సబ్ ఫీచర్

సర్వాభీష్టప్రదాయని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదునెనిమిది చేతులలో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం కమలము, ధనస్సు, కలశము, దండం, శక్తి, ఖడ్గము, డాలు, శంఖము, ఘంట, మద్య పాత్రము, శూలం, పాశం, సుదఠ్శన చ్రకము, ధరించి ప్రవాళమణి వర్ణంతో తామరపూవుపై చిరునవ్వుతూ పలకరించే స్ర్తి మూర్తియే మహాలక్ష్మి. ఆ తల్లినే ‘‘విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్య్రనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రీయం..’’ అంటూ వరలక్ష్మిదేవికి ఇష్టమైన తామరపూలు, సన్నజాజులు, తెల్లని పూలు, తెల్లగనే్నరు, చామంతులతో వరాలనిచ్చే తల్లిని పూజిస్తారు. శ్రావణ శుక్రవారంనాడు వారి వారి ఇంటి ఆచారాన్ని బట్టి కొందరు కొబ్బరికాయకు కళ్లు, ముక్కు, చెవులు పెట్టి కలశం మీద ఉంచి ఆభరణాలను, వస్త్రాదులను అలంకరించి వరలక్ష్మిగా పూజిస్తారు. తోరపు పూజచేసి తోరాన్ని వరలక్ష్మీ దేవికి కట్టి పూజ చేస్తారు. అలాగే పూజ చేసేవారు కూడా తోరాన్ని ధరించి పూజచేస్తారు. మరికొంతమంది బ్రాహ్మణుని చేత పూజచేయంచుకుంటారు. ఇలా పూజ చేయంచిన బ్రాహ్మణుడికి వాయనంతో పాటుగా దక్షిణలిచ్చి నమస్కరిస్తారు. సాయంత్రం ముత్తెదువులను పిలిచి తాంబూలాలను, నానబెట్టిన శనగలను ఇస్తారు. పసుపు కుంకుమలు పంచుకుంటారు. ఏమీ కోరకుండానే వారి మనోవాంఛలన్నీ వరలక్ష్మిదేవి ఈడేరుస్తుందని భక్తుల నమ్మకం. ధన, ధాన్య, ధైర్య, శౌర్య, సిద్ధి, సంతుష్టి, పుష్టి, విజయ, విద్యా, సంతాన ఆయురారో గ్యాదులను ప్రసాదించే ‘‘నిత్యానపాయిని’ అని విష్ణుపురాణం కీర్తించినా, ‘‘హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ’’ అని పురుషసూక్తం అన్నా. ఆ తల్లి కరుణావల్లి శ్రీమహాలక్ష్మినే. ఈ తల్లిని స్మరించి పూజించిన వారికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సంపదలు ఒనగూడుతా యని వరలక్ష్మీవ్రతం చెబుతుంది.

- నాగలక్ష్మి