పెట్టుకుంటేనే కదా నలుగుర్లోకి భిన్నంగా కనిపించేది, ఈ ఆలోచనలతోనే వియర్డ్ ఇయర్ రింగ్స్ లో కాళ్లూ చేతులూ తలా ఇలా ఒక్కో శరీర భాగాన్నీ వేలాడదీసినట్లు వస్తున్నాయి. ఇదీ అదీ అని కాకుండా అసలు చెవులకు ఇవీ పెట్టుకుంటారా అనిపించే వస్తువుల రూపాలనూ లోలాకులుగా తయారు చేస్తున్నారు. బల్బు, అక్వేరియం, సెలైన్ బాటిలూ అవీ కాదండే అస్థిపంజరాలూ అన్నీ అందులోనే అమరిపోతున్నాయి. పెట్టుకునే వాళ్లున్నప్పుడు తయారు చేసేవాళ్లూ ఉంటారు...

--తరిగొప్పుల విఎల్ల్‌న్ మూర్తి