సబ్ ఫీచర్

కర్మలతోనే జన్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శూద్రస్ర్తికి జన్మించమని శాపం పొందిన నాకు ఇదే కాక ఇంకా అనేక జన్మలున్నాయి. వాటిని గురించి చెబుతాను వినండి.
అసలు నేను బ్రహ్మపుత్రుడను. బ్రహ్మ తొడనుండి పుట్టినవాడను. నేను సదా భగవంతుని నామాన్ని జపిస్తూ ఉంటేవాడిని. నాకు చేతనైనంతలో పరులకు ఉపకారం చేస్తూ ఉండేవాడిని. ఎవరైనా ఆపదలల్లో ఉన్నారంటే వారి దగ్గరకు వెళ్లి వారికి మంచిమార్గాన్ని చూపిస్తుంటాను. ఒకసారి నేను ప్రాచీన బర్హి దగ్గరకు వెళ్లాను. అప్పుడు ఆయన కర్మలను చేస్తూ కోర్కెలను జయించాలనుకొనేవాడు. కర్మలను ఆచరించినపుడు శ్రేయస్సు కలుగుతుందనుకొని యజ్ఞయాగాదులను చేస్తూ ఉండేవాడు. కానీ ప్రాచీన బర్హికి ఆనందం కలుగడం లేదని విచారించేవాడు.
ఆ సమయంలోనే నేను (నారదుడు) అక్కడికి వెళ్లడం తటస్థించింది. ప్రాచీనబర్హి ఏవిధంగా శ్రేయస్సు కలుగుతుందని నన్ను అడిగాడు. అపుడు ‘రాజా! ఏ శ్రేయస్సు కాంక్షించి నీవు ఈ కర్మలను చేస్తున్నావో అవి అన్నీ నిన్ను జన్మపరంపరలో ఇరుక్కునేట్టు చేస్తాయి. కానీ నీవు ఆశించే శ్రేయస్సును కలుగచేయవు.’ అని అంటే ప్రాచీన బర్హి ‘మహానుభావా ! నారదా! నేను సంసార సాగరంలో ఈదులాడుతూ ఇక్కడ లభ్యమయ్యే సుఖాలే ధనధాన్యాలు, భార్యాపుత్రాదులే పురుషార్థాలుగా గ్రహించాను. దానివల్లే నాకు జ్ఞానం నశించింది. కనుక నాకు నిర్మలమైన జ్ఞానాన్ని బోధించి నన్ను కర్మబంధం నుంచి విముక్తిని చేయండి’ అని వేడుకున్నాడు.
అదిగో అపుడే నేను పురంజనుని గూర్చి ప్రాచీన బర్హికి చెప్పాను. దానే్న మీకు కూడా చెబుతాను వినండి.
పురంజనుడు అనేవాడు ఒక రాజు. ఇతనికి ఒక విజాతుడు అనే స్నేహితుడుండేవాడు. పురంజనుడికి ఒకరోజు లోకంలోని అన్ని సుఖాలను అనుభవించాలన్న తలంపు కలిగింది. వెంటనే లోకంలో ఉంటే అన్నిప్రదేశాలకు వెళ్లాడు. అక్కడ అందమైన భవనాలు, ఉద్యానవనాలెన్నింటినో చూశాడు. కానీ అతనికి మాత్రం సుఖం పొందానన్న తృప్తి కలుగలేదు. ఇట్లా తిరుగుతూనే ఓరోజు హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి దక్షిణ సానువుల్లో ఒక పురం ఉంది.
ఆ పురానికి తొమ్మిది ద్వారాలున్నాయి. ఆ తొమ్మిది ద్వారాల్లో అనేక గుమ్మాలు, కిటీలు, బయటి ద్వారం, కోటగోడలు, పెద్ద పెద్ద వీథులు, బంగారు, వెండి, ఇనుము లాంటి వాటితో చేసిన శిఖరాలున్న గోపురాలు, రకరకాలు విరగ కాసిన పూలు నిండిన ఉద్యానవనాలు, కొలువు కూటములు, చతుష్పాథాలు, జెండా స్తంభాలు, జూద గృహాలు, రచ్చబండలు, అంగళ్లు కనిపించాయి. ఒక్కో భవనం తలెత్తి చూసి అచ్చెరువు వొందేట్టుగా కొత్తముత్యాలు, పచ్చలు, కెంపులు, మణులు, మాణిక్యాలు లాంటి వాటితో ఆ భవనానికి తాపడం చేసి ఉన్నారు. ఆ పురానికి పురంజనుడు వెళ్లాడు.
ఆ పురానికి దగ్గరగా వెళ్లిన పురంజనునికి అందమైన సెలయేళ్లు కనిపించాయి. ఆ ప్రదేశమంతా చక్కని పూలదోటలు, పండ్లతోటలు అలరారుతున్నాయి. నెమ్మదిగా ప్రవహించే నదులు ఓ ప్రక్కన ఉత్తుంగ తరంగాలను పోలిన సెలయేళ్లు మరో ప్రక్కన కంటికింపును కలుగ చేస్తున్నాయి. ఆ ప్రకృతిని చూస్తూ వెళ్తున్న పురంజనునికి ఒక అందమైన యువతి కనిపించింది. ఆమె చుట్టూ వందలమంది యోధులున్నారు. వారంతా నూరుమందికి నాయకులవలె సమూహాలను కలిగి ఉన్నారు. వీరు కాకుండా ఆమెను సదా కాపాడుతూ ఐదు తలల నాగుబామున్నది.
ఆమె గజగమన వలె నడుస్తూ వస్తుంటే ఆమె కన్నుల కాంతి తామరలను పోలి ఉంది. ఆమె కురుల అందం తుమ్మెదలతో పోటీ పడుతున్నట్టు ఉంది. ఆమె ధరించిన వస్త్రాలు మేలిమి బంగారు వనె్నతో నొప్పారుతున్నాయి. ఆమె కామరూపిణి. వరుని కోసం వెదుకుతున్నట్టుగా ముందుకు రావడం పురంజనుడు చూశాడు.

- డా. రాయసం లక్ష్మి. 9703344804