సబ్ ఫీచర్

ఆత్మ సాక్షాత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందు ‘‘కర్తృత్వము చేతనమై యుండగా, మనోవృత్తి జడమని చెప్పబడుచున్నది. మనకు కలిగే ఆలోచనలను, భావాలను, ఊహలను అరికట్టి ‘‘నేను’’ యొక్క మూలమును నిశ్చలత్వముతో పరికించినచో, లేక గమనించుచూ ఉండినచో కొంత కాలమునకు ‘‘మనోవృత్తి’’ లయమును పొంది, ‘‘నేను’’ అనునది శుద్ధ చైతన్యముగా భాసించును. అట్టి శుద్ధ చేతనమయిన ‘‘నేను’’ అను స్ఫూర్తియే ‘‘ఆత్మ’’శుద్ధముగా నున్న ‘‘నేను’’ను దర్శించుటయే ‘‘ఆత్మ సాక్షాత్కారము.’’
‘‘సదానంద పూర్ణా, స్వాత్మైవ, పరదేవతా లలితా’’ సదా పరబ్రహ్మానందంతో నిండియుండే మన ఆత్మయే పరదేవతయగు శ్రీ లలితాదేవి. స్వాత్మయే లలితయని భావనోపనిషత్తు చెబుతోంది.
5. మన శరీరము- ప్రాణశక్తి
పరాశక్తి యొక్క సంకల్పముచే పంచభూతములు సృష్టించబడినవి. అవి క్రమముగా ముందు ఆకాశము, అందుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఆవిర్భవించాయి. ఈ పంచభూత తత్వాలనుండి సూర్య, చంద్ర, నక్షత్రాదులు, తోక చుక్కలు, పాలపుంతలు ఏర్పడ్డాయి. ఈ పంచతత్వాల అభివ్యక్తీకరణలో, వాట ద్రవ్య పదార్థము సూక్ష్మ స్థితి నుండి, స్థూల స్థితికి మారుతూ వచ్చింది. పృధ్వీ తత్వంలో సంభవిస్తున్న చైతన్య పరిణామక్రమంలో, ఖనిజ, వృక్ష, జంతు, మానవ శరీరములుగా విస్తరిస్తూ వుంది.
ఆకాశము ఏ విధముగా సకల సృష్టి నిర్మాణానికి మూలమైనదో, అదే విధముగా ప్రాణము కూడ విశ్వవ్యాప్తమై సృజన శక్తిరూపమై నిరంతరము విశ్వవ్యాప్తికి ఆధారమగుచున్నది. అన్ని శక్తులు ప్రాణము నుండియే వెలువడుచున్నవి. ప్రాణము లేకపోతే ఏ శక్తిలేదు. చలన రూపము కలిగిన ప్రాణశక్తి ఆకర్షణ మరియు గురుత్వాకర్షణ శక్తులుగా కూడ వ్యక్తమగుచున్నది. మన శరీరము నుండి ప్రాణశక్తి (శివం) బయటకు పోయిందంటే మిగిలేది శవమే కదా! అది యెందుకూ పనికిరాదు.
ఈ ప్రాణిశక్తికే సూత్రాత్మయని మరొక పేరు. లోక వ్యాపార రూపంగా దైనందిన జీవన ప్రక్రియకు ఆధార భూతముగా పరిణతి చెందేది ప్రాణశక్తియే. మనసు కూడా ప్రాణశక్తి యొక్క అభివ్యక్త రూపమే స్వయంగా ఏ పనిచేయని ఆత్మ, తన సంకల్ప సాన్నిధ్యములచేత ప్రాణశక్తిని కార్యోన్ముఖం చేయడం గమనించ వలసిన విషయం.
ప్రాణశక్తి మన శరీరంలో ప్రధానంగా పది రకాలుగా వున్నది. అవి పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, (తరువాత పుటలలో వివరించబడింది) ఈ పది ప్రాణములు పనిచేయడానికి మూలమైనది ‘‘ఆత్మ’’ పదకొండవది. ఈ పదకొండు కలిసి ఏకాదశ రుద్రులు వాల్ళు మన శరీరంలోనే ఉన్నారు. అందుకే ‘‘ప్రాణావావరుద్రాః’’ అని చెప్పబడింది.
కృష్ణ యజుర్వేద మందలి ‘‘శారీరకోపనిషత్’’ మానవ శరీరము గురించిట్లు వివరిస్తోంది. మన శరీరం పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములచే నేర్పడియున్నది. ఇందు కఠినముగా నుండు భాగము పృథ్వి ద్రువ రూపములో నుండేది జలం, శరీరమందు వేడి అగ్నికి సంకేతము, శరీరమంతటా సంచరించునది వాయువు, ద్వారం కలిగినది ఆకాశం. మన జ్ఞానేంద్రియాలలో చెవి ఆకాశ శబ్దమునకు, చర్మము వాయువు (స్పర్శ) తత్వంగా, నాలుక జల తత్వంగా, కళ్లు అగ్ని (తేజం) అంశగా ముక్కు పృథ్వీ (గంథ) తత్వంగా వున్నాయి. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలకు పంచభూత తన్మాత్రలుగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధములను చెప్పారు. ఇక పంచ కర్మేంద్రియాలైన నోరు (వాక్కు) కాళ్ళు, చేతులు, గుదము, ఉపస్థ అనునవి మాట్లాడటం, నడవడం, ఇవ్వడం, మలమూత్ర విసర్జన చేయడం, సుఖాన్ని పొందటమనేవి వీటి క్రియలు. ఇవి కూడా పైన చెప్పిన పంచ భూతములనుండే ఆవిర్భవించాయి. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అను నాలుగింటిని అంతఃకరణ చతుష్టయమంటారు. చతుష్టయంలో సంకల్ప వికృతములు కలిగినది మనసు. నిశ్చయ నిర్ణయాత్మకమైనది బుద్ధి. స్వాభిమాన రూపం కలిగినది అహంకారం.
అవధాఱణ గుణం కలిగినది చిత్తము. ఈ అంతఃకరణ చతుష్టయ నివాస స్థానముల్లిట్లున్నవి. మనసు నివసించే స్థానం కంఠం, బుద్ధియొక్క నివాసం వాక్కు అహంకారము యొక్క నివాసం హృదయము, చిత్తము యొక్క నివాస స్థానం నాభి (బొడ్డు) అని చెప్పారు. ఇక మన శరీరంలోని ఎముకలు, చర్మం, వెంట్రుకలు, నరాలు, మాంసము, పృథ్వీ తత్వానికి చెందినవి. రక్తము, వీర్యము, మూత్రము, కఫము, చెమట జలత్వానికి చెందినవి. ఆకలి, దప్పిక, మోహము, మైథునము, సోమరితనము, అగ్నితత్వములు; నడవటం, గీరటం, కళ్ళు మూయడం తెరవడం లాంటివి ఆకాశానికి వాయువుకు చెందిన అంశాలు; తన్మాత్రలైన శబ్ద, స్పర్శ రూప, రస, గంథములు అయిదూ పృథ్వికి చెందిన గుణాలు; శబ్ద, స్పర్శ, రూప, రసములు నాలుగూ జలానికి చెందిన గుణాలు; శబ్ద,స్పర్శ వాయు గుణములు కాగా శబ్ద మొక్కటి ఆకాశగుణంగా వున్నాయి. మనలోసత్వ, రజః తమో గుణములను పేర మూడు గుణాలుంటాయి.
(ఇంకావుంది)

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590