సబ్ ఫీచర్

గుండె పదిలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో హృద్రోగ మరణాలు అధికమవుతున్నాయి. ప్రతి 33 సెకండ్లకు ఒకరు గుండెపోటుతో మృతిచెందుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఏడాదికి రెండు మిలియన్ల మంది గుండెపోటుకు గురవుతున్నారు. యుక్తవయసువారే గుండెపోటుకు గురవ్వటం ఆందోళన కలిగిస్తుందని డాక్టర్ అశ్వనీ మోహతా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో నివశించే మగవారికంటే పట్టణ ప్రాంతాలలో నివశించేవారిలోనే అధిక మంది గుండెపోటుకు గురవుతున్నారు. అలాగే మోనోపాజ్‌దాటిన మహిళల్లో గుండెపోటు వస్తున్నట్లు ఈ అధ్యయనాల్లో వెల్లడైంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్, అలాగే చెడు కొలెస్ట్రాల్ వల్ల ఈ గుండె సంబంధిత జబ్బులు వస్తున్నాయి. మధుమేహం, పొగత్రాగటం, రక్తపోటు, జన్యు సంబంధ సమస్యలు, జీవన ప్రమాణాలు సరిగా పాటించకపోవటం, ఆహారంలో ఎక్కువ కార్భోహైడ్రేట్ పదార్థాలు తీసుకోవటం, ప్రతిరోజూ వ్యాయామం చేయక పోవటం తదితర కారణాల వల్ల గుండెపోటు అధికంగా వస్తోంది. ఛాతిలో నొప్పి వచ్చినపుడు అది యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ మోహతా హెచ్చరిస్తున్నారు. కొద్ది దూరం నడవగానే కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకోవటం తదితర లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు అవకాశాలుగా భావించాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవటం వల్ల గుండెపోటును దూరం చేసుకోవచ్చు. అలాగే
క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, వత్తిడిని
అధిగమించాలంటే నిత్య జీవనయానం పద్ధతులను మార్చుకోవల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు.