సబ్ ఫీచర్

నిండైన నిద్రకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాయిగా నిద్రపోతే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అలసట మాయ మవుతుంది. చేయాల్సిన పనుల్లో మరుపు రాదు. ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేయాలంటే సరైన నిద్ర అవసరమే. కేవలం చిన్న పిల్లలే కాదు మహిళలకు పురుషులకు కూడా అవసరమే. కానీ ఈమధ్య నిద్ర పట్టటం లేదు అనేవారు ఎక్కువ అవుతున్నారు. ఉద్యోగాలు, టీవీలు చూడడాలు, ఫోన్లు అనేక రకాల మాధ్యమాల మధ్య బతికే మనిషి నిద్రకు దూరమవుతున్నాడు. అనేక రోగాల బారిన పడుతున్నాడు. సరైన తిండి సరైన నిద్ర కరువు ఏర్పడితే రోగాలు దరి చేరుతాయి. అందుకే సరైన నిద్ర ఉండి తీరాల్సిన వాటిల్లో ఒకటి అంటున్నారు వైద్యులు.ప్రతి మనిషి కూడా 6 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. దానికోసం మనసు ప్రశాంతంగా ఉండాలి. నిద్రసుఖమెరుగదు అన్నా కూడా నిద్ర పోవడానికి సరైన పడక తీరు ఉండాలి.
పరుపులు గట్టిగానో, అతిమెత్తగానో ఉండకూడదు. దిండ్లు కూడా సక్రమంగా ఉండాలి. అతి ఎత్తుగా దిండు ఉంటే మెడ నొప్పికి దారితీస్తుంది. అసలు దిండు లేకుండా పడుకోవడం మంచిదనే వైద్యులున్నారు. తలగడ లేకుండా పడుకునే వారు అరుదుగా ఉంటారు కనుక తలగడను అతి ఎత్తుగా కాకుండా గట్టిగా కాకుండా, ఎగుడు దిగుడులేకుండా చూసుకోవాలి.పడక గదిలోవెలుతురు తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. లేత రంగులు మంచి నిద్రను కలుగచేస్తాయి. కొందరికి చీకటిగా ఉంటే నిద్ర వస్తుంది. అట్లాంటి ముదురు రంగు కర్టెన్సు వాడితే మంచిది. కొందరికి సన్నని వెలుతురు ఉండాలి. వారు బెడ్ లైటు రంగును నీలంగానో, పచ్చగానో ఉంచుకుంటే మంచినిద్ర వస్తుంది.
వీటితో పాటుగా నిద్రకు వెళ్లే గంటముందే భోజనం ముగించుకోవాలి. భోజనం తరువాత తప్పనిసరిగా అరగంట నడవాలి. నిద్ర పోబోయేముందు ఒక గ్లాసు పాలు తీసుకొంటే మంచి నిద్ర పడుతుంది.
నిద్ర పోయే ముందు కాసేపు మీకిష్టమైన దైవ ధ్యానం చేస్తే మరీ మంచిది. కాసేపు చిన్నపాటి వ్యాయామాలు, లేకుంటే నడక మంచినిద్రను ఇస్తాయి.
ఏ నామమూ జపించకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి కాసేపు వౌనంగా కూర్చుని తరువాత పడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
చిన్నప్పటి నుంచి నిద్రపోవడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోను నిద్రకుపక్రమించాల్సిందే. కొందరు నిద్ర లేవడానికి అలారాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఈ అలారం శబ్దం నిద్ర మీద ప్రభావాన్ని చూపుతుంది. అలారం లేకుండానే మనసులో ఫలాన టైములో లేవాలి అని కచ్చితమైన అభిప్రాయంతో పెట్టుకుంటే ఆ సమయానికి మెలుకువ దానంతట అదే వచ్చేస్తుంది.
రోజు సూర్యుడు రాకముందే నిద్రలేచే పద్ధతి వల్ల ఆరోగ్యమూ బాగుంటుంది. ఆయుష్యు వృద్ధి అవుతుంది. చాలామంది ఆరోగ్య రహస్యం నిద్ర తొందరగా లేవడమే అంటారు. రాత్రి 12 దాకా మేల్కొవడమూ మంచిది కాదు పొద్దున ఏడైనా లేవకుండా ఉండడమూ మంచిది కాదు. అందుకే తొందరగా పడుకుని తొందరగా లేస్తే అటు ఆరోగ్యమూ ఇటు ఉల్లాసమూ మన సొంతం అవుతాయి.

- లక్ష్మీప్రియాంక