సబ్ ఫీచర్

భేదభావం నశిస్తే జీవన్ముక్తుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మ విచారణవల్ల మాత్రమే ‘అహంత లేక మనస్సు’ అనేది అసలు లేనేలేదనే సత్యం తెలుస్తుంది. దాని ద్వారానే శుద్ధ నిర్విశేష పరమాత్మ తత్త్వము లేక, బ్రహ్మము సాక్షాత్కరిస్తుంది. ఆత్మయే బ్రహ్మానంద స్వరూపం, సర్వమును అదే అయివున్నది. అట్టి సాక్షాత్కారము పొందినవాడికి, యికపొందవలసినదేదియును లేదు. ఆత్మానందము ఎప్పుడూ మనని అంటిపెట్టుకునే వుంది. శ్రద్ధతో కూడిన నిరంతర అంతర్ముఖత్వ సాధనతో దానిని కనుగొనవచ్చు.
దుఃఖానికి కారణం బయట లేదు. అది అహంత రూపంలో లోపలే వుంది. మనకు పరిమితులు విధించుకొని, ఆశలు, కోర్కెలు పెంచుకుని, వాటిని అధిగమించడానికి, నెరవేర్చుకోవడానికి, నిరర్థకంగా పెనుగులాడుతున్నాము, కష్టపడుతున్నాము, దుఃఖిస్తున్నాము. ‘అహంత లేక మనస్సే’ వీటన్నిటికి కారణం. ఆ విధంగా దుఃఖానికి కారణం లోపల నుండగా ఆ కారణాన్ని జీవితంలోని సంభవాలకు, సంఘటనలకు ఆపాదించడంవల్ల ఏమి ప్రయోజనముంటుంది. అన్యమైన విషయాలవల్ల ఏమి ఆనందం లభిస్తుంది. ఒకవేళ లభిస్తే మాత్రం ఆ ఆనందమెంత కాలముంటుంది. కాబట్టి ‘అహంత’ను ఉపేక్షించి, త్రోసివేసి, ఎండగడితే ముక్తుడవవుతావు. బంధు విముక్తడవవుతావు. అట్లుకాక ‘అహంత’కు లొంగి, దాని చెప్పు చేతలలో ఉండి అది ఆడించినట్లు ఆడుతుంటే, అది మనకు పరిమితులు విధించి, వాటిని అధిగమించేందుకు చేసే వృథా ప్రయత్నాలు, పెనుగులాటలోకి మనను పడత్రోస్తుంది. కాబట్టి సర్వదా నీవే అయివున్న ఆనందాన్ని పొందేందుకు ఒకే ఒక దారి, నీవు నిజంగా ఏదైతే అయి వున్నావలో, ఆ ‘ఆత్మ’గా ఉండడమేనని భగవాన్ శ్రీ రమణుల ఉవాచ.
కఠోపనిషత్తులో నచికేతుడడిగిన మూడవ ప్రశ్నకు (ఆత్మతత్త్వమును వివరించమని) యమధర్మరాజు చెప్పిన సమాధానము కొంత పరిశీలిద్దాం!
నజాయతే మ్రియతేవా విపశ్చి
న్నాయంతుతర్చిన్న బభూన కశ్చిత్
అజోనిత్యః శార్వతోయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే
అర్థం: జ్ఞాత అయిన ఆత్మ పుట్టదు, చావదు. అది దేని నుండియు పరిణమించదు. దాని నుండి కూడా ఏదీ పరిణామం చెందదు. శరీరం నశిస్తున్నపుడు కూడా జన్మరహితము అనశ్వరము, శాశ్వతము, సనాతనము అయిన ఆత్మకు నాశనమనేది లేనే లేదు.
హంతాచేన్మన్యతే హంతుం హతశే్చన్మన్యతే హతమ్
ఉభౌతౌన విజానీతొనాయం, హంతిన హన్యతే!
అర్థం:చంపేవాడు, తాను చంపుతున్నానని, చంపబడేవాడు తాను చంపబడుతున్నానని భావిస్తే ఆ యిరువురికి దాని (ఆత్మ) గురించి సరిగా తెలియదన్నమాట. నిజానికి అది చంపదు, చావదు.
అణోరణీయా మహతోమహీయా
నాత్మా స్వజంతోర్నిహితం గుహోయామ్
తవక్రతుః పశ్యతి వీతశోకో
ధాతు ప్రసాదాన్మ, హిమానమాత్మనః
అర్థం:సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుకంటె చిన్నది. బ్రహ్మాండమున కంటె ఘనమైదియగు ఆత్మ ప్రాంల హృదయాలలోనే వన్నది. కామనారహితుడు శోక రహితుడునై ఇంద్రియాలు, మనస్సుల యొక్క పవిత్రత ద్వారా, ఆత్మసాక్షాత్కారము పొందుతాడు.
ఆసీనోదూరం వ్రజతి, శయానోయాతి సర్వతః
కస్తంమదామదం, దేవ మదన్యో జ్ఞాతు మర్హతి
అర్థం: కదలకుండా కూర్చునే ఉన్నా ఆత్మయెంతో దూరం ప్రయాణించగలదు. పడుకునే ఉన్నా సకల ప్రదేశాలకూ పోతాడు. ఆనందమయుడూ, ఆనంద రహితుడును అయిన ఆ జ్యోతిర్మయుని, నేను తప్ప యింకెవరు తెలుసుకోగలరు? అంటాడు యమధర్మరాజు.
