సబ్ ఫీచర్

భారతం ‘బొంకు’ కాదు.. ఓ జ్ఞాన భాండాగారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సనౌలి గ్రామంలో మహాభారత కాలం నాటి కత్తులు, రథాలు, సమాధులు పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. క్రీస్తుపూర్వం రెండువేల సంవత్సరాల నాటి ఈ వస్తువులు, సమాధులు అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించే అవకాశాలున్నాయి. ఇక, రామాయణ కాలం నాటి ఆనవాళ్లు సైతం అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అంతరిక్షం నుంచి ‘నాసా’ చిత్రించిన ఫొటోల్లో ‘రామసేతు’ కనిపించడంతో దానిపై పరిశోధనలు జరుపుతున్నారు. వినూత్న సాంకేతిక నైపుణ్యంతో మానవులు (వానరులు) నిర్మించిన వారధిగా ‘రామసేతు’ను గుర్తించారు. ఈ వారధి కొంత భాగం కూల్చేందుకు చేసిన ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. దాంతో చాలామంది మనోభావాలు దెబ్బతినకుండా కాపాడగలిగారు.
లంకకు చెందిన రావణుడు ఓ బ్రాహ్మణుడు. అతను ఇప్పటి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు సమీపంలోని ఓ గ్రామంలో జన్మించాడని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఇప్పటికీ ఆ గ్రామం ఉండటం విశేషం. అతని భార్య మండోదరిది కూడా ఉత్తర భారతంలోని ఓ గ్రామమని తెలుస్తోంది. ఈ వివరాలతో ఆర్య-ద్రావిడ వాదనలకు దాదాపుగా తెరపడింది. బ్రిటీషు వారి కుట్ర.. కొంత మంది స్వార్థప్రయోజకులైన చరిత్రకారుల రాతల తప్పులతడకగా తేలుతోంది. కైబర్ కనుమ ద్వారా విదేశీయులైన ఆర్యులు వచ్చారని, స్థానికులను లొంగదీసుకున్నారని, దక్షిణాది వారిని తరమడం వల్ల వారు మరింత ‘కింద’కు వెళ్ళారని, ద్రావిడులు తమ స్వయం ప్రతిపత్తికోసం పోరాడారని, భారతదేశానికి మూలవాసులు ద్రావిడులేనని, రావణుడు కూడా ద్రావిడ మహారాజు అని... ఇలా రకరకాల కట్టుకథలు చాలాకాలం చెలామణిలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ద్రవిడ రాజకీయాలు చాలాకాలం ఈ ‘ఊహాగానం’పైనే ఆధారపడి నడిచాయి. విచిత్రమేమిటంటే జ్ఞాన సంపన్నులమనుకునే మార్క్సిస్టులు-మావోలు సైతం ఈ ఊహాగానాలకే ఊతమిచ్చారు, ఊపిరిపోశారు. ఇప్పుడు క్రమంగా ఆ ‘నమ్మకం’ కరిగిపోతోంది, వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ద్రవిడ-ఆర్యుల సిద్ధాంతం కొంతమంది తమ పబ్బం గడుపుకోవడానికి సృష్టించిన పుక్కిటి పురాణమని వెల్లడైంది.
రామాయణాన్ని రాసిన వాల్మీకి బ్రాహ్మణుడు కాదు, అగ్రకుల ఆర్యుడు కాదు.. ఓ నిమ్నజాతికి చెందినవాడు. భారతాన్ని రాసిన వ్యాసుడు వర్తమాన పదంలో చెప్పాలంటే ఓ బడుగువర్గానికి చెందినవాడు. మహాకవి కాళిదాసు కట్టెలు కొట్టుకుని జీవించే ఓ పేద కుటుంబానికి చెందినవాడు. ఇలా అనేకమంది రుషులు, మహర్షులు, కవులు, జ్ఞాన సంపన్నులు సమాజంలోని కింది తరగతుల నుంచి వచ్చిన వారేనని తేటతెల్లమవుతోంది. వీరినే అప్పటి సమాజం, ఇప్పటి సమాజం గౌరవిస్తోంది. ఇందులో ఆర్యులు గాని, ఆనాటి అగ్రవర్ణాల వారు గాని ద్రవిడులను ‘తొక్కి’వేశారన్న భావన, అణచిపెట్టారన్న ఆలోచన కనిపించదు. కేవలం ‘జ్ఞానం’ ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడటమే కనిపిస్తుంది. ఆ జ్ఞానం అగ్రవర్ణాల వారి వద్ద ఉన్నదా? నిమ్నజాతుల వద్ద ఉన్నదా? అన్నది అప్రస్తుతం. ఇదే పరంపర ఇంకా కొనసాగుతోంది. ఇదే ఈ దేశపు గొప్పదనం. దీన్ని ఎవరు తొక్కిపెట్టి, ఏదేదో ప్రదర్శించాలని ప్రయత్నించినా బీజంలోని సత్తువలా భూమిలోంచి మళ్లీ మళ్లీ తన్నుకువస్తూనే ఉంది.
