సబ్ ఫీచర్

వానల్లో.. మరింత ట్రెండీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానాకాలం మొదలైంది. ఈ సమయంలో ట్రెండీగా కనిపించాలంటే మార్పులు తప్పనిసరి. కాలంతో పాటు దుస్తులు, వాటి ట్రెండ్స్ మారుస్తారుగా మన ఫ్యాషన్ గర్ల్స్. అవేంటో చూద్దాం..
వానాకాలంలో బరువైన జీన్స్, పట్టుచీరలు, చుడీలు, లేయర్డ్ దుస్తులు, టై అండ్ డై, హ్యాండ్ పెయింటింగ్ దుస్తులు, బాందినీ, బ్రొకేడ్ దుస్తుల జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే తడిసినప్పుడు ఇవి పాడవుతాయి. వాటి లుక్ కూడా మారిపోతుంది. కాబట్టి వానాకాలంలో ఇలాంటి దుస్తులకు దూరంగా ఉండాలి. పెళ్లిళ్లకో, ఫంక్షన్లకో అవసరమైతే తప్ప ఇలాంటివాటి జోలికి వెళ్లకూడదు. వానలో తడిసినా త్వరగా ఆరిపోయే దుస్తులకే ఈ కాలంలో ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే నేటితరానికి ఫ్యాషన్ ట్రెండ్‌తో పాటు సౌకర్యం కూడా ప్రధానమే.. అందుకే తడిసినప్పుడు దుస్తులు ఒంటికి అతుక్కుని ఉండకుండా ఉండేవాటిని ఎంచుకోవాలి. లేకపోతే కొద్దిగా తడిసినా అసౌకర్యంగా అనిపిస్తుంది. పైగా చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి త్వరగా ఆరిపోయేవి, ఒంటికి అంటుకోకుండా ఉండే దుస్తులను ఈ కాలం ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. ఈ కాలంలో కంటికి ఇంపుగా కనిపించే కాంతివంతమైన రంగుల్ని ఎంచుకుంటే చాలా బాగుంటుంది. ఎరుపు, పసుపు, కాషాయం, ఆకుపచ్చ, నలుపు, నీలం వంటివి చాలా బాగుంటాయి. సహజ ప్రింట్లు, పోల్కాడాట్స్ వంటివి ఈ కాలానికి నప్పుతాయి. అలాగే త్రెడ్ వర్క్ చినుకుల కాలానికి సరైన ఎంపిక. వానాకాలంలో నేలను తాకే ఫుల్ లెంగ్త్ గౌన్లు, అనార్కలీలు, స్కర్ట్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. కాఫ్ లెంగ్త్ అంటే కాలిపిక్కల వరకూ ఉండే గౌన్‌లు, ప్యాంట్స్, లెగ్గిన్స్, పలాజాలోలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే మడమ కంటే పైకి ఉండే క్రాప్డ్ జీన్స్ అయితే బాగుంటాయి. కాస్త ట్రెండ్‌ని జతచేయాలనుకునే అమ్మాయిలకు ట్రెంచ్‌కోట్స్, విండ్‌చీటర్స్, జాకెట్స్.. వంటివి బాగుంటాయి. ఈ కాలంలో పొట్టిచేతులూ, స్లీవ్‌లెస్‌తో పాటు, రౌండ్, బోట్‌నెక్‌లు బాగుంటాయి.
దుస్తులతోపాటు వేసుకునే నగలు కూడా అమ్మాయిలకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. పెద్దపెద్ద చోకర్‌లు, స్టేట్‌మెంట్ నెక్‌పీస్‌లు ఈ కాలంలో అస్సలు బాగోవు. ఈ కాలంలో వీలైనంత తక్కువ నగలు వేసుకోండి. అస్సలు నగలు వేసుకోకుంటే మరీ మంచిది. పాదాలకు కాన్వాస్ షూస్, రబ్బర్ ఫ్లోటర్స్, జెల్లీషూస్, ఫ్లిప్ ప్లాప్స్, లాంగ్ బూట్స్ వంటివి చాలా బాగుంటాయి. వీటితో పాటు రెయిన్ ప్రూఫ్ జాకెట్స్ అదనపు ఆకర్షణ. మరెందుకాలస్యం.. కాలంతో పాటు ఫ్యాషన్ కూడా మార్చేసి మరింత అందంగా కనిపించండి మరి!