సబ్ ఫీచర్

ఇస్తినమ్మ వాయనం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల మాంగళ్య సిద్ధిని చేకూర్చే వ్రతం మంగళగౌరీ వ్రతం. వైదిక సంస్కృతిలో భాగంగా పూర్వఋషులు అనుగ్రహించిన వ్రతం ఇది.
ఈ వ్రతాన్ని వివాహమైన నవ వధువులు తొలి సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసంలోని మంగళవారాలలో విధిగా నిర్వర్తించవల్సిన వ్రతం- మంగళగౌరీ వ్రతం. నవ వధువులు ఈ వ్రతాన్ని వరుసగా ఐదు సంవత్సరాలు ఆచరించాలి. ఆ పిమ్మట వ్రత ఉద్యాపనం చేయాలి.
మంగళగౌరీ వ్రతం ఆయా కుటుంబాల ఆచార సంప్రదాయాలననుసరించి నిర్వహిస్తారు. అయితే వ్రత విధానంలో ఎటువంటి వ్యత్యాసం లేదు.
వ్రత విధానంలో ముందుగా గణపతిని పూజించి, ఆ పిమ్మట మండపం ఏర్పాటుచేసి, కలశంలోనికి మంగళగౌరిని ఆహ్వానిస్తారు. షోడశోపచార పూజచేస్తారు. తోరాలనుకట్టి వాటిని కూడా పూజిస్తారు. బియ్యపు పిండిని నేతితో కలిపి ప్రమిదలను ఏర్పాటుచేసి, వాటిలో నేతిలో ముంచిన ప్రతి ఒత్తులనుపెట్టి వెలిగిస్తారు. ఆ జ్యోతులనుండి వెలువడే ధూమాన్ని అట్లకాడతో కథ చెప్పుకుంటూ పడతారు.
వ్రత కథ పూర్తికాగానే గౌరీదేవికి నివేదించిన శనగలతోపాటు, తల్లిముందుంచిన జ్యోతులను, ఫలపుష్ప తాంబూలాదులందిస్తూ, తాను పట్టిన కాటుకను, ముతె్తైదువులకు అందిస్తారు. పూజలో ఉంచిన తోరాలను గౌరీదేవికి ఒకటి కట్టి, తానొకటి దక్షిణ హస్తానికి కట్టుకుని, ముతె్తైదువులకు కూడ ఇచ్చి, వారినుండి ఆశీస్సులు పొందుతారు. ముతె్తైదువలు గౌరీదేవికి ప్రతీకలుగా విశ్వసిస్తారు. ఆ సాయంత్రం పేరంటం చేయడం ఒక వేడుక.
వ్రతం నవ వధువులు ఐదు సంవత్సరాలు నిర్వహిస్తారు. ఏటికేడు జ్యోతుల సంఖ్య, ముతె్తైదువుల సంఖ్య ఐదేసి చొప్పున పెరుగుతాయి. ఆఖరి సంవత్సరంలో 25 జ్యోతులు, అంతే సంఖ్యతో ముతె్తైదువులు ఉంటారు.
మంగళగౌరీ వ్రతం ఉద్యాపన ఎంతో విశేషంగాను, ప్రత్యేకంగాను ఉంటుంది. పెళ్లిపీటలపై కూర్చున్న వధువుకు ఉద్యాపన నిర్వహిస్తారు. పెళ్లిపీటపై ఉన్న పెళ్ళికూతురుకు ఒక కలశంలో మట్టెలు, మంగళసూత్రాలు, నల్లపూసల పేరు, పసుపు, కుంకుమలతోపాటు అరిశలను ఒక పళ్ళెంలో ఉంచి, దానిపై రవికల బట్టతో కప్పి, దానిపై తమ శక్తినిబట్టి చీర, జాకెట్టు బట్టపెట్టి ‘వాయనం’పేరిట ఇవ్వాలి. ఆ పెళ్ళికూతురును మంగళగౌరిగా భావించి, ఆమె పాదాలకు నమస్కరించి అక్షతలు వేయించుకోవడంతో ఉద్యాపనం పూర్తిఅయినట్లు భావిస్తారు.
ఈ వ్రతాన్ని గురించి పురాణాలలో కథలున్నాయి. నైమిశారణ్యంలో సూతుడు శౌనకాదిమునులకు చెప్పగా విన్న నారదుడు సావిత్రికి చెప్పాడట. శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు, త్రిపురాసుర సంహారానికి ముందు శివుడు పార్వతికి చెప్పగా, మంగళాలకు నెలవైన పార్వతి శివుడు విజయాన్ని కాంక్షిస్తూ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినట్లు కథలున్నాయి. మంగళగౌరిని పూజించిన కుజుడు మంగళవారానికి అధిపతి అవడమే కాకుండా, మంగళగౌరిని అర్చించిన వారికి కుజదోషంనుండి విముక్తి కల్పిస్తానని ఆనతి ఇచ్చాడని ఒక కథ.
ప్రధానంగా సుందుడనే రాజు కథ వ్రత కథలలో ఉంది. స్ర్తిల వ్రతకథల పుస్తకంలో చోటుచేసుకుంది. వ్రతం చేసేవారు తమ పెద్దలచే కథ చెప్పించుకోవచ్చు, లేదా కథల పుస్తకంనుండి చదివి వ్రతం పూర్తిచేయవచ్చు.
నవవధువులతోపాటు మహిళలందరూ మంగళగౌరిని శ్రద్ధ్భాక్తులతో పూజించి ఆమె అనుగ్రహం పొందాలని ఆకాంక్ష.

-ఎ.సీతారామారావు