సబ్ ఫీచర్

విధి విచిత్ర లీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ నన్ను త్రిలోక సంచారి అనీ హరిభక్తుడనని అంటుంటారు. నాకీ త్రిలోక సంచారత్వమూ కలియుగంలో కలహప్రియుడన్న బిరుదువాచకమూ అసలు ఎందుకు వచ్చాయో చెప్తాను వినండి. మన చేతలు మన జన్మలను ఎలా శాసిస్తాయో పరికించండి. ఎంత చేసుకొన్న వాడికి అంత అంటే దానికి నా జీవితమే ఉదాహరణగా ఉంటుంది.
ఒకానొక కాలంలో నేను అందగానిగా పుట్టాను. ఎంతో గర్వాతిశయంతో ఉండేవాడిని. ఎంతో మంచివానిని కూడా. పెద్దలతో ఎంతో వినయంగా ఉండేవాడిని నన్ను ఉపబర్హణుడు అని పిలిచేవారు. నాది గంధర్వ వంశం. ఇట్లా ఉండే నాకు మధురమైన కంఠధ్వని కూడా ఉండేది. నేను పాటగానినిగా కూడా ప్రసిద్ధికెక్కాను. ఎందరో లలనామణులు నా అందం చూసి మైమరిచి నా దగ్గరకు వచ్చేవారు. నేను వారి వాలుచూపుల్లో ఇరుక్కుపోతూ ఉండేవాడిని.
లోక కల్యాణం కోరి ప్రజాపతులు ఓసారి దేవసత్త్రం అన్న యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించారు. మేము గంధర్వులం కనుక వారు మాకు ఆ యజ్ఞానికి ఆహ్వానం పలికారు. మాతోపాటు అప్సరసలూ వచ్చారు. నన్ను ముఖ్యంగా విష్ణుకథలను గానం చేయమని చెప్పారు. నేను యజ్ఞం చూడడానికి వచ్చేవారికి, యజ్ఞం చేస్తున్న వారికి కూడా సమ్మోహనం కలిగించేటట్టుగా ఎంతో శ్రావ్యంగా విష్ణుకథాగానం చేస్తుండేవాడిని.
నేను యజ్ఞపురుషుడైన విష్ణులీలలను వీనుల విందుగా పాడుతుంటే మందగామినులు వచ్చి వారి హావభావాలతో కనులవిందుగా నృత్యాలు చేసేవారు.
నేను ఆ మందగామినుల నృత్యం చూసి మైమరిచిపోయాను. నా గానం పక్కన పెట్టి వారి వెంట వెళ్లాను. వారు నన్ను చూస్తే చాలన్న మైకంలో పడిపోయాను. హరికీర్తన చేయాల్సిన నా నోటితో నేను కమలాక్షుల నృత్యాన్ని కీర్తించడానికి వెచ్చించాను.
దేవసత్త్రయజ్ఞాన్ని మరిచాను. నారీమణుల నర్తనంతో పులకించిపోతూ వారి వెంట యజ్ఞం విడిచి తిరుగుతున్నాను. దానితో ప్రజాపతులకు కోపం వచ్చింది.
వారు ఉగ్రమైన దృష్టిని నాపై ప్రసరింప చేశారు. కానీ నేను మాత్రం ఏమాత్రం జంకు గొంకు లేకుండా ఆ కోమలాంగుల వెంట కొంగుపట్టుకుని తిరిగాను. అంతే
ఆ ప్రజాపతులు పట్టరాని ఆగ్రహావేశులై నన్ను శపించారు. ‘ఓరి పాపీ! నీవు మా ఆజ్ఞను ధిక్కరించావు కనుక నీకే దివ్యశక్తులు లేకుండా ఓ శూద్రస్ర్తికి జన్మింతువుగాక!’ అని అనేశారు.
చూశారా... ఎక్కడి గంధర్వ వంశం.. ఎక్కడి శూద్రస్ర్తి వంశం... నేను మాన్ప్రడి వారి వంక చూశాను. వారింకా కోపోద్రిక్తులై ఉన్నారు. నాకు నా తప్పు తెలిసింది. అయినా నేను ఇప్పుడు ఏం చేయగలను.అంతా విధి విచిత్రం అనుకొన్నాను.
....ఇంకావుంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804