సబ్ ఫీచర్

అనారోగ్య సంకేతాలు గోర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోర్లను చూసి మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేయచ్చు. గోర్లు లేత ఎరుపురంగులో మిలమిలలాడుతుంటే వారి ఆరోగ్యం గురించి అంతగా ఆలోచించక్కర్లేదు. కానీ గోర్లు పసుపురంగులోకి మారడమో లేక నల్లగా మారడమో జరుగుతుంటే మాత్రం గోర్లను గురించి ఆలోచించాల్సిందే.
రంగు మారిన గోర్లు తిరిగి కోలుకోవడానికి నాలుగు నుంచి తొమ్మిది నెలలు పడుతుంది.
అసలీ గోర్లు ఇలా ఎందుకు మారుతాయి అని చూస్తే అతిగా గోర్లకు రంగు వేసుకోవడం, వేసుకొన్న రంగును చాలా రోజుల వరకు ఆ రంగును, గోరును పట్టించుకోక పోవడం , ఒక్కోసారి ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా గోర్ల రంగు మారుతుంది. గోరు రంగు మారుతున్నట్టు అనిపించగానే డాక్టరు ను సంప్రదించడం మంచిది.
నిపుణులు గోర్ల్లకు ఎప్పుడూ ముదురు రంగు నెయిల్ పెయింట్ వేసుకోకపోవడమే మంచిదంటారు. శరీరాన్ని పరిశుభ్రపరుచుకుంటున్నట్టుగానే గోర్లను కూడా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాల్సిందే. ఎస్‌ఫీఎఫ్30 ఉన్న హ్యాండ్ క్రీమ్ ను రాసుకొంటే బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ అంతగా సోకదు. గోర్ల రంగులో ఉండే రసాయనాలు గోర్ల్లకే కాక గోర్ల చుట్టూ ఉండే చర్మానికీ కూడా హాని చేస్తాయి.
అంతేకాక టాల్యూన్ ఫార్మాల్డీహైడ్, ఎసిటోన్ పారాబెంజ్ వంటి రసాయనాలు చర్మానికి హాని చేయడం కాక ఇతర వ్యాధులు రాకపోవడానికి కారణం అవుతున్నాయి. ఈ గోర్ల రంగు లో ఉండే హానికారక రసాయనాల వల్ల తలనొప్పి, వాంతులు కలిగిస్తాయి. రంగులో ఉండే వాసన వల్ల కూడా వికారం కలుగుతుంది. గోర్లల్లోని తేమను తగ్గిపోతుంది. ఈ రంగు ప్రభావం వేసుకొన్న వెంటనే కాక కొన్ని గంటల తరువాత బయటపడే అవకాశం ఉంది. కనుక గోర్ల రంగు వల్ల ఈ అనారోగ్యం కాదేమో అన్న అనుమానం తో దీన్ని పట్టించుకోకుండా ఉండడమూ జరుగుతుంటుంది. అంతేకాదు టిపీహెచ్ అనే రసాయనం వల్ల ప్యూబర్టీ రావడం, హార్మోన్ల అసమతుల్యత సంతాన సాఫల్యలేమి ఇలాంటి సమస్యలు తలెత్తు అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయని నిపుణులు అంటున్నారు.
కనుక మంచి బ్రాండ్ రంగును వేసుకోవడమో లేక అసలు రంగును వేసుకోకుండా ఉండడమో చేయాలి. ఒకవేళ రంగు వేసుకొన్నా ఎప్పటికప్పుడు గోర్ల రంగును పరీక్షించుకుంటూ ఉండాలి. గోర్ల ఆరోగ్యానికి పనికి వచ్చే ఆహారాన్ని కూడా తీసుకోవడం మంచిది.
క్యూటికల్స్‌కి మాయిశ్చరైజర్ , సహజ నూనెలు వాడుకోవడం, మానిక్యూర్ పెడిక్యూర్ వంటివి చేసుకోవడం, గోర్లను కత్తిరించుకోవడంలో జాగ్రత్తలు తాజాపండ్లు కూరగాయలు తీసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

- వాణి ప్రభాకరి