సబ్ ఫీచర్

అందరి కళ్లూ యూపీపైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు అంటూ ఊహాగానాలు జో రందుకోవడంతో దేశంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని కాగలరా? లేదా? అన్నది ఇప్పుడు ప్రజల ముందున్న ప్రధాన ప్రశ్న. భాజపాలోని మరొకరు ఆ పదవి లోకి వస్తారా? ప్రతిపక్ష నేత మరెవరైనా వస్తారా? అన్నది రెండో ప్రశ్న. తిరిగి లోక్ సభలో సొంతంగా భాజపా ఆధిక్యతను సంపాదించుకుంటే మోదీ మరోసారి ప్రధాని కావడం తథ్యం. అది జరగలేని పక్షంలో మరెవ్వరూ ఆధి క్యత సంపాదించుకోలేరు. దేశం మరోమారు సంకీర్ణ యుగంలోకి, అస్థిర రాజకీయ ప్రయోగాలలోకి నెట్టివేయబడక తప్పదు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో 80 లోక్‌సభ స్థానాలతో దేశంలో అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్ నిర్ణయాత్మక ప్రభావం చూపనున్నది. అందుకనే ఇప్పుడు అందరూ ఆ రాష్ట్రంపై దృష్టి సారిస్తున్నారు. 2013లో తనను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించగానే మొదటగా ఆ రాష్ట్రం వైపే మోదీ ప్రత్యేక ద్రృష్టి సారించారు. తనకు నమ్మకస్తుడైన అమిత్ షాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఆ రాష్త్ర ఇన్‌చార్‌గా నియమింపచేసుకున్నారు. సంఘ పరివార్ సంస్థలు అన్ని ఉమ్మడిగా క్షేత్ర స్థాయిలో ప్రచార బాధ్యతలు చేపట్టేటట్లు చేసుకున్నారు. తాను స్వయంగా వారణాసి నుండి పోటీ చేయడం ద్వారా యూపీ ప్రజలను బిజెపి వైపు సమీకరించేకొనే విధంగా మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి 73 సీట్లను గెల్చుకోగలిగారు. ఆ బలంతోనే బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.
మోదీ మళ్లీ ప్రధాని కాకూడదని పట్టుదలగా ఉన్న వారంతా ఇప్పుడు యుపి వైపు చూస్తున్నారు. రాజకీయ వైరాన్ని పక్కకు నెట్టి బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒక అవగాహనకు వచ్చారు. ఆ అవగాహనతోనే ఇటీవల ఉప ఎన్నికలలో బిజెపిని మట్టి కురిపించడంతో వారిలో ఉత్సాహానికి అంతులేకూండా పోయింది. వారితో ఆర్ ఎల్‌డి అధినేత అజిత్ సింగ్ కూడా చేరా. కాంగ్రెస్‌ను తమ కూటమిలో చేర్చుకోవడానికి వీరు పెద్దగా ఆసక్తి చూపక పోయినా, నాలుగైదు సీట్లు ఇచ్చినా చేరడానికి రాహుల్ గాంధీ ఆసక్తి చూపుతున్నారు. అయితే బిజెపికి కూడా సొంత వ్యూహాలు ఉన్నాయి. ఇప్పటికే తనతో ఉన్న అప్నా దళ్, సుహాదేవ భారతీయ సమాజ్ పార్టీ లతో పాటు అజిత్ సింగ్‌ను కూడా తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నది. అజిత్ సింగ్‌కు మూడు సీట్లు మించి ఇవ్వడానికి ఎస్పీ, బీఎస్పీ సిద్ధంగా లేవు. బిజెపి అయితే ఐదు సీట్లు ఇస్తానంటుంది. ఈ మొత్తం ఏడు పార్టీలకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో 94 శాతం ఓట్లు వచ్చాయి. కాబట్టి వారే యుపి భవిష్యత్‌ను నిర్ణయిస్తారు.
