సబ్ ఫీచర్

అత్యాశ అనర్థదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు పుట్టినపుడు వెంట తెచ్చుకొన్నది, మరణించినపుడు వెంట తీసుకొనివెళ్ళేది ఏమీ లేదు. అందుకే మనకు ఉన్నదానితో సంతోషంగా గడపాలి. కావున తృప్తిని మించిన ఆనందము మరొకటి లేదు. అత్యాశ దుఃఖకారమవుతుంది. దీనినే శంకర భగవత్పాదులు ఇలా అంటారు.
శ్లో మూఢ జహీ హిధ నాగ మతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం
యల్ల భసే నిజి కర్మో పాత్తం
విత్తం తేన వినోదయచిత్తం
ఓ మూర్ఖుడా! ధనాన్ని గురించి ఆశను విడువుము. నీ కర్మమువలన సంపాదించిన ధనంతో సంతోషించు. మహాభారత యుద్ధం దుర్యోధనునిలోని ధనేషణ వలన జరిగింది. కొందరికి ఎన్ని సంపదలున్నా తృప్తి ఉండదు. దీనినే ‘అపోవక’ యునికి అంటారు. వంద గలవాడు వేయికి, వేయి గలవాడు లక్షకు, లక్షగలవాడు కోట్లకు పడగలెత్తాలనుకుంటాడు. కోటీశ్వరుడు రాజ్యాధిపత్యం అభిలషిస్తాడు. ఇలా తృప్తిలేని మనుష్యుడు సప్తద్వీపాలిచ్చిన సంతృప్తిపొందడు.
శ్లో వ్యాప్తిం పొందక వగవక
ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్
తృప్తిం చెందని మనుజుడు
సప్తద్వీపములయిన చక్కబడునే
ఒకసారి ఒక పండితుడు తన పాండిత్యంతో రాజును మెప్పించగా ఏం కావాలో కోరుకోమన్నాడు. తనకు భూమి కావలెనని పండితుడు కోరగా రాజు వెంటనే రేపు ఉదయం దగ్గర నుండి సాయంత్రం వరకు ఎంత దూరం వెళ్లి తిరిగి వస్తే అంత భూమిని ఇస్తానన్నాడు. ఆ పండితుడు ఉదయమే పరుగు మొదలుపెట్టి ఆకలి వేస్తున్నా అన్నం తినకుండా పరుగెత్తి సూర్యాస్తమానం అయ్యేసరికి తిరిగి వచ్చు సమయంలో కళ్ళు తిరిగి క్రిందపడి మరణించాడు. చూశారా! దురాశాపరుడైన పండితునికి ఏం జరిగిందో? ఇంతటి ఆశావాదిని ఆరడుగుల నేల త్రవ్వి పాతిపెట్టారు. ప్రపంచంలో డబ్బులున్నవారిని ధనవంతులనటం సాధారణంగా మనం గమనిస్తున్నాం. అట్టి అదృష్టానికి నోచుకోనివారిని దరిద్రులనటం సహజం. కాని భర్తృహరి సుభాషితంలో అత్యాశగలవాడే దరిద్రుడు అంటాడు. అల్పతృప్తుడే సంతోషంగా ఉన్నవాడే సిరిమంతుడు. మనిషి సుఖంగా ఉండాలన్న ఆశతో డబ్బు సంపాదిస్తాడు. అపారమైన సంపద ఉన్నప్పటికి సంతృప్తిలేనివానికి, బీదవాని అసంతృప్తికి తేడా ఏముంది? సంపదలు కలిగినపుడు మనుషులు పొంగి విర్రవీగుతుంటారు. పేదరికం వస్తే కుమిలిపోతూ ఉంటారు. ఈ రెండింటిని సమదృష్టితో చూడడం అలవాటు చేసుకోవాలి.