శ్లో॥ అశరీరం శరీరేష్య నవస్థేష్యవస్థితమ్‌
మహాంతం విభుమాత్మానం మాత్వాధరో నశోచతి॥ (శ్లో 22)
అర్థం:- శరీర రహితుడు, సర్వవ్యాప్తి అయిన పరమాత్మను, అన్ని శరీరాలలోను ఉన్నాడని తెలుసుకున్న ప్రజ్ఞావంతుడు, శోకం నుండి విముక్తుడౌతాడు.
శ్లో॥ నాయమాత్మా ప్రవచనేన లభ్య
నమేధయాన బహునా శ్రుతేన
యమేవైష వృణుతే తేనలభ్య
హస్తస్వైష ఆత్మావివృణుతే తనూంస్వామ్‌॥ (శ్లో 23)
అర్థం:- వేదాధ్యయనం వల్ల గాని, బుద్ధి కుశలత చేతగాని, గొప్ప పాండిత్యం వల్లగాని, ఆత్మను తెలిసికొనలేదు. అది ఎవరిని ఎన్నుకుంటుందో, అనుగ్రహిస్తుందో, అట్టి వాని ఆత్మయే, తన నిజ స్వరూపాన్ని వెల్లడిస్తుంది.
శ్లో॥ నావిరతో దుశ్చరితాన్నాశాంతోనా సమాహితః
నా శాంతమానసోవాపి ప్రజ్ఞానేనైన మాప్నుయాత్‌॥
అర్థం:- చెడు ప్రవర్తన నుండి, ఇంద్రియలౌల్యము నుండి బయటపడలేని వారు ధ్యానపరులు కాని వారు, ప్రశాంత చిత్తం లేని వారు, జ్ఞానం చేత కూడ ఆత్మ సాక్షాత్కారం పొందలేరు.
శ్లో॥ యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభేభవత ఓదనః
మృత్యుర్యస్యో పసేచనంక ఇత్థా వేదయత్రసః॥
అర్థం:- పూర్తిగా శరీర బుద్ధిగల అజ్ఞాని, పరమమైన ఏకైక సత్తను గురించి ఎలా తెలుసుకోగలడు. అట్టి సత్త (ఆత్మ)లో జాతి, మతాది బేధాలతో పాటు, దాని భావనలో మృత్యువు కూడ నశిస్తున్నది కదా!
జీవ బ్రహ్మ బేధ భావము నశింప చేసుకున్నవాడే జీవన్ముక్తుడు. ఈ ప్రపంచంలో సత్యార్యాచరణ చేయడం చిత్తశుద్ధికే కాని, ఆత్మను తెలుసుకొనుటకు కాదు. ఆత్మజ్ఞానం కేవలం విచారం రిచేతనే దొరుకును. వివేకవంతుడు, శమ, దమాది గుణములు కలవాడే, బ్రహ్మ విచారానికి తగినవాడు.
సాధన చతుష్టం అనగా
1. సత్యాసత్య వస్తు వివేకం.
2. ఇహలోక ఫల భోగ విరాగము
3. శమ దమాది షట్క సంపత్తి
4. ముముక్షత్వం
కలవానికే బ్రహ్మనిష్ట కలుగును. ‘‘అహం’’ మూలానే్వషణయే సర్వార్థ సాధకము.
ఆత్మ కాని వానియందు, ఆత్మను భావించుటే బంధమని ‘వివేక చూడామణి’ చెబుతున్నది. తన నిజ స్వరూపాన్ని తెలుసుకొనుటయే నిజమైన భక్తిగా పెద్దలు చెబుతారు. మోక్షం కొరకు చేసే ప్రయత్నంలో, భక్తిది ప్రముఖ స్థానంగా చెప్పబడింది. మందు పేరు చెప్పినంత మాత్రాన, వ్యాధి ఎట్లు తగ్గదో, అట్లే ‘‘అహం బ్రహ్మాస్మి’’ అనే వేద వాక్యాన్ని చెప్పినంత మాత్రాన ఆత్మజ్ఞానం కలుగదు. అలాగే ఆత్మతత్త్వాన్ని, తన స్వీయానుభవంతోనే తెలుసుకోవాలి కానీ, ‘బ్రహ్మైవాహం’ అనే వాక్యంతో ముక్తిని పొందలేదు. శరీరమే తానన్న భ్రాంతిలో నుండి, శరీర పోషణే ధ్యేయంగా పెట్టుకున్నవాడు ‘‘ఆత్మ’’ హత్య చేసుకున్నవాడు అవుతున్నాడు. శరీరంపైగల మోహమే మృత్యువు. ‘‘నేను’’అనే స్ఫురణలో రెండు భాగములు ఇమిడ యున్నాయి. మొదటిది కర్తృత్వమైతే, రెండవది మనస్సు యొక్క ప్రసరణము లేక మనోవృత్తియై యున్నది. ‘‘మనయేవ మనుష్యాణామ్ బంధ, మోక్షకారకః’’ అని చెప్పుటచే మనిషి యొక్క బంధ మోక్షములకు మనసే కారణమగుచున్నది.

ప్రతులకు

7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079

-డా. గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ సెల్: 9490947590