సబ్ ఫీచర్

మీ గురించి మీకు తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడైనా మీ గురించి అభిప్రాయాన్ని మీరు ఏర్పరుచుకున్నారా? లేకుంటే ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అవునా అని సందేహాస్పదంగా ముఖం పెట్టారా?
మిమ్ముల్ను మీరు నమ్ముతారా? అంటే మీరు ఏ పని అప్పగించినా నేను చేసేయగలను అనుకోగలరా? లేక ఏమో ఎక్కడో ఏలానో అని క్వశ్చిన్స్ వేసుకొంటారా? జీవితంలో అనుకోనిది జరిగినప్పుడు దాని గురించే బాధపడుతూ మరో పని చేయకుండా సమయాన్ని గడుపుతారా ?
ఆ బాధను పక్కన పెట్టేసి ఇప్పుడు చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తారా ?
వదంతులు ఎవరైనా చెబుతుంటే మీరు వూ కొడుతున్నారా? లేక మీరు కూడా దానికి మరో ముక్క కలిపి వేరేవారికి చెబుతున్నారా?
ఎందుకంటే ముందుకెళ్లాలనుకొన్నవారు పక్కవారి గురించి అసలు పట్టించుకోరు వదంతుల ను నమ్మరు, ప్రచారం చేయరు. ఏదైనా అనుభవపూర్వకంగా తెలుసుకొంటారు.
ఉన్న స్థితి నుంచి పై స్థితికి ఎలా వెళ్లగలం అని ఆలోచిస్తున్నారా లేకుంటే పక్కవాళ్లు ఏం చేస్తున్నారా, వాళ్లు ఎలా సంపాదిస్తున్నారు అంటూ ఆరాలు తీసే మనస్తత్వం పెంచుకుంటున్నారా?
మీరు పక్కవాళ్ల సలహాలు తీసుకోవడానికి చూస్తున్నారా. ఉచిత సలహా కనుక అందరూ సలహాలు అడగకపోయినా ఇవ్వడానికి ముందే ఉంటారు. అవసరమైతేనే సలహా తీసుకోండి. ఇతరుల జోక్యం అనవసరం అనుకొంటే వాళ్లు నొవ్వకుండా మెల్లగా తప్పుకోండి. తప్పించండి.
ఏపని చేసినపుడైనా అపజయం పాలైతే దాన్నుంచి ఏదైనా నేర్చుకుంటున్నారా లేక అయ్యో ఇలా అయపోయంది ఇక ఎపుడు దీన్ని చేయకూడదు అనే నిర్ణయానికి వస్తున్నారా?
కార్యసాధకులు ఎన్ని సార్లు అపజయం ఎదురైనా మరలా చేసి విజయం సాధించేదాకా నిద్ర పోరట, ఓటమి నుంచి పాఠాలు నేయ్చికుంటాం అంటారు వారు. మరి మీరు అలా అనుకొంటు న్నారా లేదా?
ఏ పని గురించి అయినా మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా ఓపెన్ గా చెప్పండి. నచ్చినదాన్ని నచ్చనట్లు చెబుతూ ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా చెప్పాలి. ఇలా ఏదైనా డొంక తిరుగుడు లేకుండా నేరుగా ఏం చెప్పదల్చుకున్నామో అది చెప్పేస్తే ఎదుటివారికి సందేహం లేకుండా ఉంటుంది. చెప్పేవారికి హాయిగా ఉంటుంది.
మరి మీరు ఇలానే ప్రవర్తిస్తున్నారా లేదా మీకు మీరే ఆలోచించుకుని మీ పనులను ఒక్కసారి సరిచూసుకోండి, ఏమనుకొంటున్నాము, ఏమి చేస్తున్నాము అంటే చేతల్లో ఏది చూపిస్తున్నామో సరి చూసుకోండి.

- మాగంటి రాధిక