సబ్ ఫీచర్

ఎనె్నన్ని పోరాటాలు.. ఎనె్నన్ని త్యాగాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుగంధ ద్రవ్యాల వ్యాపారార్థం 1498లో వాస్కోడగామా కేరళలోని కోజికోడ్‌లో అడుగిడిన సంఘటనతో ఐరోపా వర్తకుల రాకపోకలకు భారత ఉపఖండం స్వాగతం పలికింది. 1757లో ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని శే్వతజాతి సైన్యం బెంగాల్ నవాబుపై విజయం సాధించడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు తెర లేచింది. యుద్ధానంతరం బెంగాల్, బిహార్, ఒడిశా ప్రాంతాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వశమయ్యాయి. 1839లో మహారాజా రంజిత్ సింగ్ మరణానంతరం 1845-46, 1948-49లలో జరిగిన రెండు ఆంగ్ల సిక్కు యుద్ధాల అనంతరం పంజాబ్ కూడా ఆ కంపెనీకి దాసోహమైంది. ఈ కాలంలో బ్రిటిష్ పార్లమెంటు చేసిన 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1784లో ఇండియా చట్టం, 1813 చార్టర్ చట్టం భారత్‌లో ఆంగ్లేయుల అధికారాన్ని సుస్థిర పరిచాయి.
ప్రాచ్యవిద్యను అభ్యసించిన హిందూ విద్యావేత్తలు సతీ సహగమనం, కుల వివక్ష, బాల్య వివాహాల నివారణకు ఉద్యమాలు చేపట్టారు. ఉపఖండంలో తమ అధికారం విస్తరించిన కొద్దీ ఆంగ్లేయులు మన ఆచారాలను హేళన చేయడం, మసీదులలో పార్టీలు చేసుకోవడం, తాజ్‌మహల్ వద్ద సైనిక నృత్యాలను ప్రదర్శించడం, రద్దీదారులలో అడ్డువచ్చిన వారిని కొరడాలతో హింసించడం వంటి దాష్టీకాలు పరిధులు దాటాయి. 1849లో పంజాబ్ ఆక్రమణ తర్వాత చిన్నచిన్న తిరుగుబాట్లు పురుడు పోసుకున్నా, ఆ ఉద్యమాలను అణచివేశారు. సిపాయిల తిరుగుబాటుకు ముఖ్య కారణం పి/53రైఫిల్, 557 కాలిబర్ రైఫిళ్ళలో ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వాడడం, సిపాయిలు వాటిని నోటితో ఒలిచి, రైఫిళ్ళలో నింపాల్సి రావడాన్ని హిందూ, ముస్లిం సిపాయిలు నిరాకరించారు.
1857 మార్చిలో 34వ దేశీయ పదాతిదళానికి చెందిన మంగళ్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జంట్‌పై దాడిచేసి, ఆయన సహాయకుడిని గాయపర్చగా, పాండేను బంధించమని ఆదేశించారు. తిరుగుబాటు దారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిష్ వారికి ఢిల్లీ సమీపాన యుద్ధం జరిగింది. ముందుగా తిరుగుబాటుదారులను ఢిల్లీ వరకు పారద్రోలి, ఆ తర్వాత ఢిల్లీని ఆక్రమించారు. అయితే తిరుగుబాటు దారులు తిరిగి ఢిల్లీని కైవసం చేసుకున్నారు. గ్వాలియర్‌లో జరిగిన ముఖ్య పోరాటంలో రాణీ లక్ష్మీబాయి మృతి చెందింది. నానాసాహెబ్, రావ్ సాహెబ్, తాంతియా తోపే, అజ్ముల్లాఖాన్, కున్వర్‌సింగ్, రాజపుత్ర వీరుడు జగదీష్‌పూర్, అహ్మదుల్లా, మొఘల్ చక్రవర్తి బంధువు ఫిరోజ్ షా, బహదూర్ షా, ప్రాణ్‌సుఖ్ తదితరులు తిరుగుబాటు దారుల్లో ముఖ్యులు. ఈ క్రమంలో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు పరిచి, విక్టోరియా రాణి పరిపాలనకు నాంది పలికారు. ఇక్కడ పరిపాలనకు వైస్రాయ్‌ని నియమించారు. ఇలా భారతావని నేరుగా బ్రిటిష్ పాలన కిందికి రావడంతో భారతీయులకు సమాన హక్కులను కల్పిస్తామని బ్రిటన్ రాణి భరోసా ఇచ్చింది. ఈ కాలంలో అనేక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. అగ్ర వర్ణాల వారికి, జమీందార్లకు పాలనలో చోటు కల్పించారు. మతపర విషయాల్లో జోక్యం నిలిపివేసారు. ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులను చేర్చుకున్నారు. సైన్యంలో బ్రిటష్ వారిని పెంచడం, ఫిరంగులు వాడకం ఆదిగా బ్రిటిషర్లకే పరిమితం చేయడం, బహదూర్ షాను బహిష్కృతుని గావించి బర్మాకు పంపడం ద్వారా మొగలాయి వంశాన్ని కనుమరుగు చేయడం, 1877లో బ్రిటష్ రాణి భారత్‌కు రాణిగా ప్రకటించుకోవడం జరిగిపోయాయి.