వాగ్భూషణం - భూషణం
మృదువైన మాట వేయి వరహాల మూటగా పరిగణిస్తారు. మనిషికి నిత్యమైన, సత్యమైన ఆభరణం అతని వాక్కే కనుక, మాటల చేత మన్నన పొందవచ్చు అంటారు. ఒక వ్యక్తియొక్క సామాజిక అస్తిత్వ, ఉత్థాన పతనాలకు అతని మాటతీరు భావాలను పలికింపజేసే విధానము ప్రధాన కారణమై ఉంటుంది. శ్రీమద్రామాయణంలో వాల్మీకి రామ సుగ్రీవులకు మైత్రి ఘటించిన హనుంతుని గూర్చి రాముని నోట ఈ మాటయే చెప్పించాడు. హృదయాన్ని కదిలించే శుభదాయకమైన అభిభాషణం ఎప్పుడూ ఆరోగ్య లక్షణం అన్నమాట. ఏం చెప్పాడు అనేదానికన్నా ఏ విధంగా చెప్పాడు అన్నది ముఖ్యం. అటువంటి సంభాషణా చతురత కలిగినవాడు ఎలాంటి పనినైనా సాధించగలుగుతాడు. అట్లే హనుమ అశోక వృక్షం పైనుండి సీతకు తెలిసేటట్లు అర్థవంతమైన మనుష్య భాషణములతో రామచరిత్ర కీర్తన చేసాడు. మధురాక్షర సంభరితమైన ఆ మాటలు ఆమె మానసిక వైకల్యమును పోగొట్టి బలాన్ని ప్రాభవాన్ని కలిగిస్తాయన్నది అతని ఆలోచనలో పరమార్థం. ఆ మాటలు విన్న సీత మరణోద్యమం మాని మెల్లగా తలయెత్తి పైనున్న హనుమంతుని చూసింది. అపుడు హనుమ ఆమె దగ్గరకు వచ్చి ఆమె సందేహాలకు సమాధానాలు చెప్పి విశ్వాసం కలిగించి జీవితాశను చిగురింపజేశాడు. ఇది హనుమ వాక్చాతుర్యం.
విదురుడు మహాభారతంలో ధృతరాష్ట్రునితో ఇలా అంటాడు-
కం చెలిమియు, పగయును తెలివియు
కలకయు, ధర్మంబు పాపగతియును పెంపుం
తులువతనంబును వచ్చును
పలుకబడిన కాన పొసగ పలుకగ వలయున్
మనం మాట్లాడే తీరునుబట్టే స్నేహం పెరుగుతుంది. విరోధం వస్తుంది. తెలివిగా కార్యం సానుకూలవౌతుంది. బాధ కానీ, ధర్మం కానీ, పాపవర్తనం కానీ, అభివృద్ధి కానీ, నీచత్వం కానీ, పలుకుబడివలన వస్తుంది. ఒక్కమాటతోనే స్నేహం కలుగుతుంది. ఒక్కమాటతోనే వికటిస్తుంది. ఏదైనా మన నోటి మాటను బట్టే.. నోటి దురుసుతనం మహాప్రమాదకారి. ఎంతో సంయమనంతో ఆలోచించి ఆచి తూచి మాట్లాడటం నేర్చుకోవాలి.
కం పురుషుండు రెండు తెరగుల
ధీర నుత్తముడనగ బరగు తానెయ్యడలం
పరుసములు పలుక కునికిన్
దురితంబులు నొరయు పనులు దొరకుట చేతనన్
లోకంలో ప్రతి వ్యక్తి మంచివాడిననిపించుకోవాలనే అనుకుంటాడు. కాని మనస్సు వాడినలా ప్రవర్తించనీయదు. మానవుడు ఉత్తముడనిపించుకోవటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి ఎటువంటి పరిస్థితిలోను ఇతరుల గురించి పురుష వాక్యాలు పలుకకుండా ఉండటం. రెండు పాప కార్యాలల జోలికి పోకుండా ఉండటం. కొంతమంది ఎదుటివారు బాధపడేటట్లు కఠినంగా మాట్లాడతారు. కాని మననెప్పుడూ తిట్టరు. కోకిల మనకేమీ మేలు చేయదు. కాని కాకి అరుస్తుంటే దానినవతలకు కొడతారు. కోకిల కూస్తే తాము కూసి మరలా మరలా దానితో కూయించి ఆనందిస్తారు. ఎందుకని? పరుష భాషణునికి లోకమంతా శత్రువులే. మృదుభాషణునికి లోకమంతా బంధువులు! మనం మాట్లాడే భాష బాగుండాలి. లోకంలో మాటామాటా కలిస్తే ప్రయాణం. మాట విభేదంవలన ప్రళయం వస్తుంది. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ‘వందేమాతరం’ అన్న ఒక్క మాట మంత్రమై ప్రతినోట వినిపించింది.

-యామిజాల సుబ్రహ్మణ్య శర్మ