సబ్ ఫీచర్

అప్రమత్తతే రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడపిల్లలు అర్ధరాత్రి నిర్భయంగా నడిచిన రోజే నిజమైన స్వాతంత్య్రం అని గాంధీజీ అన్నారు కానీ నేడు కనీసం పట్టపగలు నడవడం కాదు బైక్ మీద పోతున్నా, లేక క్యాబ్‌లో వెళ్తున్నా నిర్భయం అన్నది లేదు.
ఇవి ఇంట్లో నే కూర్చుని కాలం గడిపే రోజులు కావు. తప్పనిసరిగా ఉద్యోగాలు చేయాలి. లేదా ఇంకేదైనా వ్యాపకం పెట్టుకుని ముందుకెళ్లే రోజులు. కనుక ఆడపిల్ల అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాల్లేకుండా ఎప్పుడైనా ఎక్కడికైనా ఒంటరి ప్రయాణాలు చేయాల్సిందే. కానీ ఎక్కడైనా అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతాయేమోనన్న భయం వెంటాడుతూనే ఉంటుంది. ఆఖరికి గుడికి వెళ్లినా ఈ అనుమానం రాకుండా ఉండనివ్వడం లేదు నేటి నాగరికత.. మనుష్యులు...
కనుక ఆడపిల్లలే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మందుకెళ్లడం ఎందుకైనా మంచిది. అట్లాంటి జాగ్రత్తలను కొన్నింటిని చూద్దాం.
* రోడ్డు పైన నడిచి వెళ్తున్నా... టూవీలర్ పై వెళ్తున్నా సరే తొందరగా వెళ్లొచ్చు అనే దానిలో షార్ట్‌కట్ రూట్ ఎంచుకోకండి. దూరమైనా నలుగురు తిరిగే ప్రదేశాల్లోనే వెళ్లడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి.
* బండి నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకండి. అట్లానే రోడ్‌పై నడిచి వెళ్తునప్పుడు కూడా ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్లారంటే ఫోన్ విషయంలో పడి రోడ్ పైన ఏం జరుగుతుందో కూడా గమనించడం మర్చిపోవడం తటస్థిస్తుంది. కనుక ఫోన్ మాట్లాడడం చేయకండి. ఒకవేళ మరీ అవసరమైతే రోడ్‌ను గమనించండి. మీ చుట్టుపక్కల వాళ్లు ఎలా ఉన్నారో కూడా చూడండి. మీ దరిదాపులన్నీ సక్రమంగా ఉంటున్నాయో లేదో చూడండి.
* ఆటోలు, క్యాబ్‌లు బుక్ చేసుకోకుండా రోడ్డుపైన నడుస్తున్నప్పు జాగ్రత్తగా ఉండాలి. ఆటో ఎక్కుతున్నప్పుడు డ్రైవర్ మద్యం సేవనంలో ఉన్నాడా లేదా అన్నది ముందు చూసుకోండి. ఆ తరువాత మనిషి మామూలుగా మాట్లాడుతున్నాడా లేదా.. కళ్లను, చేతలను చూస్తే మనిషిని కొంత వరకు అంచనా వేయవచ్చు. తప్పకుండా ఆటోనెంబర్‌ను రాసుకోండి. దాన్ని మీ ఇంట్లోవారికి పంపించండి.
* ఇంట్లో ఎక్కడికి వెళ్తున్నారో, ఎంత సమయం అక్కడ ఉంటారో, లేదా ఎవరితో కలసి వెళ్తున్నారో అట్లాంటి విషయాలను కూడా ఇంట్లో వాళ్లతో చెప్పి వెళ్లండి.
* వాహనంలో ప్రయాణించేటపుడు కూడా ఇంట్లోవాళ్లతో అప్పుడప్పుడు ఫలానా రూట్‌లో వెళ్తున్నట్టు వారికి చెప్పండి.
* అతిముఖ్యమైనంది బ్యాగులో చాకు, పెప్పర్‌స్ప్రే లాంటి రక్షణాయుధాలను తప్పక తీసుకొని వెళ్లండి. ధైర్యంగా అడుగు వేయండి. కానీ చుట్టుపక్కల వారిని గమనించండి.
కాన్ఫిడెన్స్‌తో వెళితే ఏ భయమూ వేయదు. ఒకవేళ దుండగులు ఎవరైనా ఎదురైతే పోలీసులు ఏర్పాటు చేసిన షీటీమ్స్ కు లేక ఇంట్లో వారికో కాల్ చేయండి. దుండగలు చూసి భయపడకుండా వీలైనంతగా వారిని ఎదిరించండి. వాళ్లు భయపడతారు. మీ అప్రమత్తతే మిమ్మల్ని అన్నివేళలా కాపాడుతుంది.

-జి.కల్యాణి