వాస్తవానికి రావణుడు బ్రాహ్మణుడైనా, అగ్రవర్ణానికి చెందిన విద్వాంసుడైనా, గొప్ప పండితుడైనా, పరాక్రమవంతుడైనా, కుబేరుడిని కొల్లగొట్టినా ‘కాలం’ అతణ్ణి గుర్తుపెట్టుకోలేదు. ‘దిగువ మెట్టు’పై ఉన్న క్షత్రియుడైన రాముడినే ‘కాలం’ గుర్తుపెట్టుకుంది. అగ్రవర్ణాల వారైన బ్రాహ్మణులు సైతం గుణ సంపన్నుడైన రాముడినే అనాదిగా ఆరాధిస్తున్నారు. ఈ ఒక్క ‘మెలకువ’ అవగతమైతే మానవజాతి చరిత్ర చాలావరకూ అర్థమవుతుంది. దళితుల నుంచి మొదలుకుని నిచ్చెన మెట్ల సమాజంలో ఎత్తున ఉన్న అగ్రవర్ణాల వారందరూ ఆ క్షత్రియ జ్ఞానవంతుడినే, పరాక్రమవంతుడినే కొలుస్తున్నారంటే ముఖ్యంగా భరతఖండంలోని ‘చైతన్యం’ ఎలాంటిదో ఇట్టే అవగతమవుతుంది! దీన్ని పట్టుకోవడం మాని, ఏవేవో సిద్ధాంతాలంటూ ఊరేగితే ఒరిగేది ఏమిటి? వాస్తవాల్ని దర్శించేవాడే పదిమందికి ఆదర్శంగా నిలిచే అవకాశాలుంటాయి. వారికి మార్గదర్శనం చేసే వీలుంటుంది!
ఈ ముఖ్య విషయాన్ని విస్మరించి, కర్తవ్యాలు, బాధ్యతలపై ఆధారపడిన ‘వర్ణ వ్యవస్థ’నే అంతిమంగా భావించి అందులో దొర్లిన దోషాలను, తప్పులను తుపాకులతో, బాంబులతో సరిదిద్దుతామని కొందరు బయలుదేరడం విషాదాంత నాటకాన్ని ముందే ప్రదర్శించినట్టవుతుంది. గణతంత్రంగా భారత్ వెలుగొందిన ఆ ఆనవాలు ఇంకా సజీవంగా కనిపిస్తున్న విషయాన్ని చూసేందుకు నిరాకరించడం వల్ల, ఆవేశంతో, ఉద్రేకంతో, విశృంఖలంగా వ్యవహరించినందువల్ల గొప్ప వ్యవస్థ పురుడుపోసుకోదని ఇంకెప్పటికి అర్థమవుతుంది? సంకుచితమైన, సంకరమైన ఆలోచనల ‘మైండ్‌సెట్’ను సరిదిద్దుకున్నప్పుడే గొప్ప ఫలితాలు వెలువడుతాయి. గమ్యాన్ని ముద్దాడే దారి కనిపిస్తుంది.
ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రం, దేశం అత్యంత గౌరవనీయమైనవి, ఆదరణీయమైనవి. వాటిని గాలికి వదిలేస్తే ప్రజల జీవితాలు సైతం గాలిలో కలుస్తాయి. రాష్టమ్రుంటేనే దేశం ఉంటుంది. దేశముంటేనే ప్రపంచముంటుంది. ఇవి పరస్పర ఆధారాలుగా కనిపిస్తాయి. రాష్ట్ర ప్రజల కష్టం వల్లనే ‘ఆర్థికం’ ఏర్పడుతుంది. పరస్పర ఆధార జీవనంతో ముందుకు నడిచే వీలుంటుంది. రాష్ట్రానికి గాక ప్రపంచానికి ప్రాధాన్యతనిస్తే ఎద్దు స్థానంలో బండి, బండి స్థానంలో ఎద్దు నిలిపినట్టుగా ఉంటుంది. అది సరైన వైఖరి అవదు. ఈ దేశంలో కమ్యూనిస్టులు, మావోయిస్టులు విఫలమవడానికి ప్రధాన కారణం ఇదే. స్వాతంత్య్ర పోరాట కాలంలో భారతీయుల శత్రువైన బ్రిటీషు వారికి సహకరించడం, మద్దతు ప్రకటించడంతో వారు దేశానికన్నా ప్రపంచానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అందుకోసం ప్రాణాలివ్వమని ప్రోత్సహించడం చూస్తే వారి మానసిక స్థితి తేటతెల్లమైంది. అది అలాగే కొనసాగుతూ ఉంది. దాన్ని సరిదిద్దుకోవడానికి ఎన్నో భేషజాలు అడ్డొస్తున్నాయి. అంతర్జాతీయ తెరలు వారి కళ్ళముందు వాలుతున్నాయి. దాంతో వారి ‘ప్రాసంగికత’ క్రమంగా సన్నగిల్లుతోంది. ప్రజల్ని ఉజ్వల భవిష్యత్ దిశగా నడిపించాలనుకునేవారు ఇలా పిడివాదంతో, అవాస్తవాంశాలతో ఊరేగినంత కాలం ఎవరికి ప్రయోజనం? రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రజల అభివృద్ధిని ప్రేమించనంతకాలం ఎంత అంతర్జాతీయ సిద్ధాంతమైనా వెలవెలబోవలసిందేగా!
వర్తమాన సమాజంలో వారి ప్రాపంచిక దృక్పథం ప్రాసంగికతను కోల్పోయిందని వారి అభిమానులే, ఆరాధకులే చెబుతున్నా పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యవహరించడం వల్ల ప్రజల జ్ఞానం వృద్ధిచెందుతుందా? ‘జ్ఞానం’ అనే ఇరుసుపైనే యుగయుగాల మానవ జీవితం ఆధారపడి తిరుగుతోందని రామాయణ, మహాభారత కాలాల నాటి అవశేషాలు తెలియజేస్తున్నా పట్టించుకోకుండా- ‘వర్గాలు, వర్గకసి, సాయుధ పోరాటం, ప్రజాసైన్యం..’ అంటూ పలవరిస్తే ప్రజలకది నష్టాన్ని మిగిలిస్తుంది తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. ఈ ఇంగిత జ్ఞానం లేకుండా, జ్ఞానంపై పెట్టాల్సినంత దృష్టిపెట్టకుండా అకస్మాత్‌గా వనరులన్నీ తమ ఆధీనంలోకి రావాలని రంగుల కలలుకంటే అది వాస్తవికత అనిపించుకుంటుందా? దేశాన్ని మరిన్ని ముక్కలు చేయాలనుకోవడం, ద్రావిడుల (అలాంటి వారెవరూలేరని డి.ఎన్.ఎ. చెబుతోంది.)కు అన్యాయం జరిగిందని, అది ఇంకా కొనసాగుతోందని, దాన్ని సరిదిద్దడానికి తిరుగుబాటు, సాయుధ పోరాటం తప్ప మరో మార్గం లేదని రాత్రి-పగలు ఏకంచేసి ప్రచారం చేస్తే- మరింత నష్టపోవడం తప్ప ఇసుమంత ప్రయోజనం చేకూరదు. ఆరోగ్యకరమైన ‘స్పర్థ’ ఆర్థికంగా ఎదిగేందుకు, సమకాలీన సమాజంలో తలెత్తుకుని తిరిగేందుకు ఉపకరిస్తుంది. దాన్ని విస్మరించినంత కాలం అభివృద్ధి వెక్కిరిస్తూనే ఉంటుంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన ‘నాసా’ సంస్థ కృత్రిమ మేధను మరింత అభివృద్ధి పరిచేందుకు కంప్యూటర్ లాంగ్వేజి (్భష)కి కేవలం సంస్కృత భాష పనికొస్తుందని గుర్తించి దశాబ్దాలుగా ఈ విషయమై పరిశోధనలు చేస్తూ, దాన్ని బైనరీ భాషకు అన్వయిస్తున్న వేళ... ఆ భాష భారతదేశంలో చాలామందికి కరతలామలకమైనప్పుడు ఇక్కడ ఆ భాషను, ఆ పరిశోధనలను, తదనుగుణమైన అంశాలను అభివృద్ధిపరిచే దిశగాగాక ఆ భాష ‘నడ్డి’విరిచినప్పుడే ప్రజలకు ‘న్యాయం’ జరుగుతుందని బోధించే వారి మానసికస్థితి ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది. కాబట్టి మన అడుగులు ఎటువైపుపడాలో ఎవరికివారే నిశ్చయించుకోవాలి! నిజం తెలుసుకోవాలి!

-వుప్పల నరసింహం 99857 81799