సబ్ ఫీచర్

మహరాణులు మీరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో విజయం సాధించచటం అంటే, అంతులేని ధనరాశులు కూడబెట్టడం విలాసవంతమైన భవనాలు నిర్మించడమే అంటారు కొందరు. అట్లా అని వాటిని మాత్రమే సాధిస్తే అది ఘనవిజయంకాదు. మరికొందరు చిత్రకళలు సంగీతం, నాట్యం వంటి నిర్ణీత క్షేత్రాల్లోశ్రమించి జీవితాలను అందంగా తీర్చిదిద్దుకుంటూ ఇవే విజయం సాధించడం అంటే అంటారు. ఇది నిజమే కావచ్చు. కానీ అందరికీ ఇది వర్తించదు. కొందరికీ కొన్ని కళలు జన్మతః వస్తాయ. మరికొందరు ఇష్టంగా నేర్చుకుంటారు. భారతీయంలో 64 కళలున్నాయని చెబుతారు. ఈ 64 కళలూ మనిషికి పనికి వచ్చేవే. ఇవి అంతో ఇంతో అందరికీ వచ్చినవే. కాకపోతే కొందరు కొన్ని కళల్లో రాణిస్తారు. వారికన్నా ఇంకెవరూ మెరుగ్గా చేయలేరు అన్న ఖ్యాతినీ ఆర్జిస్తారు. ఇథి మంచిదే కానీ ఇదొక్కటే సాధించి నేను గొప్ప విజయాన్ని సాధించేశాను అంటే అది తప్పులో కాలేసినట్టే.
మనసు తృప్తితో ఏ పని చేసినా ఆ పని అఖండ సంతృప్తి కలిగిస్తుంది. కానీ జీవితానికి అవసరమైన అన్ని పనులను సమాన పాళ్లల్లో చేయాల్సిందే. కాకపోతే కొన్ని పనులు నాణ్యంగా చేయవచ్చు. ఏ పని చేసినా ఆ పని తాలూకూ ఫలితం జీవితం అంతా మాధుర్యంగా పల్లవించాలి. అదే జీవితానికి అర్థం, పరమార్థం. సాఫల్యమకుటం. సాధారణంగా ఎన్ని ఐహిక సంపదలున్నా ఆ ఆనందంతో సరితూగలేవు.
ఏపనికైనా సంతృప్తి అవసరం. తృప్తి లేని మనిషి ఏడు ద్వీపాలు దాటినా ఇంకా వ్యధ చెందుతుంటాడు అంటారు. అట్లాకాక పూరిగుడిసెలో నిరంతరంకష్టపడుతూ కూడా ఆనందంగా జీవించే వారు ఉంటారు. వారి దగ్గర ఉన్నదానితో తృప్తి పడే అలవాటు ఉంటుంది. ఆశావహ దృక్పథమూ ఉంటుంది. అసలు జీవితంలో దేనినైనా సాధిస్తాం అనే ఆలోచన ఉండాలి. సాధించిన దానితో తృప్తి పడే మనసూ ఉండాలి. అపుడే మనిషి శారీరికంగా మానసికంగా ఎదుగుతుంటాడు.
ఇది మహిళల్లోనూ ఉండాల్సిన లక్షణమే. ఎదుటివారికి ఉంది మనకు లేదు అనుకొనే మహిళలది వెనుకంజే.ఎవరికో ఉందనే లక్ష్యంతో కాక మనకు అవసరమైనదేదో గుర్తించి దానికోసం శ్రమించాలి. అపుడు తృప్తి ఉంటుంది. దానితో అనుకొన్నది సాధించడానికి అవసరమైన శక్తి వస్తుంది. విజయం వచ్చిందన్న ఆనందమూ కలుగుతుంది.
ఆర్థిక స్థితి మెరుగుపడినకొద్దీ సుఖ సంతోషాలు పెరుగుతాయని భరోసా లేదు. భద్రత అన్నది ఎండమావి. డబ్బువల్ల హంసతూలికా తల్పం కొనవచ్చు కాని నిద్రను కొనలేం. అట్లానే పుస్తకాలు కొనవచ్చు కాని ప్రజ్ఞా ప్రాభవం బజార్లో దొరికే వస్తువు కాదు. ఆహారం కోకొల్లలుగా కొనవచ్చు కాని ఆకలిని కొనలేం. అందమైన వస్తువులు ఎన్నైనా కొనవచ్చు. కాని సౌందర్యం ధనరాశులకు అందదు.ఇట్లా దేనికైనా కొంత పరిమితి ఉంటుంది.
అందుకే మనిషి మాత్రం సంస్కారం అలవర్చుకోవాలి. పెద్దలను గౌరవించడం, పిన్నలను ఆదరించడం నేర్చుకోవాలి. నలుగురితో కలసిమెలసి ఉండాలి. నలుగురూ కావాలనుకోవాలి. ఉన్నదానితో తృప్తి పడాలి. తన దగ్గర ఉన్నదాన్ని నలుగురికీ పంచే సహనం అలవర్చుకోవాలి. నాకు అది ఉంది ఇది ఉంది నేను ఏదైనా చేయగలను, అన్నింటిలోను నేనే ముందుంటాను అని వూరికే గొప్పలు చెప్పుకోకూడదు. అమ్మకు అన్నం పెట్టి సామాజిక సేవ చేస్తున్నాను అన్నట్టు పనులు చేయకూడదు. బాధ్యతగా ఇంట్లో మనుష్యుల కోసం ఎంత చేస్తారో అట్లానే సమాజం కోసం కూడా కొన్ని బాధ్యతలను భుజానికెత్తుకోవాలి. అపుడే మీరు విజయం సాధించిన వారు అవుతారు. సొంత లాభం కొంతమానుకు పొరుగువానికి సాయపడ వోయ్ అన్న పెద్దలమాట అనుసరించి నట్టే అవుతుంది. దీనిని పిల్లలకు నేర్పించడం లోనూ, మగవారి చేత చేయంచడం లోను కూడా మహిళలదే ప్రధాన పాత్ర అవుతుంది. ఇవన్నీ చేస్తారు కనుకనే మహిళలూ మహరాణులన్నారు. కనుక ప్రతి మహిళా మహరాణిగా వెలుగొందాలి అంటే తన పనితోపాటుతన కుటుంబం దానితోపాటు సమాజ సేవ కూడా చేయడానికి అన్ని వేళలా ముందుండాలి.

--చివుకుల రామమోహన్