సబ్ ఫీచర్

బలిదానానికి మారుపేరు బక్రీద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగలలో ముఖ్యమైనది బక్రీద్ పండగ. త్యాగానికీ, బలిదానానికీ ప్రతీకయైన బక్రీద్ పండగను ప్రతి సంవత్సరం జిల్‌హజ్‌మాసంలో జరుపుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. ఏటా జిల్‌మాసం (హిజ్రి క్యాలెండర్ ప్రకారం) 9వరోజు హజ్ (కాబా ప్రదక్షిణం), మరుసటిరోజున అనగా 10వనాడు బక్రీద్ (ఈద్-ఉల్-జుహా)ను, ముస్లింలు జరుపుకోవడం సాంప్రదాయంగా అచరణలో ఉంది.
ఇబ్రహీం త్యాగమయ జీవితాన్ని ఆదర్శంగాగొని, మనిషిలోనున్న త్యాగ భావాన్ని సజీవంగా ఉంచేందుకు ఈపండగను భక్త్భివంతో జరుపుకుంటారు. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సం విగ్రహారాధకుడైన అజర్ ఇంటిలో జన్మించాడు. అజర్ విగ్రహాలను తయారు చేసేవాడు మరియు పురోహితుడు కూడా. బాల్యంనుండీ ఇబ్రహీం ఎల్లప్పుడూ సృష్టికర్తయైన అల్లాహ్ గురించే ఆలోచించేవాడు. దైవసందేశాన్ని అందజేయడంలో భాగంగా, ఇబ్రహీం ఇరాక్‌ను వదిలి సిరియా, పాలస్తీనా, ఈజిప్టు మొదలైన ప్రాంతాలలో పర్యటించాడు. ఈసందర్భంగా ఆయనను అల్లాహ్ కఠిన పరీక్షకు గురిచేశారు.
తన అర్ధాంగియైన హజీరా మరియు కుమారుడైన హజ్రత్ ఇస్మాయిల్‌ను త్రాగునీరుకూడా కరువైన భయంకర నిర్జన ఎడారి ప్రాంతంలో వదిలి పెట్టి, ప్రజలకు దైవ సందేశాన్ని అందజేస్తూ దార్మిక ప్రచార కార్యక్రమాలలో నిమగ్నమైపోవాలని అళ్లాహ్ ఆదేశిస్తారు. అల్లాహ్ ఆఙ్ఞను శిరసావహించి, ఆయనే తన కుటుంబాన్ని రక్షించగలరనే పరిపూర్ణ విశ్వాసంతో, భార్యా పిల్లలను వదిలి దైవకార్యార్థం వెళతాడు.
ఒకరోజు రాత్రి హజ్రత్ ఇబ్రహీం నిద్రలోఉండగా, లేకలేక కలిగిన తన ఏకైక కుమారుడైన ఇస్మాయిల్‌ను తన స్వహస్తాలతో బలి ఇస్తున్నట్లు కలకంటాడు. దానిని అల్లాహ్ ఆఙ్ఞగా భావించి, కుమారునితో ప్రస్తావించిగా అందులకై ఇస్మాయిల్ సంతోషంగా అంగీకరిస్తాడు. బలి ఇవ్వడానికై సర్వంసిద్ధమై, ఇస్మాయిల్‌ను పడుకోబెట్టి ఖండించబోగా, వారి భక్తికి మెచ్చిన అల్లాహ్, ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రెనుంచి వారి త్యాగాన్ని స్వీకరిస్తారు. ఇదే సాంప్రదాయాచరణ ప్రకారం ప్రతి సంవత్సరం ముస్లింలు త్యాగానికి ప్రతీకగా, ఇబ్రహీం త్యాగాన్ని ఆదర్శంగాగొని, బక్రీద్‌నాడు గొర్రెపిల్లను బలి ఇవ్వడం జరుగుతున్నది.
మనిషిలోని త్యాగభావాన్ని సజీవంగా ఉంచేందుకు, తమకిష్టమైన వస్తువును త్యాగం చేయాలనే అల్లాహ్ ఆదేశానుసారం, ఏటా పండగ సందర్భంగా గొర్రెను బలి ఇవ్వడం ఆచారంగా మారింది. ఖుర్బానీ గురించి దివ్య ఖురాన్ అనుసారం ...హృదయాలలో ఉండే త్యాగ భావం, భయభక్తులు మాత్రమే అల్లాహ్ సన్నిధికి చేరుతాయి. ఖుర్బానీ పశువుల రక్తమాంసాలు చేరవు. అలాగే కుర్బానీ ఇచ్చే సమయంలో...దీన ప్రాణాలు సర్వం అల్లాహ్‌వే, ఇంకా సమయం వచ్చినపుడు అల్లాహ్ ఒప్పందం కోసం, ప్రేమకోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తామని విశ్వాసాన్ని దృఢ పరుచుకుంటారు. ముస్లిం సోదరులు జీవితంలో కనీసం ఒకసారి హజ్ యాత్ర చేయడం, ఫర్జ్(విధి)గా నిర్ణయించబడింది.
యాత్ర చేయగలవారు, కాబాదాకా వెళ్ళగలిగే స్తోమత గలవారు ఆయన గృహానికి వెళ్ళి హజ్ చేస్తారు. దీనిని దాసులపై ఆయనకున్న హక్కుగా భావిస్తారు. త్యాగానికి, ప్రతీకయైన బక్రీద్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకుని, ఖుర్బాన్‌ను మూడు భాగాలుగా చేసి, ఇంటివారు, బంధువులతోపాటు మూడవ భాగాన్ని పేదలకు పంచి పెడతారు.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494