సబ్ ఫీచర్

కలిసిన పేగుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకటి కాదు.. రెండు కాదు.. అక్షరాలా అరవై ఎనిమిది సంవత్సరాల ఎడబాటు.. ఎప్పుడో విడిపోయిన పేగుబంధం ఇనే్నళ్ల తర్వాత కలిసింది. ఊహ తెలియని వయసులో విడిపోయిన కొడుకు డెబ్భై ఒక్క సంవత్సరాల వయస్సులో తల్లిని కలిశాడు. మనిషి సగటు వయసు 60 నుంచి 70 సంవత్సరాలు. కానీ తొంభై రెండు సంవత్సరాల ఆ తల్లి కొడుకు కోసం ఎదురుచూస్తూ బతికింది. విధే ఆ తల్లీ కొడుకులను విడదీసింది. మళ్లీ విధే వారిద్దరినీ కలిపింది.
కొరియా అప్పట్లో ఒక్కటిగా ఉండేది. కొరియాలోని ఓ ఊర్లో లీకెయుం సీయోం దంపతులు ఉండేవాళ్లు.. వాళ్లకు ఒక కొడుకు, ఒక కూతురు. సంతానం చిన్నగా ఉన్నప్పుడే అక్కడ యుద్ధం మొదలైంది. యుద్ధం అంటేనే విధ్వంసం.. విచ్ఛిన్నం కదా.. అలా యుద్ధం కొరియాను రెండు ముక్కలు చేసి ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడగొట్టింది. దేశంతో పాటు లీ కుటుంబం కూడా విడిపోయింది. లీ తన కూతురుతో దక్షిణ కొరియాలో ఉండిపోయింది. లీ భర్త, మూడేళ్ళ కొడుకు ఉత్తర కొరియాలో ఉండిపోయారు. వీళ్లేకాదు.. ఎన్నో వేల కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఆ రెండు దేశాల సరిహద్దుల దగ్గర తమ వారిని కలిసేందుకు ఎన్నో కళ్లు నిరీక్షించేవి.. కళ్లని, ఆశల్ని ఆ ఇనుప కంచెలకు అతికించి సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉండేవారు వారు చాలామంది. కానీ ఎవరూ ఇటు రావడానికి కానీ, అటు వెళ్లడానికి కానీ వీల్లేదు. రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలు కూడా అంతే.. కాలక్రమేణా ఉద్రిక్తతలు చల్లారాక 1985 నుంచి విడిపోయిన వారి కుటుంబ సభ్యులను లాటరీ పద్ధతిలో కలుసుకునేందుకు అనుమతించడం మొదలుపెట్టారు. ఎవరినైనా కలుసుకోవాలంటే దరఖాస్తు చేసుకోవాలి. వాటిని లాటరీ తీసి, విజేతలను తమవారిని కలుసుకునేందుకు అనుమతిని ఇస్తారు. అదిగో అలా వచ్చిన అవకాశమే తల్లి లీని, కొడుకు రీ చెంతకు చేర్చింది. ఇలా కుటుంబ సభ్యులు ఒకరినొకరు కలుసుకుని, చూసుకుని, ఉద్వేగాల్ని కలబోసుకుని కంటతడి పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది తమ ఆత్మీయుల కోసం ఎదురుచూస్తూనే కాలం చేసేవాళ్లు.
తల్లి లీని వదిలినప్పుడు ఆ కొడుకు వయసు మూడు సంవత్సరాలు. ఇప్పుడు అతని వయస్సు 71 సంవత్సరాలు. ఆ సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఇటీవల ఆ తల్లీకొడుకులు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఆ అవ్యక్తమైన ఆ పేగుబంధం కన్నీరు కార్చింది. లీ తన భర్త పాత ఫొటో చూసి, ఆ ఎడబాటును గుర్తు చేసుకుని ఆమె కన్నీటిధార మరింత పెరిగింది. చాలారోజులపాటు భర్త బతికున్నాడో లేదో తెలియదు లీకి. జీవితాంతం భర్త జ్ఞాపకాలతోనే గడిపింది. కొడుకును చూడటం కోసమే లీ 92 సంవత్సరాల దాకా తన ఆయుష్షును కాపాడుకున్నట్టుంది. పేగుబంధం అంటే ఇదేనేమో మరి! *