సబ్ ఫీచర్

ఒత్తిడిని తగ్గిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి జీవన గమనంలో ఒత్తిడి అనేది అత్యంత సహజం. దీన్ని ఎదుర్కోవడానికి చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. కానీ చిన్న చిన్న చిట్కాల ద్వారా ఒత్తిడిని చిత్తు చేయచ్చు. అదెలాగో చూద్దాం!
* ఒత్తిడిని ఎదుర్కోవడానికి ముందుగా చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. అవి చిన్నవిగా, స్పష్టంగా, ప్రయోజనకరంగా ఉండాలి. వీటికి సమయపాలన, పరిమితి, ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి. ఒకేసారి అన్ని అంశాలపై దృష్టి పెట్టడం కుదరదు కాబట్టి ఒక్కో విషయాన్ని పరిష్కరించుకుంటూ లక్ష్యంవైపు దూసుకుపోవాలి. అప్పుడు ఒత్తిడికి గురికావాల్సిన అవసరం ఉండదు.
* కొంతమంది చిన్నచిన్న సవాళ్ళను సైతం భూతద్దంలో చూసుకుంటూ అనవసర ఆందోళనకు గురవుతుంటారు. ఉన్న వాస్తవం కంటే ఎక్కువుగా అంటే నెగిటివ్‌గా ఆలోచిస్తుంటారు. దీనివల్ల ఒత్తిడి పెరిగిపోయి పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారవుతుంది. ఇలా అనిపించినప్పుడు వ్యతిరేక ఆలోచనలను పక్కదారి పట్టించేలా మనసును ఇతర విషయాలపై వైపు మళ్లించాలి. చిన్న విషయాలను పెద్దది చేసుకునే ఆలోచనలకు స్వస్తిచెప్పాలి.
* ఉద్యోగం, వృత్తి నిర్వహణల్లో ఒత్తిడి అధికంగా అనిపించినప్పుడు దాని ప్రభావం వ్యక్తిగత జీవితంపై పడుతుంటుంది. కారణం ఎమోషన్లు తారుమారు కావడమే. ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఎమోషన్లను కంట్రోల్లో ఉంచుకోవాలి. పదేపదే దాని గురించే ఆలోచించడం వల్ల కూడా ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకని అటువంటి సమయాల్లో ఆహ్లాదంగా నవ్వడానికి జోక్స్ చదవడమో, కామెడీ సీన్స్ చూడటమో చేయాలి.
* ఒత్తిడిని ఎదుర్కోవడానికి మంచి మార్గం సామాజిక మద్దతు. తమకు నచ్చిన, తాము మెచ్చినవారితో మాట్లాడటం వల్ల దాదాపు అరవై శాతం మంది ప్రజలు ఒత్తిడికి తక్కువగా లోనవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబ వ్యక్తులు, ఇష్టమైనవారు ఒత్తిడిని తగ్గించడంలో సహాయంగా ఉంటారు. కాబట్టి ఆందోళనలన్నింటినీ బుర్రలోనే ఉంచుకోకుండా వాటి భారాన్ని నచ్చినవారితో చెప్పుకోవడం వల్ల తేలిగ్గా అనిపిస్తుంది.
* అసలు విషయం ఏంటంటే ఒత్తిడిని తగ్గించుకోవడానికి సంపూర్ణ ఆరోగ్యం అవసరం. ఎందుకంటే శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంటే కార్టిసోలో అనే హార్మోను విడుదల అవుతుంది. ఇది విడుదల కావాలంటే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. దైనందిన వ్యాయామాలు చేయాలి. ఫలితంగా యాంగ్జయిటీని తగ్గించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, లో ఫ్యాట్ చీజ్, బాదంపప్పులను ఆహారంలో భాగం చేయాలి. విటమిన్లు శరీరాన్ని శక్తివంతం చేసి ఒత్తిడిని ఎదుర్కోగల శక్తిని అందిస్తాయి.
* అలాగే పాదాలను రోలింగ్ పిన్‌పై కదిలించడం వల్ల టెన్షన్ పోతుంది. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగి హార్ట్‌రేట్ నెమ్మదిస్తుంది. అలాగే ధ్యానం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.
* ప్రతి ఒక్కరూ ఒత్తిడిపై దృష్టి పెట్టకుండా తమలోని బలాలను నమ్మాలి. తమపై తాము పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. తమలోని శక్తిస్థాయిలను తరచూ గుర్తుచేసుకుంటూ వాటిపై ఫోకస్ పెడుతూండాలి. ఏ చిన్న సమస్యకూ కుంగిపోకూడదు అనుకుంటూ తమకు తాము సర్దిచెప్పుకోగలగాలి.
* సన్నిహితులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకూ తమ సమస్యలను చెప్పడం వల్ల ఒత్తిడి కొంత తగ్గుతుంది.
* పరిస్థితికానీ, సమస్యకానీ ఎప్పడూ రాత్రికి రాత్రి మారిపోదు. మనిషి ఆత్మవిశ్వాసంతో ఉన్నంత వరకూ ఎటువంటి ఒత్తిడైనా సరే చిత్తయిపోతుంది. ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కరించుకోవడానికి అవసరమైన శక్తిని ఆత్మవిశ్వాసం అందిస్తుంది. ఫలితంగా మనిషి ఒత్తిడికి ఎప్పుడూ లొంగకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు.
*