సబ్ ఫీచర్

సర్దుబాటుతోనే సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంపతుల మధ్య అవగాహన లేకపోతే చికాకులే కాదు విడాకులు దగ్గరవుతాయి. పెళ్లి అయిన కొత్తల్లో ఒక నెల రెండు నెలలు బాగున్నట్టు కనిపించినా తర్వాత తర్వాత ఒకరి లోపాలు మరొకరికి ఎక్కువగా కనిపిస్తాయి. విడాకులు అనేవి ఇంతకుముందు విదేశీ సంస్కృతి మనది కాదు అనుకొనేవారు. కానీ నేడు మన దగ్గర ఒంటరి పేరంట్స్ తయారు అవుతున్నారు. దీనికి ఎన్నో కారణాలుండవచ్చు. కానీ పిల్లలు అమ్మనాన్న ఇద్దరి దగ్గరా పెరిగితే వారు ఆత్మవిశ్వాసంతో, మేము ఏదైనా చేయగలమన్న ఆత్మసంతృప్తితో ఉంటారు. కాని కేవలం ఒక్క అమ్మ దగ్గరనో లేక నాన్న దగ్గరనో పెరిగితే మాత్రం వారిలో ఆత్మనూన్యత ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు వారిలో ఎవరైనా ఏదైనా అంటారన్న భావం ఒకవైపు, మరోవైపు సమాజంలో మంచివాళ్లు లేరన్న అపోహలు కలుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లల ఎదుగుదల లో ఇట్లాంటి లోపాలు వస్తే తల్లిదండ్రులదే కదా బాధ్యత. అందుకే పిల్లలు పుట్టకముందు ఏవైనా దంపతుల మధ్య పొరపొచ్చాలు వస్తే ఎవరికివారు వారికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ బిడ్డలు పుట్టాక మాత్రం నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. నిర్ణయాల ప్రభావం పిల్లలపై ఏవిధంగా ఉంటుందన్న దానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
భార్యాభర్తలిద్దరూ కలసి కూర్చుని వారి సమస్యలను పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలి. అసలు ఇగోల వల్ల చాలా సమస్యలు వస్తాయి. తల్లిదండ్రులయ్యాక నేను గొప్ప అనే విషయం వదిలిపెట్టాలి. మీవాళ్లు ఇలాంటి వాళ్లు అనేదీ వదిలేయ్యాలి. ఎవరు ఎలాంటి వాళ్లు అయినా మీరిద్దరూ మాత్రం పుట్టిన బిడ్డ తల్లిదండ్రులన్న విషయమే పెద్దదిగా తీసుకోవాలి. మీరిద్దరూ ఎలా ఉంటే మీరిద్దరూ బిడ్డను ఎలా పెంచితే వాళ్లు అలా పెరుగుతారు. దేశానికి పట్టుగొమ్మలా పెంచాలా లేక దేశానికి చెదపురుగుగా పెంచాలా అన్నదాని మీద దృష్టిపెట్టాలి. నీతి, సత్యం, ధర్మం, త్యాగం, దానం ఇలాంటి వాటి గురించి చిన్నప్పటి నుంచి పిల్లలకు అవగాహన కలిగిస్తే వారు రేపొద్దున దేశోద్దారకులు అవుతారు. వేర్వేరు కుటుంబాల్లో పెరిగి దాంపత్య బంధంతో ఒకటయ్యాక కొన్ని అసంతృప్తులు ఉండనే ఉంటాయి. వాటిని సర్దుబాటు చేసుకోవాలి కానీ నీ వల్లనే అనే మాటలు రానీవ్వకూడదు. నువ్వెంత అని సవాలును విసరకూడదు. ఏ సమస్యకైనా శాంతియుత పరిష్కారానే్న చూడాలి. మీ త్యాగం, మీ సర్దుబాటు రేపటి తరానికి మంచి ఔషధాలుగా పనికి వస్తాయి. రేపటితరం మిమ్ములను ఆదర్శవంతులుగా కీర్తిస్తారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దంపతులు వ్యవహరించాలి. దాంపత్య బంధం నూరేళ్లు సాగేలా ఇద్దరూ మెలగాలి.

- లక్ష్మీప్రియాంక