సబ్ ఫీచర్

సనాతన సంస్కృతికి వారసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొని, స్వతంత్ర వీరులలో చైతన్య స్ఫూర్తిని రగిలించిన కారణంగా నాడు ఆంగ్ల ప్రభుత్వం బంధించడానికి ప్రయత్నించినపుడు, ఫ్రెంచివారి భూభాగమైన పుదుచ్చేరి చేరుకున్నారు. మదినిండా భారతజాతి పురోభివృద్ధినీ, భరతమాత దీప్తినీ నింపుకున్నా, అవి అందరికీ తెలియజేయాలన్న ఆకాంక్షతో అరవిందాశ్రమం నుంచి శిష్యులకు, శ్రోతలకు, భక్తులకు ఆధ్యాత్మికపరంగా ఎన్నో సామాజిక, రాజకీయ విషయాలపై ప్రసంగించడమో, రాయడమో జరిగింది. అట్టిదానిలో భరతమాతను గురించి, భారతదేశాన్ని గురించి ఎన్నో విషయాలు ముచ్చటించారు. అవి గ్రంథస్థమై ఉన్నాయి. భారతదేశం గురించి వారి హృదయంలోని స్పందనను తెలియజేసే అంశాలలో కొన్ని-
భరతమాత దివ్య శక్తిస్వరూపిణి
భారతదేశం కేవలం మట్టిగడ్డ కాదు, ఆమె దేవత. శక్తిస్వరూపిణి. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆ దేశం దివ్యత్వం కలిగి ఉంటుంది. తమ ఉనికి కోసం ఆయా దేశస్థులు శ్రమపడుతున్నారు. అలా అవి తమ వ్యక్తిగత చేతనాశక్తితో సాధ్యమవుతుంది. ఆశ్రమ జీవులు తమ దేశం యొక్క ఉనికికి తామే కారణమన్న భ్రమలో ఉన్నారు. కాని ఆ ఉనికిగల కారణం వెనుక ఒక బలీయమైన శక్తి ఉందని గుర్తించరు. కాని భారతీయులు ఆ విధంగా తమ దేశం గురించి భావించరు. భగవంతుడే సర్వదా అతి సమర్థవంతమైనదిగా ఒక దేశమును తన కొరకై నిర్మించుకొనుచున్నారు. ఆ దేశమే భారతదేశము. ఒకప్పుడు ఈ దేశము మాయచే ఆవరింపబడియున్నది. భగవంతుని సంకల్పానుసారం మేఘము వంటి మాయ తొలగగా జ్ఞానశక్తి దేశముపై ఆవరించినది. ఆ శక్తి ప్రతి కార్యాన్నీ రూపొందిస్తూ పనిచేస్తూన్నది.
ఆధ్యాత్మిక భావనాశక్తి భారతమాత
భారతమాత శక్తి స్వరూపము అపూర్వమైనది. ఇది సజీవమైన భావనాశక్తి. ఆధ్యాత్మికమైనది. ప్రపంచ దేశాలలో అగ్రగ్రామియై నిలుచుటకు ఆమె సౌశీల్యము ఆమె యొక్క అద్భుతమైన శక్తి. అత్యంత రహస్యమైన ఆమెయందు గల నిగ్రహశక్తి అమోఘమైన శక్తి. ఈ శక్తి కారణంగానే భారతదేశం ఎన్నో ఆటుపోట్లకు తట్టుకోగలిగింది. ఆయా నాగరికతల ప్రభావానికి ఎదురొడ్డగలిగింది. తనయందు ఆధ్యాత్మిక శక్తి సంపన్నత కారణంగా జాతిలో ఐక్యతను నిలుపగలిగింది.
భారతీయులు సనాతన సంస్కృతికి వారసులు
పరమ పావనమైన గంగాది జీవనదులవలె సనాతన సంస్కృతి ఈ దేశంలో ప్రవహిస్తున్నది. ఆ సంస్కృతికి వారసులు భారతీయులు. నాడు ఆత్మబలంతో, భక్త్భివంతో కాలుణ్ణి అనుసరించి భర్తను పొందిన సావిత్రి, పాతివ్రత్యమే దివ్యత్వమని ఎంచి పరమత ద్వేషులను ఎదిరించి సహగమనాలకు సిద్ధమైన పరమ సాధ్వీమణులకు వారసులం. ఆధ్యాత్మిక శక్తితో ఎంతటి భౌతిక శక్తినైనను ధిక్కరించగల సమర్థులం. ప్రతిరోజూ సూర్యోదయం ఎంతటి తథ్యమో, భారతదేశ శక్తి కూడా అంతే తథ్యము. మేఘముచే ఆవరించబడిన సూర్యప్రకాశము, ఆ మేఘము తొలగినంతనే ఎంతగా ప్రకాశించునో, భారత శక్తి ద్విగుణీకృతమై పునఃప్రకాశించుట అంతే యదార్థము.
భారతభూమి సనాతన (శాశ్వత)మైనది. ఈ దేశము, ప్రజలు, మతము అన్నీ సనాతనములే. ఉత్థాన పతనములు ఎప్పుడూ సహజం. ఈ దేశానికి పతనమంటూ లేదు. అవి మేఘముచే ఆవరింపబడిన సూర్యునివలె తాత్కాలికమైనవే పతన దిశలు. అన్ని రంగాలలో అద్భుత ఫలాలను అందించిన భూమి భరతభూమి. లెక్కకు మిక్కిలిగా దృష్టాంతాలున్నాయి.
హిందూమతము - భారత జ్యోతి
మన సనాతన ధర్మమే హిందూమతము. ఇది ఈనాడు పేర్కొంటున్న ఇతర మతలవంటిది కాదు. ఈ సనాతన ధర్మము సజీవనమైది. స్వార్థరహితమైనది. ఇతర మతాలపై యుద్ధం చేయసంకల్పించలేదు. పైగా ఆయా మతాలలోని మంచిని గ్రహించడానికి వెనుకాడదు. హిందూమతం దివ్యజ్యోతి, నిత్యజ్యోతి, భారతజ్యోతి. ఈ ధర్మజ్యోతిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిది.
సనాతన ధర్మజ్యోతి యొక్క ప్రకాశము శక్తివంతమైనదనియు, పూర్ణత్వము కలిగినదనియు తెలియజేయాలంటే మన సంస్కృతీ రూపములకు నూతన ఆకారములనిచ్చి రక్షించుకోవాలి. ఎందువల్లనంటే, ఈ సంస్కృతి ఒక కాలంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసింది. జ్ఞానాన్ని అందించింది. ఆధ్యాత్మిక తత్త్వాన్ని అనుగ్రహించింది.
భారతీయ సంస్కృతీ ప్రభావం
నేడు ప్రపంచం సంక్షోభితమై ఉంది. భారతీయ సంస్కృతీ ప్రభావము, భారతీయ కేంద్ర లక్ష్యము, తదున్నత భావములు, తమ సందేశమును ఒక్క భారతీయులకే కాక సకల మానవులకు అందించుచునే యున్నది. ఇది భారతీయ జీవన సంకల్పం.

- ఎ. సీతారామారావు