1867లో దాదాబాయి నౌరోజి తూర్పు భారత సంఘం, 1867లో సురేంద్రనాథ్ బెనర్జీ భారత జాతీయ సంఘం, అక్టేవియస్ హ్యూమ్ నేతృత్వంలో జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగాయి. ఆర్య, బ్రహ్మ సమాజాలు, జాతీయతా భావనకు పునాదులు వేశాయి. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, అరబిందో, సుబ్రహ్మణ్య భారతి, బంకించంద్ర ఛటర్జీ, సయ్యద్ అహ్మద్‌ఖాన్, ఠాగూర్, నౌరోజి తదితరుల కృషి జాతి పునరుత్తేజం, స్వేచ్ఛల పట్ల భారతీయులను సుముఖుల గావించింది. బాలగంగాధర తిలక్ తొలిసారిగా ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ నినాదాన్ని వినిపించారు. 1899-1905 మధ్య గవర్నర్ జనరల్ కర్జన్ విభజించి పాలించు అనే నినాదానికి అద్దం పట్టేలా బెంగాల్ సంస్థానాన్ని ఢాకా, కలకత్తా రాజధానులుగా రెండు భాగాలు చేశాక బెంగాలీల ఉద్యమాలు ఊపందుకున్నాయి.
గాంధీజీ స్వదేశాగమనం, సత్యాగ్రహం ఆయుధంగా సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, అహింసా ఉద్యమాలు బ్రిటిష్ పాలనను ఇరకాటానికి గురి చేశాయి. 1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలా బాగ్ హింసాకాండ, 1920లో కాంగ్రెస్ పునర్వవస్థీకరణ, 1922లో గాంధీ జైలు జీవితం, యంగ్ ఇండియా పత్రిక నిర్వహణ, 1928లో సైమన్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా ముంబయి అఖిలపక్ష సభ ద్వారా బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమ వ్యాప్తి, 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య సాధనకు పిలుపు, 1930 జనవరి 26న సంపూర్ణ స్వాతంత్య దినంగా పాటించాలన్న నిర్ణయం దేశంలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించాయి.
బ్రిటిష్ వారి సుంకానికి వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా 400 కిలోమీటర్ల మేర దండియాత్ర వంటివి జరిగాయి. 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, బతుకేస్వర్‌దత్‌లు కేంద్రీయ విధాన సభలో బాంబులు వేయడం, 1931లో భగత్‌సింగ్ తదితరులను ఉరితీయడం తదనంతర పరిణామాల్లో 1930-31మధ్య లక్షమంది కారాగార వాసానికి గురైనారు. పెషావర్ కాల్పుల అనంతరం ‘సరిహద్దు గాంధీ’గా అబ్దుల్ గఫార్‌ఖాన్ తెరపైకి వచ్చారు. 1931లో గాంధీ-ఇర్విన్ ఒడంబడిక, కాంగ్రెస్‌పై నిరసనలు, రెండు రౌండ్ టేబుల్స్ సమావేశాలు, 1932లో గాంధీ ఆధ్వర్యంలో సత్యాగ్రహారంభం, 1935లో భారతచట్టంపై అంగీకారం, కాంగ్రెస్ - ముస్లిం లీగ్‌ల మధ్య విబేధాలు, 1937, 39లో రెండు మార్లు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన సుభాష్‌చంద్ర బోస్ పార్టీని వీడి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపన వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1937లో సంస్థానాధీశులకు స్వయం ప్రతిపత్తి, జిన్నా నాయకత్వంలో 1940లో లాహోర్ సమావేశంలో దేశ విభజనకు తీర్మానం, 1940 మార్చి 13న డయ్యర్‌ని లండల్‌లో కాల్చి వేయడం, 1946 ఫిబ్రవరి 18న ముంబయిలో రాయల్ ఇండియన్ నేవీలో 20వేల భారతీయ నావికుల సమ్మె.. ఇలా ఎనె్నన్నో తిరుగుబాట్లు దేశీయుల క్రోధాగ్నికి ఆజ్యం పోశాయి. ఎంతోమంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. 1947 జూన్ 3న గవర్నర్ జనరల్ వౌంట్ బాటన్ బ్రిటిష్ ఇండియాను లౌకిక భారత దేశంగాను, ఇస్లామిక్ పాకిస్తాన్‌గాను విభజిస్తున్నట్లు ప్రకటించారు. తెల్లదొరల పాలన అంతం కావడంతో భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు.

-సంగనభట్ల రామకిష్టయ్య 94405 05494