బిజెపి, రెండు మిత్ర పక్షాలు కలిపి 41.4 శాతం ఓట్లతో 325 సీట్లు గెల్చుకోగా, కాంగ్రెస్, ఎస్పీ కలిపి 28.2 శాతం ఓట్లతో 54 సీట్లు సాధించాయ. ఇక బీఎస్పీ 22.2 శాతం ఓట్లతో 19 సీట్లు గెలిచింది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డి ఓట్లను కలుపుకొంటే 52.2 శాతం ఓట్లు అవుతాయి. ఆరు శాతం ఓట్లు తెచ్చుకున్న ఇతర పార్టీలు లోక్‌సభ ఎన్నికలలో దాదాపు అదృశ్యం కావచ్చు. లేదా అవి రెండు కూటములలో ఏదో ఒక వైపు వేళ్ళ వలసిందే. ఈ విధంగా గణాంకాలు వేసుకొంటే ప్రతిపక్షాల ఆధిపత్యమే కనిపిస్తోంది. ఈ ఓట్ల కూడికాలు ఫలిస్తే బిజెపి సీట్లు సగానికి పైగా పడిపోక తప్పదు. అయితే రాజకీయాలు గణితం మేరకు జరగవు కదా.
ఇప్పుడు ప్రధానంగా భీమ్ ఆర్మీ, ఏంఐఏంల ఉనికి యూపీలో భాజపా వారికి కంగారు పుట్టిస్తున్నది. వీరిద్దరూ ప్రతిపక్షాల కూటమితో కలవడానికి సిద్ధంగా లేరు. సొంతంగా పోటీ చేస్తే బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చిన్నట్లు కాగలదు. అప్పుడు బీజేపీకే లబ్ది చేకూరే అవకాశం ఉంది. భీమ్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయలేదు. ఒక ఉద్యమ వేదికగా మాత్రమే ఉంది. మొదటి సారిగా ఇప్పుడు పోటీకి సిద్దపడుతున్నది. ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఇప్పుడు జైలులో ఉన్నారు. దళిత యువకులు భీమ్ ఆర్మీ పట్ల ఆకర్షితులవుతున్నారు. వీరు ఎన్నికలలో పోటీ చేయడం మాయావతికి సవాల్‌గా పరిణమించింది. అందుకనే ఆమె మొదటి సారిగా పొత్తుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మాయావతి బహిష్కరించిన బీఎస్పీ మాజీ ఉపాధ్యక్షుడు, జాతీయ సమన్వయకర్త జైప్రకాష్ సింగ్ ఇప్పుడు భీమ్ ఆర్మీలో చేరటం ఆమెకు ఆందోళన కలిగిస్తున్నది. పశ్చిమ యుపిలో భీమ్ ఆర్మీ ఎన్నికలలో పోటీ చేస్తే దళిత్ ఓటర్లలో చీలిక అనివార్యం కాగలదు. ఇటువంటి పరిణామాలను బిజెపి నాయకులు సహజంగానే ఆస్వాదిస్తారు.
మరోవంక మజ్లిస్ పార్టీ (ఎంఐఎం) పోటీ చేయడం కూడా ఎస్పీ-బీఎస్పీ కూటమికి సవాల్‌గా మారుతున్నది. సీట్లు రాకపోయినా పలు రాష్ట్రాల్లో అభ్యర్థులను నిలబెట్టి, ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన సీట్లు గెల్చుకొనే అవకాశం లేకపోయినా బిజెపి వ్యతిరేక ఓటర్లలో చీలిక తీసుకు రావడంలో కీలక పాత్ర వహించే అవకాశం ఉంది. ఇంతకు ముందు కర్ణాటక, బిహార్, యుపి, మహారాష్ట్ర ఎన్నికలలో ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టారు. మహారాష్టల్రోఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. యుపి అసెంబ్లీ ఎన్నికలలో 38 మంది అభ్యర్థులను నిలబెట్టారు. ఒక్క అభ్యర్థి గెలవలేక పోయినా ఒవైసీ ప్రచారం చేయడం ముస్లిం ఓటర్లలో గందరగోళం సృష్టిస్తున్నది. ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెడుతున్నారు. ఒవైసీ ఉద్రేకంగా చేసే ఎన్నికల ప్రచారంతో- బిజెపికి అనుకూలంగా ఓటర్లు సమీకృతం కావడానికి దారితీస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఆయన అభ్యర్థులను నిలబెట్టడం పరోక్షంగా బిజెపికి మేలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. యూపీలో ప్రతిపక్షాలు ఒకటిగా పోటీ చేస్తే రాగల పరిణామాలను బిజెపి తక్కువగా చూడటం లేదు. అందుకనే మోదీ స్వయంగా ఆ రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రతి వారం దాదాపుగా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతిపక్షాలలో చీలికలు తీసుకురాగాల అంశాలను విస్మరించడం లేదు. తనకు వ్యతిరేకంగా ఇపుడు కలుస్తున్న వారు మరెప్పుడు విడిపోతారన్నదే ప్రశ్న అంటూ ఈ మధ్య మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు విడిపోతారా? ఎన్నికల తర్వాత విడిపోతారా? అన్నది తేల్చవలసి ఉన్నదని అంటూ వారికి పట్టం గడితే అస్థిరత్వం తప్పదని హెచ్చరిస్తున్నారు.
