సబ్ ఫీచర్

అందంగా అ‘ల్లేసు’కునే వస్త్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**మారుతున్న ఫ్యాషన్ ట్రెండుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ వస్త్రాలు యువత కోసం ప్రత్యేకంగా వస్తున్నాయి. అప్పుడు ఇప్పుడూ జాకెట్స్ ఓవర్‌కోట్స్ తరహా లేసు వస్త్రాలు యువతులనే కాదు మహిళలను ఆకర్షిస్తున్నాయి.
------------------
అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్‌లలోసైతం లేస్ హవా కొనసాగుతోంది.
ఈ ట్రెండ్‌ను అనుసరించడానికి ఆసక్తిని చూపుతున్నారు. టిజైనర్లు సంప్రదాయాలలో సమకాలీనత ప్రతిబింబించాలంటే లేస్ బెస్ట్ ఆఫ్షన్ అని చెప్పకనే చెబుతున్నారు.
లేస్ అనేది డెలికేట్ ఫ్యాబ్రిక్. దీన్ని కేవలం కాటన్ దారాలతోనే కాదు సిల్క్, లెనిన్ దారాలతో కూడానేస్తారు. కొన్ని చేతితో నేస్తే కొన్ని మెషీన్ మేడ్ ఉంటాయి. మెషిన్ వాటికి సింథటిక్ ఫైబర్‌ను ఉపయోగిస్తారు.
పార్టీలు, ఫంక్షన్లలో తమదైన ముద్రతో 80వ దశకంలో పాప్‌సింగర్ మడోనా తన షోలకు లేస్ డ్రెస్‌లలో వచ్చి తన ఆట, పాటలతో పాటు కుర్రకారు గుండెలను హీటెక్కించింది. తర్వాత ఈ డ్రెస్‌లను మడోనా డ్రెస్‌లుగా పిలిచారంటే నమ్మాల్సిందే. లేస్ డ్రెస్‌లను ధరించటం అంత సులభం కూడా కాదు. ధరించే లేస్ డ్రెస్‌కు యాక్ససరీస్ సరిగా మ్యాచ్ అయ్యే డ్రెస్ ధరించటం ఎంత ముఖ్యమో అంతే రీతిలో ఫిజికల్ ఫీచర్స్‌కు తగిన రీతిలో ఈ లేస్‌ను ఎంచుకోవడం కూడా ఇంపార్టెంటే. లేస్ డ్రెస్ వేసినప్పుడు ముత్యాలు ధరిస్తే మాత్రం ఇంకాస్త ఎట్రాక్షన్‌గా కనిపిస్తారు.

--తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి