సబ్ ఫీచర్

శరీరాకృతికి చక్కని ఆసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్జాలాసనం ఆసనం పిల్లి చేసే చేష్టలను పోలి ఉంటుంది కనుక మార్జాలాసనం అన్నారు.
స్ర్తిలకు ప్రసవం తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు, శరీరాకృతికి సంబంధించిన సమస్యలు మామూలుగా వస్తుంటాయి. ఈ మార్జాలాసనం చేయడం వల్ల స్ర్తిలు గర్భం ధరించకముందు ఉన్న శరీరాకృతిని తిరిగి తమ సొంతం చేసుకోవచ్చు. రుతుసంబంధ సమస్యలు కూడా దూరమవుతాయి. నడుము కండరాలు శక్తివంతం అవుతాయి. నడుము నొప్పితో బాధపడేవారు కూడా ఈ ఆసనాన్ని వేస్తూ ఉంటే నడుమునొప్పి తగ్గిపోతుంది. అజీర్తి, మలబద్ధకం సమస్యలు తగ్గిముఖం పడుతాయి. వెనె్నముక సరళతరం అవుతుంది. భుజాలు, మోచేతులు, మణికట్టు శక్తిమంతం అవుతాయి. ఇన్ని లాభాలున్న ఈ ఆసనం ఎలా చేయాలో తెలుసుకుందాం.
మార్జాలాసనం వేసే పద్ధతి
* రెండు చేతులను గడ్డం కింద ఉంచుకుని బోర్లాపడుకుని విశ్రాంతి స్థితిలో ఉండాలి.
* రెండు అరచేతులను నేలమీద ఉంచుతూనే మోకాళ్ల మీద లేవాలి. ఈ స్థితులో చేతులు అంటే మోచేతులు వంచకుండా నిటారుగా ఉంచాలి.
* ఈ స్థితిలో శ్వాస తీసకొంటూ వీపును కిందకు వంచి తలను పైకెత్తాలి. తర్వాత శ్వాస వదులుతూ వీపును పైకి లేపుతూ తలను కిందకు వంచాలి. ఇలా రోజు క్రమం తప్పకుండా చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ ఆసనం వేసిన తరువాత బోర్లాకాసేపు పడుకుని ఆ తరువాత మీ పనులను ఆరంభించండి.
మరి మార్జాలాసనం చేద్దామా...
ఒక్క విషయం మోకాళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటే ఈ ఆసనం వేయకూడదు. స్ఫాండిలోసిన్ ఉన్నవాళ్లు ఈ ఆసనం జోలికి రాకండి. అధిక బరువుతో బాధపడేవారు మీ వైద్యుని సంప్రదించిన తరువాత మాత్రమే ఆసనాలు వేయడానికి తయారు కండి.

- ప్రసూన