బిజెపికి వ్యతిరేకంగా ఒక స్థానంలో ఒకే అభ్యర్థిని ప్రతిపక్షాలు నిలబెట్టేందుకు రాజకీయంగా త్యాగాలు చేయడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్దపడుతున్నారు. యుపిలో కాంగ్రెస్ ఉనికిని మిగిలిన ప్రతిపక్షాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ బలంగా ఉన్న ఇతర రాష్ట్రాలలో తమకు కొన్ని సీట్లు ఇస్తేనే యూపీలో పొత్తని మాయావతి స్పష్టం చేశారు. అందుకనే పొత్తుల విషయం కాంగ్రెస్‌లో అసహనాన్ని కలిగిస్తున్నది. మరోవంక ప్రియాంక గాంధీని ఎన్నికలలో నిలబెట్టే విషయమై కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేక పోతున్నది. సోనియా గాంధీ ఆరోగ్యం అంత బాగా లేకపోవడంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నుండి ప్రియాంకను నిలబెడితే దాని ప్రభావం మొత్తం రాష్ట్రంలో ఉంటుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అందుకు సోనియా గాంధీకి ప్రధానంగా రెండు అభ్యం తరాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటగా- కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పార్టీపై అదుపు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రియాంక ఎంపీగా గెలిస్తే పార్టీలో రెండో అధికార కేంద్రంగా మారి, రాహుల్ నాయకత్వానికి సవాల్ గా మారవచ్చని భయపడుతున్నారు.
కేంద్రంలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని గాని, రాహుల్ ప్రధాని కాగలరని గాని కాంగ్రెస్ భావించడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ పోటీ చేసే స్థానాలే మొత్తం 300 దాటక పోవచ్చని చెబుతున్నారు. పార్టీలో మిగిలిన ఏకై టర్ఫ్ ముక్క అయిన ఇందిరా గాంధీని పోలి ఉండే ప్రియంకా గాంధీ ప్రభావాన్ని ఇప్పుడే వృథా చేసుకోవడం ఎందుకనే ప్రశ్న కూడా ఆ పార్టీ వర్గాలలో తలెత్తుతున్నది. కేంద్రంలో అధికారానికి కాంగ్రెస్ పోటీ ఇచ్చే సమయంలో ప్రియాంకను పోటీ చేయనిస్తే ఎక్కువ ప్రయోజనం అని భావిస్తున్నారు.
ఎన్నికల నాటికి ఎస్పీ, బీఎస్పీలను బలహీనం చేసే దిశగా బిజెపి కొన్ని ఎత్తుగడలను అమలు పరచవచ్చు. అఖిలేష్ యాదవ్ బాబాయి శివపాల్ యాదవ్ మరో పార్టీ పెట్టడాన్ని తేలిగ్గా చూడనవసరం లేదు. గత శాసన సభ ఎన్నికల ముందు ఎస్పీ-కాంగ్రెస్‌ల మధ్య పొత్తుకు వ్యతిరేకంగా శివపాల్ గళం విప్పడం, అఖిలేష్ నాయకత్వాన్ని నీరు కార్చే ప్రయత్నం అమర్ సింగ్ చేయడం వంటి సంఘటనలు బిజెపి ప్రోద్భలం లేకుండా జరిగే అవకాశం లేదు. దళితుల్లో తన పాలన పట్ల నెలకొన్న ఆగ్రవేశాలను చల్లార్చడానికి భాజపా ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రయత్నాల వల్ల ఆయా వర్గాలలో తాము ఓట్లను పెంచుకోలేక పోయినా, వారు ఆవేశంతో ఐక్యత సాధించే అవకాశాలను భాజపా నేతలు నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పోటాపోటీ వ్యూహాల మధ్య ఉత్తరప్రదేశ్ రాజకీయాలు జాతీయ స్థాయలో విశేష ప్రభావం చూపగలవు.

--చలసాని నరేంద్ర