సబ్ ఫీచర్

‘కాసు’తో కొత్తకొత్తగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరలక్ష్మీవ్రతం వచ్చేసింది.. మహిళలు లక్ష్మీరూపులను కొని పూజలో పెట్టడం ఆనవాయితీ.. కొన్ని ప్రాంతాల్లో వీటిని లక్ష్మి కాసులు అంటారు. పూజలయ్యాక ఈ కాసుల్ని నల్లపూసలు లేదా మంగళ సూత్రాల్లో వేసుకుంటారు. కానీ ప్రతి సంవత్సరం కొన్న కాసులను మంగళసూత్రాల్లో వేసుకోలేరు కాబట్టి వాటిని మార్చి కొత్తనగలను కొంటూ ఉంటారు కొందరు. అలాకాకుండా ముందస్తు ప్రణాళిక వేసుకుని ప్రతి సంవత్సరం ఒకే సైజులో కాసులను కొని.. వాటికి నేటి ఫ్యాషన్‌ను జతచేస్తే అదిరిపోయే నగలు మన సొంతమైపోతాయి. కాసుతో ఏ నగలు చేయించినా అందంగా ఉంటాయి. ఇక కాసులపేరు సంగతి అందరికీ తెలిసిందే.. పెళ్లిలో పెళ్లికూతురుకు ఈ నగ అలంకరిస్తే ఆ అందమే వేరు. అందుకే చాలామంది అమ్మాయి పెళ్లి అనగానే కాసులపేరును చేయిస్తారు. లేదా అమ్మమ్మ కాసులపేరు అమ్మాయికి వచ్చేస్తుంది. ఇలాంటివాటి మీదికి మ్యాచింగ్‌గా కాసులతో నగలు చేయించుకోవాలంటే పూజలో ఉంచిన కాసులను కమ్మలుగా, గాజులుగా చేయించుకోవచ్చు. లేదా ఈ కాసుల చుట్టూ సీజెడ్స్, కెంపులు, పచ్చలు, ముత్యాలు వంటివాటిని లతలూ, పూలుగా అమరిస్తే అద్భుతమైన నగలుగా మారిపోతాయి. ఇంకాస్త డబ్బులున్నవారు కాసుల చుట్టూ ఆన్‌కట్స్, డైమండ్స్‌ని పొదిగి కళ్లు చెదిరే డిజైన్లను తయారుచేస్తున్నారు. ఇవి వేసుకున్న అమ్మాయి అందంగానూ, సాంప్రదాయంగానూ కనిపిస్తుందని వేరే చెప్పాలా!?